Jump to content

Hyderabad roads ... 100 crores scam .. veliki theseena ABN


Recommended Posts

  • Replies 35
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • beerbob

    6

  • sri_india

    5

  • BaabuBangaram

    3

  • LordOfMud

    2

Top Posters In This Topic

Posted

good job ABN. GHMC ni prakshalana cheyyali. chestaru kuda. pedda pedda talakayalu lestayi ippudu. 

Posted
2 hours ago, sri_india said:
  • వేయని రోడ్లకు వేసినట్లు లెక్కలు 
  •  జీహెచ్‌ఎంసీ ఇంజనీర్ల మాయ 
  •  337 కోట్ల బిల్లులు మంజూరు 
  •  అందులో మూడోవంతు బోగస్‌! 
  •  వేసింది కొంచెం.. చూపిందెంతో 
  •  ఒకే పనికి మూడు బిల్లులు 
  • గత కమిషనర్‌ హయాంలో అక్రమాలు 
  • నడి రోడ్డుపై నయ వంచన 
  • జీహెచ్‌ఎంసీ దారి.. అడ్డగోలు దారి 
  • వంద కోట్ల దందా 
 
రోడ్ల మీద గోతులున్నాయా, లేక గోతుల్లోనే అక్కడక్కడ రోడ్డు ఉందా... అని అనుమానించాల్సిన పరిస్థితి! రోడెక్కితే నడివయసు వాళ్లకూ నడ్డి విరిగే దుస్థితి! రోగులైతే ఆస్పత్రిదాకా వెళ్లకముందే హరీమనేంతటి ప్రమాదకర స్థితి! ఈ రోడ్లకు చికిత్స చేస్తూనే ఉన్నామని జీహెచ్‌ఎంసీ చెబుతోంది. కోట్లకు కోట్లు రహదారులపై ‘పరుస్తోంది’. మరి... రోడ్లెందుకు బాగుపడటంలేదు? ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనేందుకు ‘ఆంధ్రజ్యోతి’ రోడ్డెక్కింది. రాజధానిలో రోడ్లను, బల్దియాలో ఫైళ్లనూ శోధించింది. లోతుగా ఆరా తీయగా... మన భాగ్యనగరిలో ‘కాగితాలపై’నే రోడ్లు పడుతున్నాయని తేలింది. రోడ్డు వేసేది కొంత! వేశామంటూ బిల్లులు తీసుకునేది ఎంతో! కొన్నిచోట్ల అసలే వేయరు. మరికొన్ని చోట్ల సిమెంటు రోడ్లపైనే ఓ లేయరు తారు వేసి సొమ్ము చేసుకున్నారు. రాజధాని రోడ్లపై గుంతల సాక్షిగా జరిగిన కుంభకోణమిది! ఫలితం 330 కోట్లలో మూడోవంతు గల్లంతు!!




(ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌ సిటీ) 
ఆంధ్రజ్యోతి బృందం 50ప్రాంతాలను పరిశీలించగా.. 9 చోట్ల వేయని రోడ్డు వేసినట్టు.. మూడు ప్రాంతాల్లో వేసిన దానికంటే ఎక్కువ బిల్లులు.. మరో ఏరియాలో ఒకే పనిని రెండుసార్లు చూపినట్టు గుర్తించారు. చాలా ప్రాంతాల్లో సీసీ రోడ్లపైనే ఒక పొర బీటీ రోడ్డు వేశారని స్థానికులు చెబుతున్నారు. ఉప్పల్‌, రామంతాపూర్‌, హబ్సిగూడ, కవాడిగూడ, చిక్కడపల్లి, రాంనగర్‌, కూకట్‌పల్లి, బాలాజీనగర్‌, మన్సూరాబాద్‌, హయతనగర్‌, వనస్థలిపురం, బౌద్ధనగర్‌, సీతాఫల్‌మండి, రాంగోపాల్‌పేట డివిజన్లలోని పలు ప్రాంతాల్లో ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి బృందం పరిశీలనకు వెళ్లింది. ఇందులో దాదాపు 25 నుంచి 30 శాతం తప్పుడు లెక్కలు ఉన్నట్టు తేలింది. ఎక్కువ ప్రాంతాల్లో రోడ్లు వేయకుండానే వేసినట్లు చూపడం వారి దృష్టికి వచ్చింది. బీటీ రోడ్డు పనులు పూర్తయ్యాయని చెబుతోన్న స్ర్టెచ్‌ల్లో ఇప్పటికీ సీసీ రోడ్లు ఉండడం గమనార్హం. క్వాలిటీ కంట్రోల్‌ విభాగం పరిశీలనలో కూడా ఈ విషయాలు గుర్తించినట్టు విశ్వసనీయ సమాచారం. అయితే ఇంజనీరింగ్‌ ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఒత్తిళ్లతో ఆ వివరాలు బయటకు రాకుండా దాచారని తెలిసింది. 

