Jump to content

Tamil nadu consumers to boycott Karnataka milk


Recommended Posts

Posted

estart rey...

 

తమిళనాట కా‘వేడి’
13-09-2016 00:37:13

 

  • రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
  • కర్ణాటక వాహనాలపై దాడులు
  •  
చెన్నై, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): తమిళనాడు-కర్ణాటక రాష్ట్రాల మధ్య కావేరీ చిచ్చు మళ్లీ రేగింది. కర్ణాటకకు చెందిన వాహనాలు, కన్నడ సంఘాలపై తమిళులు దాడులకు తెగబడ్డారు. దాంతో రాష్ట్రం లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమిళనాడు అవసరాల రీత్యా 15 టీఎంసీల కావేరీ జలాలను విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో తీవ్ర ఆగ్రహోదగ్రులైన కర్ణాటక రైతులు నిరసనలకు దిగడం వివాదానికి కారణమైంది. రెండు రోజుల కిందట ఓ తమిళ యువకుడిపై కొందరు కన్నడిగులు దాడి చేయడంతోపాటు, ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో ఉంచడంతో వివాదం తారస్థాయికి చేరిం ది. ప్రసార మాధ్యమాల్లో దీనిని చూసిన కొందరు తమిళులు రాష్ట్రంలోని కన్నడ సం ఘాలు, సంస్థలపై దాడులకు తెగబడ్డారు. స్థానిక మైలాపూర్‌లో ఉన్న న్యూ ఉడ్‌ల్యాండ్‌ హోటల్‌పై సోమవారం వేకువజామున 3 గంటల ప్రాంతంలో 12 మంది ముఠా విధ్వంసానికి పాల్పడింది. రెండు పెట్రోల్‌ బాంబులను విసిరింది. కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ పరారైంది. సీసీ టీవీల ఫుటేజ్‌ని పరిశీలించిన పోలీసులు తందై పెరియార్‌ ద్రవిడర్‌ కళగానికి చెందినవారు ఈ విధ్వంసానికి పాల్పడినట్లు తేల్చారు.
 

కర్ణాటక వాహనాలపై దాడి 

కర్ణాటక రిజిసే్ట్రషనతో ఉన్న వాహనాలపై పలువురు తమిళ ఆందోళనకారులు సోమవారం మొత్తం 18 చోట్ల దాడులకు తెగబడ్డారు. నాగపట్నం జిల్లా శీర్గాళిలో రైస్‌మిల్లు వద్దకు వచ్చిన లారీని ధ్వంసం చేశారు. దాని డ్రైవర్‌, క్లీనర్లపై దాడికి తెగబడబోగా, వారు తమిళులేనని తేలడంతో వదిలేశారు. అలాగే, వైదీశ్వరర్‌ ఆలయానికి వచ్చిన కర్ణాటక జీపును తగలబెట్టేందుకు ఆందోళనకారులు యత్నించారు. అయితే, వారంతా ఏపీకి చెందిన వారని తెలియడంతో వదిలేశారు. రామేశ్వరంలో కర్ణాటకకు చెందిన 7 వాహనాలపై నామ్‌ తమిళర్‌ తదితర పార్టీలకు చెందిన యువకులు దాడులు జరిపారు.
 
రోడ్డుపక్కన ఆగి ఉన్న ఓ లారీని తగలబెట్టారు. బెంగళూరు నుంచి వేలూరుకు వచ్చిన కర్ణాటక బస్సును ఆంబూర్‌ బస్టాండ్‌లో డీపీఐ కార్యకర్తలు అడ్డుకున్నారు. కన్నడ ప్రయాణికులపై దాడికి యత్నించడంతో పోలీసులు రక్షించి సురక్షితంగా తరలించారు. మదురై కలెక్టరేట్‌ వద్ద ఎల్‌టీటీ జిల్లా కార్యదర్శి తమిళరసన నేతృత్వంలోని కార్యకర్తలు కర్ణాటక మంత్రుల దిష్టిబొమ్మలను దహనం చేసి, ఆ రాషా్ట్రనికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోనూ కర్ణాటక వైఖరి పట్ల తీవ్ర నిరసన వ్యక్తమైంది. కాగా, ఆందోళనలకు పాల్పడిన 150 మందిని పోలీసులు అరెస్టు చేశారు. రెండు రాషా్ట్రల మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండడంతో డీజీపీ టీకే రాజేంద్రన, చెన్నై పోలీసు కమిషనర్‌ జార్జ్‌ సోమవారం మధ్యాహ్నం సీఎం జయలలితతో అత్యవసరంగా భేటీ అయ్యారు.
 

ఆ రాష్ట్ర పాలు మాకొద్దు 
కర్ణాటక నుంచి వచ్చే పాలను బహిష్కరిస్తున్నట్లు పాల వినియోదారులు, కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు పొన్నుస్వామి ప్రకటించారు. కర్ణాటక ప్రభుత్వం ఎగుమతి చేస్తున్న నందిని పాలు, పాల ఉత్పత్తులను మంగళవారం నుంచి తిప్పి పంపనున్నట్లు తెలిపారు. కర్ణాటక నుంచి వచ్చే అన్ని ఉత్పత్తులను తిరస్కరించాలని పిలుపునిచ్చారు.

Posted
1 minute ago, idibezwada said:

same mana state division appudu cheste centralki heat telsedi

congrats1

Posted
1 minute ago, idibezwada said:

same mana state division appudu cheste centralki heat telsedi

Manam sambar vaalla range ki Ee janma Lo reach avvalememo :(

Posted
17 minutes ago, TOM_BHAYYA said:

Manam sambar vaalla range ki Ee janma Lo reach avvalememo :(

anduke andi saduvkunnodikanan sakalodu meelu ani

Posted
30 minutes ago, kakatiya said:

They will now only drink amma milk

amevemo kani, aakkadi heronies ni line lo petti pindisthey untadi    tollygifs_brahmi5.gif milkbooth

Posted

Peak ki poindi ga e gola ipudu ? B'lore aithe Tamilnadu registered vehicles kanipinchina chithaka baaduthunaru anta

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...