Jump to content

Recommended Posts

Posted

sakshi.jpg

ఊసరవెల్లి రంగులు మార్చినట్టు , పత్రికలు ప్రాంతాన్ని బట్టి వార్తను ఇట్టే మార్చేయగలవు. అదెలా అంటే …ఇదిగోండి సాక్షి పత్రికలో వచ్చిన వార్తలాగా ! ఎవరూ చూడరనుకుందో , ఎవరు చూస్తే నాకేంటి అనుకుందో కానీ … మొదటి పేజిలోనే సాక్షి ఈ ప్రావీణ్యాన్ని ప్రదర్శించింది.

కేంద్ర పరిశ్రమల శాఖకు సమర్పించిన ఒక దరఖాస్తు విషయంలో తెలంగాణా , ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ ప్రభుత్వాల మధ్య వాద ప్రతివాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే కదా. ఈ విషయంలో ఎవరిది తప్పు , ఎవరిది ఒప్పు అన్నది పక్కనబెడదాం. మీడియా ముఖ్యంగా సాక్షి పత్రిక ఈ వివాదంలో ఎలా వ్యవహరించిందో చూద్దాం. ” ఏపీ కాపీ కొట్టింది, అడ్డదారులు తొక్కింది ” అని సాక్షి పత్రిక తన తెలంగాణా ఎడిషన్ మొదటి పేజిలో తీర్పు ఇచ్చింది. అదే పత్రిక ఏపీ ఎడిషన్లో మాత్రం …” ఏపీ చోరీకి పాల్పడిందని తెలంగాణా సర్కారు ఫిర్యాదు చేసింది , తమ దరఖాస్తును మక్కీకి మక్కీ కాపీ కొట్టిందని పేర్కొంది ” … అని రాసింది. అంటే ప్రాంతాన్ని బట్టి అక్కడ దోషిగా అని పిలిచిన వాళ్ళనే , ఇక్కడ ముద్దాయి అని పిలుస్తారన్నమాట. ఇది ఫక్తు రాజకీయ వ్యాపారమా లేక జర్నలిజమా ??

అంతేనా …తెలంగాణా ఎడిషన్లో హెడ్డింగ్ ” ఏపీ కాపీ ”
ఏపీ ఎడిషన్లో హెడ్డింగ్ ” బాబు సర్కారు చోరీ “. చూసారా పత్రికలూ శీర్షిక విషయంలో కూడా ఎక్కడ , ఏది తమకు ఉపయోగమో అలోచించి …చించి ..మరీ రాస్తాయి. పిచ్చి జనాలు మేము ఏది రాస్తే దాన్నే నమ్ముతారన్న ధీమా మరి..

సాక్షి రెండు ఎడిషన్లలో వచ్చిన ఒకే వార్తను కింద చూడండి ..

ఏపీ కాపీ ( తెలంగాణా ఎడిషన్)

సాక్షి, హైదరాబాద్: సులభ వాణిజ్యంలో ప్రపంచబ్యాంక్ ర్యాంకు కోసం ఏపీ అడ్డదారులు తొక్కింది.. తెలంగాణ అధికారులు కష్టపడి రూపొందించిన ఆన్‌లైన్ దరఖాస్తును మక్కీకి మక్కీ కాపీ చేసింది.. దానిని తమదిగా చూపిస్తూ కేంద్ర పరిశ్రమల శాఖకు సమర్పించింది.. ఈ వ్యవహారాన్ని పసిగట్టిన తెలంగాణ అధికారులు ఏపీ ‘చోరీ’పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు

బాబు సర్కారు చోరీ ! ( ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ )

సాక్షి, హైదరాబాద్ : సులభ వాణిజ్యంలో ప్రపంచబ్యాంక్ ర్యాంకు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆన్ లైన్ చోరీకి పాల్పడిందని తెలంగాణా సర్కారు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. తమ అధికారులు రూపొందించిన ఆన్ లైన్ దరఖాస్తును మక్కీకి మక్కీ కాపి చేసిందని, ఆ దరఖాస్తును తమదిగా చూపిస్తూ కేంద్ర పరిశ్రమల శాఖకు సమర్పించిందని పేర్కొంది.

Posted

lite..

andaru anthe...ys, cbn, eenadu, abn, kcr..

antha oppurtunists eh....ikkado mata akkado mata...*&*

Posted

looks like bad editing man... copy chesindi pakkana two .. pettesaadu tondarlo.... and nice copy paste work also... okko word ki distance baaga pettesaadu tondarlo... photoshop classes inkosari teeskuntey better ani naa feeling man...

Posted

This is the smallest thing from Sakshi... Panchayath elections lo numbers kuda marchesaadu... Cricket match gelavaka mundhey win ani raasevaadu... idhi picha light  @3$%

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...