rowwdy Posted July 13, 2016 Report Posted July 13, 2016 Yellow Brotheres Ravantha Teddy BJP loki jump antaga News from Great Andhra,,,,,,,,aithe inka end of TDP in TG na????????????????? ఎలాగైతేనేం నాగం జనార్ధన్‌రెడ్డి బీజేపీలో సర్దుకుపోయారు. రేవంత్‌రెడ్డి ఎలాగోలా తెలుగుదేశం పార్టీలో నెట్టుకొచ్చేస్తున్నారు. ఇప్పటికైతే పరిస్థితి ఇది. కానీ, వీరిద్దరి రాజకీయ భవిష్యత్తు ఏంటి.? నాగం జనార్ధన్‌రెడ్డి అంటే ఒకప్పుడు తెలంగాణ టీడీపీలో నెంబర్ వన్. తెలంగాణ టీడీపీకి చీఫ్నంటూ నాగం జనార్ధన్‌రెడ్డి ఒకప్పుడు నానా హంగామా చేశారు. కానీ, చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతం ఆయనకు నచ్చలేదు. దాంతో 'ఆగమాగం' చేసేసి, కొత్త రాజకీయ వేదిక ప్రారంభించి, దాన్ని నడపలేక, భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిపోయారు. అలా నాగం జనార్ధన్‌రెడ్డి, తెలుగుదేశం పార్టీని కొట్టిన దెబ్బ అలాంటిలాంటిది కాదు. ఇక, ఇప్పుడు రేవంత్‌రెడ్డి తెలంగాణ తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కు. కానీ, ఏం లాభం.? ఆయన తెలంగాణలో టీడీపీ అనే బండిని లాగడానికి ఆపసోపాలు పడుతున్న పరిస్థితి. బీజేపీ నుంచి ఆఫర్ వచ్చిందిగానీ, 'మిత్రధర్మం' అడ్డొచ్చేస్తోంది రేవంత్‌రెడ్డికి. లేదంటే, రేవంత్‌రెడ్డి ఎప్పుడో బీజేపీలోకి జంప్ చేసేసేవారే. కాంగ్రెస్‌లోకి వెళ్ళలేక, రేవంత్‌రెడ్డి ఎలాగోలా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారంతే. భవిష్యత్ రాజకీయం ఎలా వుంటుందో ఇప్పుడే ఊహించలేం. కానీ, ఛాన్స్ దొరికితే నాగం జనార్ధన్‌రెడ్డి, తిరిగి తెలుగుదేశం పార్టీలోకి జంప్ చేసేస్తారు. ఎందుకంటే, నాగం వస్తానంటే తెలంగాణ టీడీపీ బాద్యతలు ఆయన చేతుల్లో పెట్టడానికి చంద్రబాబు సిద్ధంగానే వున్నారు మరి. నాగం జనార్ధన్‌రెడ్డి వస్తానంటే రేవంత్‌రెడ్డి ఆహ్వానిస్తారా.? ఇదీ కాస్త ఆలోచించాల్సిన విషయమే. చంద్రబాబు నచ్చజెప్పాలనుకుంటే నచ్చజెబుతారు, లేదంటే 'పోతే పో..' అనేస్తారు. చంద్రబాబు రూటే సెపరేటు. సో, రేవంత్‌రెడ్డికి బీజేపీ నుంచి ఆఫర్ వుంది గనుక, టీడీపీ - బీజేపీ మధ్య వ్యవహారం చెడితే (ఆల్రెడీ చెడేలానే వుంది.. తెలంగాణలో టీడీపీతో అంటకాగడం నష్టమేనన్న నిర్ణయానికి బీజేపీ ఎప్పుడో వచ్చేసింది మరి) నాగం జనార్ధన్‌రెడ్డి టీడీపీలోకి, రేవంత్‌రెడ్డి బీజేపీలోకి జంప్ చేసెయ్యడం ఖాయమట. ఇంతా చేసినా బీజేపీ తెలంగాణలో సత్తా చాటుకోగలదా.? టీడీపీ తెలంగాణలో పూర్వ వైభవాన్ని సొంతం చేసుకోగలదా.? బీజేపీ - టీడీపీ మధ్య ఈ 'రెడ్డి' రాజకీయం రానున్న రోజుల్లో ఎలాంటి మలుపులు తిరగనుంది.? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. Quote
Rahul_PG Posted July 13, 2016 Report Posted July 13, 2016 script evado baaga raasadu gossip industry ki kothaga vachadu anukuntaaa Quote
rowwdy Posted July 13, 2016 Author Report Posted July 13, 2016 3 minutes ago, Rahul_PG said: script evado baaga raasadu gossip industry ki kothaga vachadu anukuntaaa inka avaru rastaru Great cheddy ANdhra gadu. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.