thokkalodi Posted August 27, 2016 Report Posted August 27, 2016 రాజకీయ పార్టీల సభలంటే ఆలస్యంగా మొదలవడం, అసలు నాయకుడు మాట్లాడటానికి ముందు డజను మంది మాట్లాడటం..విసిగిపోయిన జనం ముఖ్యనేత ప్రసంగానికి ముందే వెళ్లిపోవడం.. సర్వసాధారణం. అయితే పవన కల్యాణ్ సభ ఇందుకు భిన్నంగా జరిగింది. నాలుగు గంటలకు సభ అంటే సరిగ్గా 4.10 గంటలకు పవన కల్యాణ్ వేదిక వద్దకు చేరుకున్నారు. ఒక్కడే వేదికపై నిలచి ప్రజలకు అభివాదం చేశారు. 65 నిమిషాల పాటు మాట్లాడారు. జైహింద్ అంటూ సభను ముగించి వెళ్లిపోయారు. ఈ సమయంలో తన ప్రసంగంతో అభిమానుల్లో, ప్రజలను పవన ఉర్రూతలూగించారు. అభిమానులు, యువత ఎలా మాట్లాడాలని కోరుకుంటారో, పార్టీలకు అతీతంగా ఉండే సగటు మనిషి ప్రత్యేక హోదా విషయంలో ఎలా అభిప్రాయపడుతున్నాడో అలాగే మాట్లాడి అందరిని ఆకట్టుకున్నారు. తిరుపతిలో బహిరంగ సభ గురించి శనివారం ఉదయం వరకు ప్రజలకు తెలియకున్నా సభ మొదలయ్యే సరికి పెద్ద సంఖ్యలో యువత సభా ప్రాంగణానికి చేరుకున్నారు. జన సమీకరణ కోసం ఏలాంటి ప్రయత్నాలు జరగకున్నా తుడా మైదానం పూర్తిగా జనంతో ప్రత్యేకించి యువతతో కిటకిటలాడిపోయింది. విల్లు నుంచి వెలువడిన బాణం.. నోటి నుంచి జారిన మాటను వెనక్కు తీసుకోలేం..అందుకే నేను ఆచితూచి మాట్లాడుతాను అంటూ ప్రసంగాన్ని మొదలు పెట్టిన పవన ఒక దేశపు సంపద నదులు, అడవులు, ఖనిజాలు కావు...కలల ఖనిజాన్ని దోచేసిన యువత దేశ భవిష్యత్తుకు నావికులు...అన్న గుంటూరు శేషేంద్ర శర్మ కొటేషన్‌తో సభ మొదలు పెట్టారు. తను చదివిన తొలి పుస్తకం తాకట్టు భారత దేశం తనపై ఎంత ప్రభావం చూపిందో వివరించారు. ప్రత్యేక హోదా కోసం మంత్రి పదవి పోతే ఏముంది అంటూ అశోక గజపతి రాజును ప్రశ్నించిన సమయంలో విశ్వవిజేత అలెగ్జాండర్ పోతూ పోతూ ఒట్టి చేతులు చూపిన విషయాన్ని ప్రస్తావించారు. తన ఘాటైన ప్రశ్నాస్త్రాలతో సభికులను ఆకట్టుకున్నారు. http://www.andhrajyothy.com/artical?SID=302468 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.