Swas Posted July 26, 2016 Author Report Posted July 26, 2016 నక్కపల్లిలో ప్రపంచంలోనే తొలి ఆర్గనిక్ డిశాలినేషన్ ప్లాంట్: నక్కపల్లిలో సుమారు 1200 ఎకరాల్లో చేపట్టనున్న బయోటెక్ క్లస్టర్లో ప్రపంచంలోనే తొలిసారిగా ఆర్గానిక్ డిశాలినేషన్ ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నారు. ఈ విధానంలో సముద్రం నీటి నుంచి మిథేన్ గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తారు. దీని వల్ల అత్యంత చవకగా సముద్ర నీటిని మంచి నీటిగా మార్చేందుకు వీలు కలుగుతుంది. నీరు, విద్యుత్తు, గ్యాస్ వినియోగించకుండా లవణాలను ఉత్పత్తి చేయడం దీని ప్రత్యేకత. మరో వైపు బయోమెడికల్‌కు సంబంధించి, మెడిటెక్ సంస్థ ప్రతినిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకునేందుకు ఆసక్తి కనబరిచారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్, సీఎం అదనపు కార్యదర్శి రాజమౌళి, ఫ్రాస్ట్ అండ్ సుల్వెన్ సంస్థ ప్రతినిధులు దాస్, సంగీత, గోదావరి నాలెడ్జ్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ శ్రీనివాస్ శంకర్ ప్రసాద్, లేపాక్షి బయోటెక్ పార్క్ సీఈవో సుధాకర్, మెడిటెక్ ప్రతినిధులు హాన్స్, శ్రీనివాస్ పాల్గొన్నారు. Quote
Swas Posted July 26, 2016 Author Report Posted July 26, 2016 తీర గ్రామాల్లో సోలార్ ఆర్ఓ ప్లాంట్లు సముద్రపు నీటి ప్రభావంతో భూగర్భ జలాలు ఉప్పునీళ్లుగా మారిన గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులను తొలగించేందుకు జినర్జీ సోలార్ ప్రాజెక్ట్స్, దాని అనుబంధ సంస్థ అలెక్ట్రోనా ఎనర్జీ కంపెనీ ముందుకు వచ్చాయి. సౌర విద్యుత్‌తో నడిచే శుద్ధ జల కేంద్రాలు (ఆర్ఓ ప్లాంట్లు) ఏర్పాటు చేస్తామని తెలిపాయి. కొల్లేరు లేదా పశ్చిమగోదావరి జిల్లాలోని మరో ప్రాంతంలో ప్రయోగాత్మకంగా ఒక ప్లాంటు ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించాయి. జినర్జీ గ్రూప్ ఛైర్మన్ తేజ్కోహ్లీ, గ్రూపు ఎండీ, సీఈఓ రోహిత్ రవీంద్రనాథ్ సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉండవల్లిలోని ఆయన నివాసంలో సమావేశమయ్యారు. రూ.4 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ఖర్చయ్యే ఈ ప్లాంట్లను తాము రూ.3.69 లక్షలకే ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇప్పటికే వెయ్యి లీటర్ల సామర్థ్యం కలిగిన ప్లాంటును ఏలూరుకు దగ్గర్లోని ప్రత్తికోళ్లలంకలో ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ముఖ్య కార్యదర్శి జి.సాయిప్రసాద్ పాల్గొన్నారు. బయోటెక్నాలజీ రంగంలో కలసి పనిచేద్దాం బయోటెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలసి పనిచేసేందుకు అమెరికాకు చెందిన ఫ్రాస్ట్ అండ్ సులివాన్ కంపెనీ ముందుకు వచ్చింది. ఆ సంస్థ గ్లోబల్ ప్రెసిడెంట్ అనూప్ ఝుత్షి సోమవారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. బయోటెక్నాలజీ రంగంలో రాష్ట్రంలో ప్రపంచస్థాయి ఎకోసిస్టమ్ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.