DannyArcher Posted October 7, 2016 Report Posted October 7, 2016 ఆవేశానికి మరో పేరైన పోసాని కృష్ణమురళి మరోసారి సహనం కోల్పోయాడు. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో టీవీ-5 నిర్వహించిన లైవ్ డిబేట్ కార్యక్రమానికి హాజరైన పోసాని.. కాంగ్రెస్ సీనియర్ నేత.. ఎంపీ హనుమంతరావుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగిన క్రమంలో పోసాని వీహెచ్ బూతుల వర్షం కురిపించాడు. ‘నీ అమ్మా’ అనడమే కాక.. మరికొన్ని బూతులు కూడా ప్రయోగించాడు. ఈ క్రమంలో ఇద్దరూ ఒకరిపైకి ఒకరు దూసుకెళ్లారు. యాంకర్.. డిబేట్ కు వచ్చిన ఇతర వ్యక్తులు అతి కష్టం మీద వాళ్లిద్దరినీ అదుపు చేయాల్సి వచ్చింది. పోసాని ఆవేశం చూస్తే వీహెచ్ ను కొట్టేలాగే కనిపించాడు. ఐతే అంతలోనే లైవ్ కట్ అయింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాల్సి ఉంది. ఇంతకీ పోసాని అంతగా ఆవేశపడ్డానికి కారణం ఏంటంటే.. పాకిస్థాన్ మీద మోడీ సర్కారు చేసినట్లుగా చెబుతున్న సర్జికల్ స్ట్రైక్స్ మీద కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలు ప్రతికూల వ్యాఖ్యలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ దాడులు సరికాదని కొందరు.. ఫేక్ అని మరికొందరు.. ప్రస్తుత పరిణామాల్ని మోడీ సర్కారు రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని ఇంకొందరు అంటున్నారు. ఈ నేపథ్యంలో పోసాని మాట్లాడుతూ మోడీకి పూర్తి మద్దతు ప్రకటించాడు. మోడీ నిజాయితీ పరుడని.. ఆయనంటే తనకిష్టమని.. ఏం చేసినా కమిట్మెంట్ తో చేస్తాడని అన్నాడు. అంతే కాక మోడీ.. పాకిస్థాన్ లో పర్యటించి స్నేహ హస్తం చాటినా ప్రయోజనం లేకపోయిందని.. ఆ దేశం పదే పదే రెచ్చగొడుతుంటే.. సైనికులు.. సామాన్యుల ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకోవాలా అన్నారు. ఐతే పోసాని అలా మాట్లాడుతుండగా.. వీహెచ్ అడ్డు తగిలారు. దీంతో పోసానికి మండిపోయింది. మనం మనుషులం.. పిచ్చికుక్కలం కాదు.. నేను మాట్లాడతా.. ఆ తర్వాత మీరు మాట్లాడండి.. ఇదీ నా పాలసీ అన్నారు. ఐతే వీహెచ్ ఆగకుండా మోడీ నిజాయితీ గురించి ఇక్కడెందుకు మాట్లాడుతున్నావు.. కావాలంటే బయటికెళ్లి మాట్లాడుకో అన్నారు. అంతే పోసానికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నీకెందుకు అన్నారు.. వీహెచ్ ‘ఏయ్ నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావ్’ అన్నారు. అంతే పోసాని రెచ్చిపోయాడు. బూతులందుకుంటూ వీహెచ్ మీదికి ఉరికారు. Quote
Akkumm_Bakkumm Posted October 7, 2016 Report Posted October 7, 2016 4 hours ago, sattipandu said: masth G pagala LK bombs esadu ga live tv lo emanna theda osthey aa VH gaadi meeda low budget cinema teesthadu focus chesi lekuntey edo cinema lo asunti luchaa character ni irikisthaadu saripoddi inkem undhi andaru kalisi padesi 10galsindi musali love da gadini. logical ga argue cheyyadaniki points levu congress dogs ki anduke elanti physical attacks ki tegabaddaru.... Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.