psycopk Posted September 28, 2016 Report Posted September 28, 2016 ప్రతి సోమవారం పోలవారం అని ప్రకటించిన ముఖ్యమంత్రి అన్నట్టుగానే విజయవాడలోని కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి సోమవారం సాయంత్రం పోలవరం ప్రాజెక్టు పనులను సమీక్షించారు. లైవ్ కెమెరాల ద్వారా పనులను పరిశీలించిన చంద్రబాబు, రాబోయే రెండు సంవత్సరాల మూడు నెలల్లో పోలవరం పూర్తి కావాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ పనులను పూర్తి చేసేందుకు తన ప్రణాళిక ఏమిటో ట్రాన్స్ట్రాయ్ ఏజెన్సీ ప్రజంటేషన్ సమర్పించింది. తమతో ఒప్పందం కుదుర్చుకున్న ఏజెన్సీలు ఎంత పని ఎంత గడువులోగా పూర్తి చేయాల్సి ఉందో అందులో పేర్కొంది. ఈ ప్రణాళికను పోలవరం ప్రాజెక్టు అధికారులు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులు పరిశీలించి వారి కోణంలో వచ్చే సమావేశం నాటికి విశ్లేషించాలని ముఖ్యమంత్రి కోరారు. మట్టి తవ్వకం పనుల వేగం పెంచాలని, స్పిల్వే కాంక్రీటు పనులు ప్రారంభించాలంటే రోజువారీ 1.50 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం చేయాలని, దీన్ని 2 లక్షలకు పెంచాలని ఆదేశించారు. ప్రాజెక్టుకు సంబంధించినంత వరకూ డిజైన్, నాణ్యత, సాంకేతిక విషయాల్లో ఎక్కడా రాజీవద్దని చంద్రబాబు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు నాబార్డు అంగీకరించిందని, ఏడాదికి రూ.7వేల కోట్ల నుంచి రూ.8వేల కోట్ల వరకూ వచ్చే అవకాశముందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. పోలవరం వంటి ప్రాజెక్టును సమీప భవిష్యత్తులో మనం తప్ప మరెవరూ నిర్మించే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. Quote
Dhaya Posted September 28, 2016 Report Posted September 28, 2016 3 minutes ago, Spartan said: 1 week Sprints ana maata. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.