sri_india Posted October 17, 2016 Report Posted October 17, 2016 శతాబ్ది ఉత్సవాల వేళ ఆర్థిక కష్టాల్లో వర్సిటీ ఉద్యోగులకు నెట్ శాలరీతోనే సరి ఆరునెలలుగా పెన్షన్ బెనిఫిట్లు నిల్ పీఎఫ్, ఎల్‌ఐసీ చెల్లింపులకూ బ్రేక్ నిరుటి 28 కోట్లు విడుదల చేయని సర్కారు హైదరాబాద్ సిటీ, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ఘనంగా శతాబ్ది ఉత్సవాలకు సిద్ధమవుతున్న ఉస్మానియా యూనివర్సిటీ ఆర్థికంగా కొట్టుమిట్టాడుతుంది. ఉద్యోగులకు నెట్ శాలరీ తప్ప పీఎఫ్ కూడా చెల్లించలేని దుస్థితికి చేరింది. రిటైర్డ్ ఉద్యోగల పరిస్థితి అయితే వర్ణానాతీతం. రెగ్యులర్‌గా వచ్చే జీతం ఆగిపోయిన తరుణంలో మిగిలిన బెనిఫిట్స్‌కు సంబంధించి వీరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. దేశ విదేశాల్లోని పూర్వ విద్యార్థులను, ఇక్కడే చదువుకుని ఉన్నత స్థానాల్లో ఉన్న ప్రముఖులను వందేళ్ల ఉత్సవానికి ఆహ్వానించే తరుణంలో వర్సిటీ డొల్లతనం బయటపడటంపై ఇటు విద్యార్థులు, అటు అధ్యాపకులు జీర్ణించుకోలేకున్నారు.. ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో చర్చించి పరిస్థితి చక్కదిద్దుతున్నా ఆర్థిక శాఖ నుంచి రావాల్సిన నిధులు కూడా విడుదల చేయడం లేదు. ప్రతి నెల జీతాలు, పెన్షన్ల రూపంలో ఓయూకు రూ.33 కోట్ల మేర నిధులు అవసరమవుతాయి. దాంట్లో నెట్ శాలరీకే రూ.19.84కోట్లు అవసరం. ప్రస్తుతం నెట్ శాలరీకి ఎంత అవసరమో ఆ మొత్తమే రాష్ట్ర ఆర్థిక శాఖ విడుదల చేస్తోంది. మిగిలిన సొమ్ము పీఎఫ్, ఎల్‌ఐసీ, ఉద్యోగి తీసుకున్న లోన్ కటింగ్స్ కలిపి వేటి ఖాతాలో వాటిని జమ చేయాల్సి ఉంటుంది. మూడు నెలలుగా రూ.5.5 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. కానీ ఆగస్టు నుంచి వీటిని జమ చేయడానికి నిధులు లేవు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు టీచింగ్, నాన్ టీచింగ్, నాలుగో తరగతి ఉద్యోగులు కలిపి దాదాపు 45 మంది పదవీ విరమణ చేశారు. వీరిలో ఒక్కరికి కూడా ఉద్యోగానంతర ప్రయోజనాలు ఇవ్వలేదు. దాదాపు రూ.15కోట్ల మేర చెల్లింపులు చేయాల్సి ఉంది. జీతాలు, పెన్షన్లు, పెన్షన్ల బెనిఫిట్స్ కింద ఏటా రూ.408కోట్లు, నిర్వహణ, ఇతర ఖర్చులు కలుపుకొని ఈ ఏడాదికి రూ.505 కోట్లు అవసరమవుతాయి. ఫీజులు వంటి ఇతరత్రా మార్గాల ద్వారా వర్సిటీకి దాదాపు రూ.90కోట్లు నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నుంచి రూ.238కోట్లు వచ్చినప్పటికీ ఇంకా లోటు రూ.177 కోట్లు ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో గత ఏడాది చివరి క్వాట్టర్ బడ్జెట్ ఇంకా రూ.28కోట్లు ఇవ్వాల్సి ఉంది. వాటిలో రూ.19కోట్లకు ఆర్డర్ కూడా ఇచ్చారు.. అయినా ఆర్థిక శాఖ చెక్కులను పాస్ చేయడం లేదు. కనీసం ఈ మొత్తం వచ్చినా తాత్కాలికంగా ఉన్న ఉద్యోగ బకాయులు చెల్లించేందుకు వీలు ఏర్పడుతుంది. Quote
sri_india Posted October 17, 2016 Author Report Posted October 17, 2016 Just now, BeerBob1 said: lite ABN neenu ABN news paper nee ekkuva chaduvuthaa bro .... suthi lekunda matter direct gaa chepesthadu Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.