kakatiya Posted August 28, 2016 Report Posted August 28, 2016 దిల్లీ: భారత హాకీ పితామహుడు అనదగ్గ దిగ్గజం, లెజెండ్ మేజర్ ధ్యాన్‌చంద్‌కు సచిన్ తెందుల్కర్ కన్నా ముందే ‘భారతరత్న’ ప్రకటించి ఉండాల్సిందని హాకీ మాజీ క్రీడాకారులు అంటున్నారు. అలాంటి మహోన్నత వ్యక్తికి దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించాలని ఇంకా డిమాండ్ చేయాల్సి రావడం దురదృష్టకరమని వారు వాపోయారు. హాకీ మాజీ కెప్టెన్లు అజిత్‌పాల్ సింగ్, జాఫర్ ఇక్బాల్, దిలీప్ తిర్కే, ధ్యాన్‌చంద్ కుమారుడు అశోక్ కుమార్ జంతర్‌మంతర్ వద్ద ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధ్యాన్‌చంద్ 1928, 1932, 1936 ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణాలు సాధించి పెట్టాడు. సచిన్‌కు 2013లో భారతరత్న ప్రకటించడానికి ముందు ధ్యాన్‌చంద్‌ను యూపీఏ ప్రభుత్వం విస్మరించడం బాధాకరం అన్నారు. పతకాలు తెస్తే కనీసం రివార్డులు, నగదు బహుమతులు సైతం ఆశించని బ్రిటిష్ పరిపాలనలో దేశం కోసం ధ్యాన్‌చంద్ ఆడారని కొనియాడారు. ఇకనైనా ధ్యాన్‌చంద్‌ను అగౌరవపరచరని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ధ్యాన్‌చంద్ స్ఫూర్తితో ఎంతో మంది హాకీలో ప్రవేశించి దేశానికి కీర్తిప్రతిష్ఠలు తెచ్చిపెట్టారన్నారు. భాజపా ప్రభుత్వం ఆయనను భారతరత్నతో గౌరవిస్తుందని ఆశిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. Quote
Barney_Stinson Posted August 28, 2016 Report Posted August 28, 2016 This MAN is an unsung hero .. cinema teachu rajamouli Quote
i_sudigadu Posted August 29, 2016 Report Posted August 29, 2016 2 hours ago, Barney_Stinson said: This MAN is an unsung hero .. cinema teachu rajamouli Quote
kakatiya Posted August 29, 2016 Author Report Posted August 29, 2016 17 hours ago, Barney_Stinson said: This MAN is an unsung hero .. cinema teachu rajamouli Sye 2 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.