NinduChandurudu Posted July 20, 2016 Report Posted July 20, 2016 మహేష్-కొరటాల సినిమా కోసం నిర్మాతల క్యూ Wed Jul 20 2016 17:00:01 GMT+0530 (IST) facebooktwittergoogle pluswhatsapp ఎవరెవరితోనో అనుకున్న కాంబినేషన్ లో చివరికి ఎవరెవరితోనూ సెట్టవుతాయి. మురుగదాస్ సినిమా తర్వాత మహేష్ బాబుతో పని చేసే దర్శకులుగా విక్రమ్ కుమార్.. త్రివిక్రమ్ లాంటి వాళ్ల పేర్లు వినిపించాయి. మరోవైపు కొరటాల శివ ‘జనతా గ్యారేజ్’ తర్వాత చేసే సినిమాల హీరోలంటూ రామ్ చరణ్ తో పాటు మరికొందరి గురించి చర్చ నడిచింది. కానీ ఆశ్చర్యకరంగా ‘శ్రీమంతుడు’ కాంబినేషనే మళ్లీ తెరమీదికి వచ్చింది. మహేష్-కొరటాల కలిసి మరో సినిమా చేయడం దాదాపుగా ఖాయమైపోయింది. ఆల్రెడీ కొరటాల డేట్లు సంపాదించిన డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తారని సమాచారం. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరో విశేషం ఏంటంటే.. ఇందులో తాము కూడా నిర్మాణ భాగస్వాములుగా మారుతామంటూ కొందరు పేరున్న నిర్మాతలు ముందుకొస్తున్నారట. అందులో దిల్ రాజు కూడా ఉన్నట్లు సమాచారం. రాజు ఇంతకుముందు మహేష్ తో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నిర్మించాడు. ఐతే మళ్లీ మహేష్ తో సినిమా కోసం ట్రై చేశాడు కానీ.. కుదర్లేదు. మహేష్ సినిమా అంటే బడ్జెట్ అటు ఇటుగా రూ.100 కోట్లకు టచ్ అయిపోతున్న నేపథ్యంలో కొంత వరకు పెట్టుబడి పెట్టడానికి అవకాశముంది. మురుగదాస్-మహేష్ సినిమాకు కూడా నలుగురైదుగురు నిర్మాతలు జత కలిశారు. కొరటాల దర్శకత్వంలో చేయబోయే సినిమాకు కూడా రాజుతో పాటు ఇంకా ఒకరిద్దరు నిర్మాతలు యాడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి Quote
BaabuBangaram Posted July 20, 2016 Report Posted July 20, 2016 lol bob...huge losses ante kashtam kadha ....andhuke losses ni kuda equal ga distribute chesukuntaaru anukunta...konchem ayina bharam thaggadaniki Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.