Jump to content

AP lo inka power cuts unnayaa???


Recommended Posts

Posted

or inka proper setup kaledhaaa environment ???

 

 

హైదరాబాద్‌, అక్టోబర్‌ 17(ఆంధ్రజ్యోతి): వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయాన్ని కరెంటు కష్టాలు వెంటాడుతున్నాయి. ఉద్యోగుల పనిపై, పాలనపై ప్రభావం చూపుతున్నాయి. మొదట్లో పరిమితంగా ఉన్న విద్యుత్తు అంతరాయాలు సోమవారం తారాస్థాయికి చేరుకున్నాయి. సోమవారం ఒక్కరోజే పదిసార్లు సరఫరాకు అంతరాయం కలిగింది. ప్రస్తుతం తాత్కాలిక సచివాలయంలో జనరేటర్లుకానీ, ఇన్వర్టర్లుకానీ లేకపోవడంతో... కరెంటు పోయిన ప్రతిసారీ పని ఆగిపోతోందని, తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఉద్యోగులు పేర్కొంటున్నారు. కంప్యూటర్లు ఆగిపోయి పని నిలిచిపోవడం ఒక ఎత్తయితే, ఎలక్ట్రానిక్‌ పరికరాలు కాలిపోవడం మరో ఎత్తు. పద్ధతి ప్రకారం షట్‌డౌన్‌ చేయకుండా ఒక్కసారిగా ఆగిపోతుండటంతో కంప్యూటర్లలోని సమాచారం (డేటా) కూడా కరప్ట్‌ కావడమో, పూర్తిగా ఎగిరిపోవడమో జరుగుతోందని ఉద్యోగులు తెలిపారు. ‘‘ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన విలువైన, రహస్య సమాచారం కంప్యూటర్లలో నిక్షిప్తమై ఉంటుంది. ఇలాంటి అంతరాయాలు, సౌకర్యాల లేమి వల్ల ఆ సమాచారానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది’’ అని ఉద్యోగులు చెబుతున్నారు. తాత్కాలిక సచివాలయాన్ని సిద్ధం చేసే నాటికే ఇన్వర్టర్లను, జనరేటర్లను కూడా ఏర్పాటు చేయాల్సిందని అభిప్రాయపడ్డారు. ఈ జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఆర్థిక శాఖలో ఒక జిరాక్స్‌ మెషీన కాలిపోయిందని, మరోశాఖలో కూడా ఇలాంటి ఒక ఎలక్ర్టానిక్‌ యంత్రానికి నష్టం జరిగిందని పేర్కొన్నారు. సోమవారం విద్యుత్తు అంతరాయాలు మరింత ఎక్కువయ్యాయని ఉద్యోగులు తెలిపారు.
 
 
Posted
8 minutes ago, tom bhayya said:

@3$% inka rural lines ey unnayi emo akkada..

generators leni secretariat ento asalu nammabudhi kavatledhu @3$% 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...