MOD Posted September 9, 2016 Report Posted September 9, 2016 తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు జరుగనున్న సభలో.. లక్ష మంది జనానికి సరిపడే విధంగానే నగరంలోని జేఎన్టీయూకే వర్సిటీ ప్రాంగణంలో భారీ ఏర్పాటు చేసినట్లు సమాచారం. రాత్రికే ఆ పార్టీ అధినేత, టాలీవుడ్ అగ్ర నటుడు పవన్ కల్యాణ్ కాకినాడ చేరుకోగా.. అభిమానులు కూడా ఇప్పటికే భారీ ఎత్తున కాకినాడకు చేరుకుంటున్నారు. ఇప్పటికే కాకినాడ నగరం పవన్ అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలతో నిండిపోయింది. సీమాంధ్రుల ఆత్మ గౌరవ సభ’ పేరిట పవన్ కల్యాణ్ ఏర్పాటు చేస్తున్న ఈ సభకు వామపక్ష పార్టీలు సీపీఐ, సీపీఎం మద్దతు తెలిపాయి. ఇదిలా ఉండగా.. పవన్ కళ్యాణ్ సభలో ఓ వికలాంగుడు కూడా పాల్గొన్నాడు. దీనితో ఎందుకు ఇంతమందిలో వచ్చావు? అని అతన్ని ప్రశ్నించగా.. ‘పవన్ కళ్యాణ్ గారు.. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కోసం ఈ ఉద్యమం తల పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా తీసుకువస్తారని ఎంతో ఆశగా ఉంది. నేను వికలాంగుడిని అయినా కూడా.. ప్రభుత్వానికి కనువిప్పు కలగాలనే ఉద్దేశంతో నేను నడవలేక పోయినా ఇక్కడికి వచ్చాను’ అని ఆ వికలాంగుడు చెప్పాడు. అతని మాటలతో అక్కడి వారిని ఉద్రేక పరిచాయి. ఈ ఘటన చూసిన కొందరికి ‘ఒకే ఒక్కడు’ సినిమాలో హీరో అర్జున్ కోసం ఓ వికలాంగుడు వచ్చి ‘నా లాగా ఈ రాష్ట్రం అవిటిది అయింది.. నాయకుడివై నడిపించు అన్నా’ అని చెప్పిన సన్నివేశం గుర్తుకు రాక మానదు. Quote
Kallu_Mama007 Posted September 9, 2016 Report Posted September 9, 2016 Oke okkadu lo okate heroine kada. hero ki. Quote
Anta Assamey Posted September 9, 2016 Report Posted September 9, 2016 19 minutes ago, Kallu_Mama007 said: Oke okkadu lo okate heroine kada. hero ki. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.