mudragadav2 Posted July 28, 2016 Report Posted July 28, 2016 మల్లన్న సాగర్ ప్రాజెక్టు భూసేకరణపై విపక్షాలు రెచ్చగొడుతున్నాయని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రైతులను రోడ్లపైకి తెచ్చి ఉద్రిక్త పరిస్థితి సృష్టించడానికి తెలుగుదేశం నేతలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. మల్లన్నసాగర్ లో ఇప్పటికే ఐదుగ్రామాలు స్వచ్చందంగా భూములు ఇవ్వడానికి సిద్దపడ్డాయని, మిగిలినవారితో ప్రభుత్వం చర్చలు జరుపుతోందని అన్నారు.తెలుగుదేశం నాయకుడు వంటేరు ప్రతాపరెడ్డి తన అనుచరులతో వెళ్లి రెచ్చగొట్టాడని, రైతుల వెనుక టిడిపి వాళ్లు చేరి పోలీసులపై రాళ్లు రువ్వారని ఆయన ఆరోపించారు. దాంతో పోలీసులు ఆత్మరక్షణకు గాను కాల్పులు జరపవలసి వచ్చిందని ఆయన అన్నారు.దీనిపై పోలీసులను హెచ్చరించామని, ఎట్టి పరిస్థితిలో పోలీసులు సంయమనం పాటించాలని ,సమన్వయంగా ఉండాలని ఆదేశించామని హరీష్ రావు తెలిపారు.టిడిపి నేత ప్రతాపరెడ్డికి ఆ గ్రామాలతో ఏమి పని అని ఆయన అన్నారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.