Buttertheif Posted July 29, 2016 Report Posted July 29, 2016 - వీసీల నియామకాల జీవో రద్దు చేసిన హైకోర్టు- తీర్పు నెలపాటు వాయిదా వేయాలన్న అభ్యర్థనకు ఆమోదంనవతెలంగాణ- హైదరాబాద్ విశ్వవిద్యాలయాలకు చాన్సలర్లు, వైస్ చాన్సలర్ల నియామకాల నిబంధనల్ని సవరించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి దెబ్బతగిలింది. వర్సిటీలకు చాన్సలర్లు, వీసీల నియామక జీవోలను కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బి.బోసలే, న్యాయమూర్తి ఎవి. శేషసాయిలతో కూడిన డివిజన్ బెంచ్ గురువారం తీర్పు వెలువరించింది. తీర్పును అధ్యయనం చేసేందుకు వీలుగా తీర్పు అమలును నెలపాటు వాయిదా వేయాలన్న తెలంగాణ అడ్వకేట్ జనలర్ కె. రామకృష్ణారెడ్డి అభ్యర్థనను హైకోర్టు ఆమోదించింది. ఇంతకాలంలో గవర్నరే యూనివర్సిటీలకు చాన్సలర్లుగా ఉంటున్నారు. ప్రొఫెసర్‌గా పదేండ్ల అనుభవం ఉన్న వారిని వీసీలుగా నియమించేవారు. అయితే ఏపీ యూనివర్సిటీస్ యాక్ట్ తమకు కూడా వర్తించేలా అన్వయించుకున్నా చట్టంలోని నిబంధనల్ని తెలంగాణ సర్కార్ సవరించింది. దీని ప్రకారం వీసీలను గవర్నర్‌తో ప్రమేయం లేకుండా నేరుగా ప్రభుత్వమే నియమించవచ్చు. వీసీలుగా అయ్యేందుకు కావాల్సిన అర్హతల్ని కూడా మార్పు చేసింది. ఈ మేరకు జారీ చేసిన జీవోలు 28, 29, 38లను రిటైర్డు ప్రొఫెసర్ డి.మనోహర్‌రావు సవాల్ చేసిన కేసులో హైకోర్టు వాటిని కొట్టివేస్తూ తీర్పు చెప్పింది. దీనితోపాటే యూజీసీ పేస్కేళ్లను 2014 జూన్ 2 నుంచి (తెలంగాణ ఆవిర్భావం) వర్తించేలా జారీ చేసిన మరో జీవో 1ని కూడా డివిజన్ బెంచ్ కొట్టివేసింది. ఈ జీవోలన్నీ ఏపీ పునర్విభజన చట్టానికి వ్యతిరేకమని బెంచ్ స్పష్టం చేసింది. 2010 యూజీసీ రూల్స్ మేరకే వీసీల భర్తీ జరగాలని తేల్చి చెప్పింది. ప్రొపెసర్‌గా పదేండ్ల అనుభవం ఉండాలన్న నిబంధనను అమలు చేయాలని తెలిపింది. ఛాన్సలర్ పోస్టులకు కూడా డాక్టరేట్ ఉన్నవారికి ప్రాధాన్యత యివ్వాలి. ఈ పదవికి కూడా విద్యారంగంలో, ప్రజాజీవితంలో ఉన్నవారిని నియమించాలి.. అని తీర్పులో పేర్కొంది. ఈ కేసు విచారణలో ఉండగా వీసీలను నియమిస్తే అవన్నీ కోర్టు తీర్పుకు లోబడి ఉండాలని గతంలోనే హైకోర్టు చెప్పింది. వీసీల నియామకాలకు ఎలాంటి అర్హతలను ప్రభుత్వం నిర్ణయించలేదని, అదేవిధంగా ఛాన్సలర్ భర్తీకి కూడా చేసిందని, ఇవన్నీ యూజీసీ రూల్స్‌కు వ్యతిరేకమని పిటిషనర్ వాదనను హైకోర్టు అంగీకరించి పైతీర్పు వెలువరించింది. Quote
mastercheif Posted July 29, 2016 Report Posted July 29, 2016 telugu lo vese fonts leva ? loveda lo font chadavali ante chiraku dobbing. word ki word ki gap undadhu. ఛాన్సలర్ భర్తీకి Quote
Buttertheif Posted July 29, 2016 Author Report Posted July 29, 2016 1 minute ago, mastercheif said: telugu lo vese fonts leva ? loveda lo font chadavali ante chiraku dobbing. word ki word ki gap undadhu. ఛాన్సలర్ భర్తీకి calling cpi cpm dalapathi Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.