Jump to content

Recommended Posts

Posted

'ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌ను ఓడగొట్టి ఏం చేస్తరు? టీఆర్ఎస్ ఓడిపోయింది.. తెలంగాణ అవసరం లేదంటరా? శవాల మీద పేలాలు ఏరుకున్నట్లు ఆత్మాభిమానాన్ని అమ్ముకుంటరా' అంటూ కాంగ్రెస్, టీడీపీ తెలంగాణ నేతలను టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ప్రశ్నించారు.

రాజీనామా చేద్దామని చెప్పి జారుకున్నారని, రాజీనామా చెయ్యకపోగా పోటీ పెడతామంటూ దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఆంధ్ర పాలకులకు తొత్తులుగా మారారని దుయ్యబట్టారు. 'ఆంధ్రా వాళ్లంతా పార్టీలకతీతంగా రాజీనామాలు చేసిన్రు. నన్నపనేని రాజకుమారి వెళ్లి లగడపాటి నుదుటన ముద్దుపెట్టుకున్నరు.

తెలంగాణ నేతలేమో.. కాంగ్రెస్ రాజీనామా చేస్తే మేం రాజీనామా చేస్తమని టీడీపీ.. టీడీపీ రాజీనామా చేస్తే మేం చేస్తాం అని కాంగ్రెస్ వాళ్లు అన్నరు' అని పేర్కొన్నారు. తెలంగాణ ద్రోహులకు బుద్ధి చెప్పే శక్తి విద్యార్థులకే ఉందన్నారు. తెలంగాణ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి అనుబంధ విద్యార్థి విభాగం టీఆర్ఎస్‌వీ సన్నాహక సమావేశం శుక్రవారం జరిగింది.

ఈ సమావేశాన్ని ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడారు. డిసెంబర్ తర్వాత మహాయుద్ధం జరగబోతోందని, దానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 'ఉద్యమం టెంపర్‌గా ఉన్న కొద్దీ విద్యార్థులు చనిపోతున్నరని కొద్దిగ వెనక్కి తగ్గినం.

ఈ లోపు శ్రీకృష్ణ కమిటీ వేసిన్రు కనుక ఉన్న బాధంతా డాక్యుమెంటు రూపంలో దాని ముందు పడేసినం. తెలంగాణ ఇస్తరా.. ఇవ్వరా అనేది మనకనవసరం. డిసెంబర్ వరకు వేచి చూద్దాం' అన్నారు. డిసెంబర్ తర్వాత పోరాటానికి విద్యార్థులు ఆయుధం కావాలని, ఆయుధమంటే నిర్మాణమన్నారు. టీఆర్ఎస్‌వీలో కనీసంగా 10 లక్షల సభ్యత్వాలు చేర్పించాలన్నారు.

'ఈ పది లక్షల మంది డిసెంబర్ తర్వాత రోడ్డు మీదకొస్తే చీమ చిటుక్కుమంటదా? ఆయుధం నూరి సిద్ధంగ బెట్టుకుంటే అంతిమ లక్ష్యానికి హైవే తయారవుతది. అందరం కలిసి మూడో కన్ను తెరిస్తె తెలంగాణ వస్తది' అన్నారు. తన ఆమరణ దీక్ష సమయంలో.. తదనంతర పోరాటాల్లో విద్యార్థులే కీలకపాత్ర వహించారని గుర్తు చేసుకున్నారు.

Posted

TRS odipotey anna question vachindhi antey gelustham anna nammakam vallakey ledhu

Posted

[size=20pt][color=red]"నన్నపనేని రాజకుమారి వెళ్లి లగడపాటి నుదుటన ముద్దుపెట్టుకున్నరు."[/color][/size]

veediki pettanaduku feel ayyinattu unnadu

×
×
  • Create New...