LordOfMud Posted September 28, 2016 Report Posted September 28, 2016 పోలవరం డ్యామ్ కూలిపోవడం ఖాయమా..? డాక్టర్ కేఎల్ రావు ఏం చెప్పారు..? కారణం ఏమిటి? పోలవరం డ్యామ్ కూలిపోవడం ఖాయమని నిపుణులు, ప్రముఖ ఇంజనీర్, పద్మభూషణ్ డాక్టర్ కె.ఎల్.రావు గతంలో హెచ్చరించారు. ఈ మేరకు అప్పట్లో రావు చేసిన కామెంట్స్‌తో కూడా వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 1983 ఏప్రిల్ 30వ తేదీన విజయవాడలో వార్తాపత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రావు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. పోలవరం డిజైన్ లోపభూయిష్టంగా ఉందని.. దీంతో గోదావరి నీటిని కృష్ణా బేసిన్లోకి మళ్లించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. పోలవరం డిజైన్ ద్వారానే గోదావరి మిగులు నీరును కృష్ణానదికి మళ్లించే అవకాశం లేదని చెప్పుకొచ్చారు. 40 లక్షల క్యూసెక్కుల వరదనీటిని తొలగించేందుకు కేవలం 18వందల అడుగుల స్పిల్ వేని మాత్రమే పోలవరం ప్రాజెక్టులో ఏర్పాటు చేయాలని నిర్దేశించడం జరిగిందన్నారు. నిజానికి 13వేల అడుగుల స్పిల్ వే అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. స్పిల్ వేలను రూపొందించడంలో జాగ్రత్త అవసరమని, వరదలొచ్చినప్పుడు డ్యామ్‌లు కూలిపోకుండా చర్యలు తీసుకోవాలని ఇంజనీర్లకు ఆయన సూచించారు. ఇందుకు గోదావరి బేసిన్‌లోని కడం డ్యామ్, గుజరాత్‌లోని మచ్చు డ్యామ్, ప్రకాశం బ్యారేజ్ వంటి కొన్నింటిని ఉదహరించారు. మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల తీరును అనేక దేశాలు పర్యటించి పరిశీలించిన కేఎల్ రావు.. వరదలతో వృక్షాలను నరికేయడం ద్వారా నదీ ప్రవాహ ప్రాంతాల్లో ఏర్పడే నష్టాన్ని గురించి గుర్తు చేశారు. ఇందులో భాగంగా స్పిల్ వే తక్కువగా ఉండటంతో పాటు.. 49 క్యూసెక్కుల వరద జలాల వల్ల పోలవరం డ్యాం కూలిపోయే ప్రమాదం వుందని మాజీ ఇంజనీర్ టి. హనుమంతరావు కూడా అభిప్రాయపడ్డారు. అలాగే 46 గంటలకు మించి వరదనీరు డ్యాంపైనుంచి ప్రవహిస్తే అది కూలిపోవడం తథ్యమన్నారు. పోలవరం రిజర్వాయర్ స్టోరేజి 200 టీఎంసీలు అని, స్పీల్ వే డిశ్చార్జ్ 0.1 మిలియన్ క్యూసెక్కులని వివరించారు. Quote
Idassamed Posted September 28, 2016 Report Posted September 28, 2016 Polavaram is being monitored closely so no chance. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.