100 కోట్లకు పైనే 
చేపట్టిన 921 పనుల్లో దాదాపు 80శాతం వరకు ఇప్పటికే బిల్లులు మంజూరు చేశారు. తక్కువ సమయంలో ఎక్కువ రోడ్లు నిర్మించాల్సి రావడంతో అధికారులు చాతుర్యాన్ని ప్రదర్శించారు. బల్దియా చరిత్రలో మొదటిసారి వందల కోట్ల రూపాయల రోడ్లు నిర్మించాల్సి రావడంతో బుర్రలకు పదును పెట్టారు. వేయని రోడ్లు వేసినట్టు.. వేసిన చోట ఎక్కువ మీటర్లు చూపి.. ఒకే స్ర్టెచ్‌ను విభజించి రెండు, మూడు సార్లు బిల్లులు పొందారు. ఇప్పటి వరకు పూర్తయిన పనుల్లో దాదాపు 25 - 30శాతం ఇదే తరహాలో ఉండడం గమనార్హం. రూ.337 కోట్లలో 270 కోట్ల బిల్లులు ఇప్పటికే మంజూరయ్యాయి. ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలన ప్రకారం రోడ్లకు సంబంధించి మంజూరైన బిల్లుల్లో సుమారు రూ100 కోట్లకుపైనే బోగస్‌ బిల్లులు ఉండవచ్చని అంచనా. ఈ దందాలో కొందరు అధికారులే బినామీ కాంట్రాక్టర్ల అవతారమెత్తగా.. కొందరు కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలున్నాయి. చాలా ప్రాంతాల్లో సాంకేతిక నిబంధనలకూ తిలోదకాలిచ్చారన్న విమర్శలున్నాయి. 

ఎవరి వాటాలు వారికి.. 
నిబంధనల ప్రకారం రోడ్ల నిర్మాణం విషయంలో రెండు, మూడు దశల్లో పరిశీలన జరగాలి. ప్రతిపాదనల నుంచి బిల్లుల మంజూరు వరకు మూడు స్థాయిల్లో ఉన్న ఇంజనీర్ల ఆమోదం అవసరం. అసిస్టెంట్‌ ఇంజనీర్‌ దగ్గరుండి పనులను పర్యవేక్షించాలి. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు కూడా తనిఖీ చేయాలి. పూర్తయిన అనంతరం రూ. లక్ష పైన వ్యయంతో కూడిన పనులను జీహెచ్‌ఎంసీ క్వాలిటీ కంట్రోల్‌ విభాగం, రూ.5 లక్షల కంటే ఎక్కువైతే థర్డ్‌ పార్టీ ఏజెన్సీ పరిశీలించాలి. నాణ్యతపై వారు నివేదిక ఇచ్చాకే బిల్లులు మంజూరు చేయాలి. రూ. 10 లక్షల లోపు పనులకైతే ఈఈ పరిశీలించి బిల్లును ఆమోదించాలి. అదే 10నుంచి 50 లక్షలలోపు పనులను ఎస్‌ఈ పర్యవేక్షించి బిల్లులకు ఆమోద ముద్రవేయాలి. కానీ ఇక్కడ అవేవి జరుగలేదు. ఎవరి వాటాలు వారికి అందడంతో కనీసం రోడ్డు వేశారా? లేదా.? అన్నది చూడకుండా బిల్లులు మంజూరు చేశారు. ఈఈ నుంచి ఏఈ వరకు మూకుమ్మడిగా దోపిడీకి తెగబడ్డారు. ప్రధాన కార్యాలయంలోని ఉన్నతాధికారులకూ అక్రమార్జనలో వాటాలు అందాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

 
ముంబైలో ఇంజనీర్లపై వేటు..

ముంబైలో రోడ్ల నిర్మాణానికి సంబంధించి ఇటీవల రూ.14 కోట్ల అవినీతి జరిగినట్టు గుర్తించారు. లోకాయుక్త ఆదేశాల మేరకు ఇంజనీర్లపై చర్యలు తీసుకున్నారు. స్థానిక పోలీసులు ఇచ్చిన నివేదిక ప్రకారం 26 మంది ఇంజనీర్లను అరెస్టు చేశారు. ఇద్దరు చీఫ్‌ ఇంజనీర్లపైనా వేటు పడింది. మరి భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడిన జీహెచ్‌ఎంసీలోని అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. 
 

 
 
నిధులు ‘సఫా’..గూడ చెక్‌పోస్ట్‌

యూసు్‌ఫగూడ డివిజన్‌లోని సారథి స్టూడియో నుంచి యూసు్‌ఫగూడ వరకు 1.7 yousfgudh.jpgకిలోమీటర్ల రోడ్డును 12.56 లక్షలతో కొత్తగా వేసినట్టు రికార్డులు చెబుతున్నాయి. కాని మెట్రో పనులు మూడు సంవత్సరాల క్రితం ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ఇంత వరకు రోడ్డు వేయలేదు. అలాగే యూసు్‌ఫగూడ మార్కెట్‌ నుంచి ఇందిరానగర్‌ వరకు 20.26 లక్షల నిధులతో రోడ్డు నిర్మించినట్టు రికార్డులు చెబుతున్నాయి. కాని నిర్మాణాలు జరగలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. 
 

