HtmlBro Posted July 13, 2016 Report Posted July 13, 2016 ATA ఫౌండింగ్ మెంబర్ మా మేనమామ Dr .సుభాష్ చంద్రా రెడ్డి. దాంట్ల గుంటనక్కలు చేరినంక మా మామ కూడా దూరంగున్నడు. ATA ల వున్న కొందరు తెలంగాణా ఆపడానికి చాలా ట్రయ్ చేసిన్రు. మూడేళ్ళ క్రితం ఒక రోజు నాకు ATA మెంబర్లు లాస్ వేగస్ నించి ఫోన్ చేసిన్రు" విజయ గారు మిమ్మల్ని ATA ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నమని"(లాస్ వేగస్ల ఎన్నికలయితయి) . నాకు తెల్వకుండా , నన్ను అడగకుండా ఎట్ల ఎన్నుకుంటరు అని గట్టిగా అడిగిన , కొంచం సేపు విషయం సాగదీసి , ఎన్నుకున్నం, ఒక రెండేండ్లు టెర్మ్ , ప్లీస్ ఒప్పుకోండి అని అడిగితే , మన వాళ్ళని సరే అని ఒప్పుకొని , నేను మాత్రం దేంట్లో ఇన్వాల్వ్ కాను అని చెప్పి ఫోన్ పెట్టేసిన . ఈ రోజు వీళ్ళు తెలంగాణ గ్లోబల్ కన్వెన్షన్ అని తెలంగాణోళ్ళ తోని ఆంధ్ర ఆర్టిస్ట్లను పిలుస్తున్నరు. ఎప్పుడూ ఉద్యమంల కూడా లేనోన్ని, 'ఒక్క' తెలంగాణ పాట పాడినోళ్ళను కూడా టిక్కెట్ పెట్టి ఇండియా నుంచి మరీ ఆహ్వానిస్తున్నరు. నేను తెలంగాణ సామాజిక సమస్యల మీద , తెలంగాణ ఉద్యమంల పాటలు రాసి పాడిన , తెలంగాణ కోసం పగలు ,రాత్రి సేవ చేసిన , డొనేట్ చేసి ఎన్నో కట్టించిన , ఎందరికో సహాయం చేసిన , ఉద్యమం టైం ల అమెరికాల కూడా మీటింగ్లు పెట్టి , ప్రొటెస్ట్లు చేసిన. ATA వాళ్లకు అవసరమున్నప్పుడు నా పేరు వాడుకొని , ఈ రోజు కనీసం ఆహ్వానించాలని సోయికూడా లేదంటే వాళ్ళ అంతరాత్మకే తెల్వాలె. వీళ్ళు తెలంగాణ రాకుండ ఆపినోళ్లు , ఈ రోజు తెలంగాణ మినిస్టర్ల తోని ఇకిలించుకుంట ఫోటోలు దిగుతుంటే నవ్వొస్తుంది , బాధయితుంది . మన తెలంగాణ మినిస్టర్లు కూడా ఒక్కరోజు కూడా 'జై తెలంగాణ" అననోనికి అప్పాయింట్మెంట్ లిస్తరు, నిజంగ తెలంగాణ కోసం పాటుపడి , బతికేటోనికి ఇయ్యరు . మొన్న తెలంగాణ ఫార్మేషన్ డే కు ఒక నేషనల్ లెవెల్ క్లాసికల్ డాన్సర్ గా అప్ప్లై చేస్తే కనీసం కన్సిడర్ కూడా చేయలే. ఉద్యమం టైం ల కవిత గారి ఫోటోలను మోర్ఫ్ చేసి , బండబూతులు తిడుతున్న ఆంధ్రోళ్ళను నేను ఉతికి ఆరేసిన కని, ఈ రోజు జాగృతి ప్రెసిడెంట్లుగా చలామణి అయితున్నోళ్లకు చెప్తే ఒక్కడు కూడా పట్టించుకోలే , ఇలాంటి అవకాశవాదుల్ని దెగ్గర తీసి చేరదీస్తుండ్రు. ఒక్క మాట వీళ్ళందరికీ చెప్పదలుచుకున్న , మీరు మాలాంటి నిజమయిన తెలంగాణ ఉద్యమ కారుల్ని , తెలంగాణ అభివృద్ధి కోసమే అహర్నిశలు పనిచేసే నిజాయితీ పరుల్ని గుర్తించక పోయినా సరే, మేమెప్పుడూ , ప్రాణం ఉన్నంతవరకు తెలంగాణా క్షేమం కోరుతం, తెలంగాణ అభివృద్ధి కోసం , తెలంగాణ ప్రజల క్షేమం కోసం నిజాయితీగా పని చేస్తం. మీరు మాత్రం మీరు చేరతీస్తున్న లంగలు, దొంగలు, అవకాశ వాదులు , భజన పరుల నుంచి చాలా జాగత్తగా ఉండండి . వాళ్లే మీ మెడకు ఉరితాడయి కూర్చుంటరు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.