Jump to content

Recommended Posts

Posted


majnu-poster
                                                  



కథ: 

ఆదిత్య (నాని) దర్శకుడు రాజమౌళి దగ్గర సహాయ దర్శకుడిగా పని చేస్తుంటాడు. తన స్నేహితుడు ప్రేమిస్తున్న సుమ (ప్రియశ్రీ)ను చూసి అట్రాక్ట్ అయిన ఆదిత్య ఆమె వెంట పడతాడు. ఆదిత్య తీరు నచ్చడంతో సుమ కూడా అతడి వైపు ఆకర్షితురాలవుతుంది. ఆ తర్వాత ఆదిత్య ఒకప్పటి తన ప్రేమకథను సుమతో పంచుకుంటాడు. భీమవరంలో ఉండగా కిరణ్ (అను ఇమ్మాన్యుయెల్)ను చూసి ఎలా ఇష్టపడింది.. ఆమె ఎలా తన ప్రేమలో పడింది.. తాము ఎలా విడిపోయింది చెబుతాడు ఆదిత్య. ఐతే కిరణ్  తిరిగి  అతడి జీవితంలోకి వస్తుంది. మరి ఈ ఇద్దరమ్మాయిలతో ఆదిత్య ప్రయాణం ఎలా సాగింది..చివరికి అతను ఎవరితో జీవితాన్ని పంచుకున్నాడు అన్నది మిగతా కథ.

కధనం - విశ్లేషణ :

కధగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. సాధారణ ముక్కోణపు ప్రేమ కధ. తొలి  చిత్రం "ఉయ్యాలా జంపాలా" లో కూడా ఇలా అతి సాధారణ కధనే ఎంచుకున్నా,దాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించి  ఆకట్టుకున్నాడు దర్శకుడు విరించి వర్మ. ఈసారి అతనికి నాని లాంటి నటుడు తోడవ్వడంతో ఆ ప్రయత్నంలో చాలావరకు సఫలమలయ్యాడు. ఫస్టాఫ్ లో సెకండ్ హీరోయిన్  వెంట పడే ట్రాక్ చిన్నదే అయినా ఆకట్టుకుంటుంది,ఆ వెంటనే వచ్చే భీమవరం ఫ్లాష్ బ్యాక్ సినిమాకే ప్రధాన ఆకర్షణ/బలంగా చెప్పుకోవచ్చు. హీరో హీరోయిన్ ప్రేమ కోసం కాలేజీ లో లెక్చరర్ గా చేరడం,ఆమెకు దగ్గరవడానికి ప్రయత్నించడం.. ఈ వ్యవహారం అంతా చాలా మామూలే అయినప్పటికీ, హీరో-హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ,నటన,వినోదం అన్ని వర్కౌట్ అయి ఆ ఫ్లాష్ బ్యాక్ ని నిలబెట్టాయి. అందుకు  పాటల చిత్రీకరణ,కెమెరా వర్క్ కూడా తమ వంతు సహకారం అందించాయి. ఇక్కడిదాకా ఆకట్టుకున్న కధనం,హీరో-హీరోయిన్ విడిపోయే సన్నివేశం నుండి బలహీనపడింది. ఇంటర్వెల్ వద్దే క్లైమాక్స్ లో ఎం జరుగుతుందో అన్నది తెలిసిపోతుంది. వాళ్లిద్దరూ విడిపోవడానికి బలమైన కారణం లేకపోవడం వలన ఇద్దరూ ఖచ్చితంగా కలవాలి అనే బదులు ఎలాగైనా కలుస్తారులే అన్న భావన కలుగుతుంది. ఈ మైనస్ ల వల్ల  వెనుకపడ్డ సెకండాఫ్ ని మొదట్లో వెన్నెల కిశోర్ కామెడీ కాపాడితే ,మళ్ళీ క్లైమాక్స్ లో వచ్చే  కామెడీ కాపాడింది. ఐతే  ఫ్లాష్ బ్యాక్ లోని రెండు ముఖ్యమైన సన్నివేశాలను దర్శకుడు సెకండాఫ్ లో ప్రెజంట్ చేసిన తీరు బాగుంది,అలాంటి మెరుపులు సెకండాఫ్ లో ఇంకా కొన్ని ఉండి  ఉంటే ఇంకా బాగుండేది.


నటీనటులు :

నాని మరోసారి అకట్టుకున్నాడు, ఆద్యంతం అలరించాడు. అను ఇమ్మాన్యుయెల్ బాగుంది, ఆ పాత్రకి సరిపోయింది.. నటన కూడా పరవాలేదు. ప్రియశ్రీ ఒకే.
హీరో ఫ్రెండ్ గా సత్య బాగున్నాడు, అలాగే వెన్నెల కిశోర్ కూడా వీలైనంత నవ్వించాడు. గెస్ట్ రోల్ లో రాజ్ తరుణ్ అమెరికా పెళ్లి కొడుకు తరహా పాత్ర లో కనిపించాడు.
ఇతర నటీనటులు ఒకే.


సాంకేతిక వర్గం :

మాటలు బాగున్నాయి, గోపి సుందర్ సంగీతం లో పాటలు బాగున్నాయి ,నేపధ్య సంగీతం కూడా బాగుంది. జ్ఞానశేఖర్ కెమెరా వర్క్ కూడా బాగుంది.


రేటింగ్ : 6/10

Posted
14 minutes ago, xxxxmen said:

heroines biscuit laaga unnaru

first heroine fafa bagundi, aa donga choopulu, aa navvi navvanattu navvu abbo keka puttinchindi :P

 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...