 
 
వర్క్‌ నిల్‌.. బిల్లు ఫుల్‌

హబ్సిగూడ డివిజన్‌ వెంకట్‌రెడ్డినగర్‌లోని సాయిరాం కాన్వెంట్‌ స్కూల్‌ నుంచి ఆటో Venka.jpgస్టాండ్‌ వరకు ఉన్న సీసీ రోడ్డు ఇది. ఈ స్ర్టెచ్‌లో 150 మీటర్ల మేర రూ.27.28 లక్షలతో బీటీ రోడ్డు పనులు పూర్తి చేసినట్టు బిల్లులు తీసుకున్నారు. కానీ ఇక్కడ బీటీ రోడ్‌ నిర్మాణమే జరుగలేదు. 
 

 
 
 
‘దేవుళ్ల’కే శఠగోపమా?

మన్సూరాబాద్‌ డివిజన్‌లోని అయ్యప్ప కాలనీ ఆంజనేయ స్వామి ఆలయం నుంచిHanum.jpgవెంకటేశ్వర ఆలయం వరకు, హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌ నుంచి సాయినగర్‌ ప్రధాన రహదారి వరకు రూ.450 మీటర్ల మేర వేర్వేరు స్ర్టెచ్‌ల పనులను రూ.22.72 కోట్లతో పూర్తిచేసినట్టు చూపారు. కానీ ఆంజనేయ స్వామి ఆలయం నుంచి వెంకటేశ్వర ఆలయం వరకు ఇప్పటికీ సీసీ రోడ్డే ఉంది. 
 

 
 
ఏం ‘ఫలితమండీ’

సీతాఫల్‌మండి డివిజన్‌ పరిధిలో దత్తాత్రేయ ఆలయం నుంచి శ్రీదేవీ నర్సింగ్‌ హోం seethaphalma.jpgవరకు రూ.35 లక్షలతో 1200 మీటర్ల మేర రోడ్డు వేసినట్టు ఉండగా.. క్షేత్రస్థాయిలో 800 మీటర్లలోపే బీటీ రోడ్డు ఉంది. 
 

 
 
 
 
 
రోడ్డొచ్చేనా గోపాలా?

రాంగోపాల్‌పేట డివిజన్‌లో 1980 మీటర్ల పనులను నాలుగు స్ర్టెచ్‌లుగా విభజించారు. 7k.jpgరూ.49.50 లక్షలతో పనులు చేపట్టగా.. స్విమ్మింగ్‌ పూల్‌ పక్క రోడ్డు పనులు ఇంకా జరుగలేదు. 
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
ఏ‘బీటీ’.. ఈ అవినీతి?

కేపీహెచ్‌బీకాలనీలో వాసన్‌ ఐ కేర్‌ నుంచి రెమిడీ ఆస్పత్రి వరకు ఆదేశ్వర్‌ ఎలక్ర్టానిక్స్‌ 4KJ.jpgరోడ్డులో రూ.50 లక్షలతో 1190 మీటర్లు బీటీ రోడ్డు వేసినట్లు చూపారు. అయితే ఈ స్ర్టెచ్‌లో ఇప్పటికీ 70 శాతం సీసీ రోడ్డు ఉండడం గమనార్హం. 
 

 
 
 
 
 
 
 
 
 
 
 
నాలుగేళ్లుగా రోడ్డు వేయలేదు

బాలాజీనగర్‌ ఏపీహెచ్‌బీ కాలనీలో నాలుగేళ్లుగా అసలు రోడ్డ్డు వేయలేదు. రెండు నెలల rameshKSR.jpgక్రితం కురిసిన వర్షాలకు రోడ్డు గుంతలమయంగా మారింది. గుంతల్లో మట్టి తీసి పూడ్చకుండా వదిలేశారు. 

- రమేష్‌, బాలాజీనగర్‌ స్థానికుడు 

 

 
 
 
 
 
 
 
 
 
 
డ్రైనేజీ కోసం తవ్వి వదిలేశారు 

బౌద్ధనగర్‌ ఎస్‌బీహెచ్‌ కాలనీలో డ్రైనేజీ లైన్‌ వేసేందుకు 6 నెలల క్రితం రోడ్లు తవ్వి vennu.jpgపనులు చేపట్టారు. ఇంటి నంబరు 12-11-2052 నుంచి 12-11-2066 ప్రాంతాల్లో కొత్తగా రోడ్డు వేయలేదు. మరమ్మతులు కూడా చేయలేదు. 

- వెన్ను నర్సింగరావు, బౌద్ధనగర్‌ 

 

 
 
 
 
 
 
 
 
 
‘దూర’దృష్టి ‘తారు’మారై...

రామంతాపూర్‌ డివిజన్‌లోని ఏడీఆర్‌ఎం ఆస్పత్రి నుంచి షోలే మటన్‌ షాపు వరకు

 

Coca Cola Pepsi Balayya Babu Sexy Coca Cola Pepsi Balayya Babu Sexy Coca Cola Pepsi Balayya Babu Sexy Coca Cola Pepsi Balayya Babu Sexy

Posted
14 hours ago, ziboomba1 said:

btw, we want dates. before telangana ayithe andhrolla kutra ..after telangana ayina sare andhrolla kutra 

@3$%

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...