sri_india Posted July 16, 2016 Report Posted July 16, 2016 <iframe src="https://www.facebook.com/plugins/post.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2Fmahesh.kathi%2Fposts%2F10154303801816115&width=500" width="500" height="479" style="border:none;overflow:hidden" scrolling="no" frameborder="0" allowTransparency="true"></iframe> through crowd founding tho movie produce chesthadu antaaa.... Mahesh kathi (sampoornesh babu movie hrudaya kaleyam movie police character https://www.facebook.com/mahesh.kathi?fref=ts ) story: నూతన్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ’సింగపూర్’సూరిబాబు ని రైతు సరోజమ్మ, స్టూడెంట్ లీడర్ తేజ, స్కూల్ ప్యూన్ కేశవులు కిడ్నాప్ చెయ్యడానికి ప్లాన్ చేస్తారు. ఎన్నికల్లో ప్రామిస్ చేసినట్టుగా రైతురుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చెయ్యకుండా భర్త ఆత్మహత్యకు కారణమయ్యాడని సరోజమ్మకు సూరిబాబు అంటే కోపం. ఇంటికో ఉద్యోగమన్న సూరిబాబు స్లోగన్ తో ఫ్లాట్ అయిన తేజ, తన ఒంటికి కూడా ఉద్యోగం ఒస్తుందనే ఆశతో ఇంటింటికీ తిరిగి ఓట్లేయించాడు.ఇంటికొకటి కాదుకదా రాష్ట్రంలో ఒక్కటికూడా కొత్త ఉద్యోగం సృష్టించకపోగా, ఉన్న జీవనోపాధుల్ని కూడా పోగొడుతున్న సూరిబాబంటే పరమ కసి తేజకు.స్కూల్ ప్యూన్ అయినా,ఫీజ్ రీయింబర్సుమెంట్ పుణ్యమా అని పిల్లల్ని ఇంజనీరింగ్, మెడిసన్ చదివిస్తున్నాడు కేశవులు. ఎన్నికలయ్యాక ఈ విషయంలో సూరిబాబు ఏనిర్ణయమూ తీసుకోనికారణంగా పిల్ల భవిష్యత్తు అగమ్యగోచరం అవుతుందనే భయంతో సూరిబాబంటే అసహ్యాన్ని పెంచుకున్నాడు కేశవులు. ఈ ముగ్గురికీ ఉన్నది ఒక్కోఎకరం పొలం. ఇప్పుడు అదికూడా కొత్తరాజధానికోసం కాపుకాసిమరీ లాక్కుంటుంన్న సూరిబాబుని ఏదో ఒకటి చెయ్యాలనే నిర్ణయానికి వచ్చారు.నూతన్ ప్రదేశ్ కొత్తరాజధానిని సింగపూర్ చెయ్యాలని పట్టుబట్టి పొలాలు లాక్కొనే పనిలో భాగంగా గెస్ట్ హౌస్ లో ఉన్న సూరిబాబుని తెలివిగా కిడ్నాప్ చేస్తారు. కిడ్నాపింగ్ లో జరిగిన చిన్న యాక్సిడెంట్ కారణంగా ’సింగపూర్’సూరిబాబుకి టెంపరరీ మెమరీలాస్ వస్తుంది. రివెంజ్ తీర్చుకుందామనుకుంటే అసలు మెమరీనే లేని సూరిబాబు చేతిలోకి వచ్చేసరికీ సరోజమ్మ-తేజ-కేశవులుకు ఏం చెయ్యాలో అర్థంకాదు. సేఫ్టీ కోసంఅతని గడ్డం తీసేసి రూపురేఖలు కొంత మారుస్తారు. ముఖ్యమంత్రి మిస్ అయ్యాడని తెలిస్తే నూతన్ ప్రదేశ్ అల్లరి అయిపోవడంతోపాటూ కార్పొరేట్ లాబీ తన సపోర్ట్ ఎక్కడ లాగేసుకుంటుందో అనే భయంతో సూరిబాబు కొడుకు మండలేష్ లేని సూరిబాబు గెస్ట్ హౌస్ లోనే ఉన్నట్టుగా నాటకం మొదలుపెడతాడు. మెమరీలేని సూరిబాబుని బాగుచెయ్యడానికి తేజ తన సైక్రియాటిస్ట్ గర్ల్ ఫ్రెండ్ ప్రియ హెల్ప్ అడుగుతాడు. ప్రియ థెరపీలో జరిగే ఫన్నీ మిస్టేక్ వల్ల సూరిబాబు తనని తాను భూమి కోల్పోయి ఆత్మహత్య చేసుకున్న రైతు రాజయ్య అనుకుంటాడు. సింగపూర్ సూరిబాబు విధానాలకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తనని తాను రాజయ్య అనుకుంటున్న సూరిబాబే ఉద్యమం లేవదీస్తాడు.సరోజమ్మ-తేజ-కేశవులు క్రియాశీలకంగా ఆ ఉధ్యమంలో భాగం అవుతారు. గెస్ట్ హౌస్ లో లేని సూరిబాబుని ఉన్నాడని నమ్మిస్తూ మండలేష్ తనే అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని ప్లాన్ చేస్తాడు.రాజయ్యలాగా ఉద్యమం చేస్తున్న సూరిబాబుని చంపించే ప్రయత్నంలో తండ్రి అనే నిజం తెలిసినా చంపెయ్యడానికే మండలేష్ ట్రైచేస్తాడు.చివర్లో మెమరీ రికవర్ అయ్యిన ’సింగపూర్’సూరిబాబు తన తప్పు తెలుసుకుంటాడా ? లేదా ! అనేది కథ. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.