Jump to content

telugu people died


Recommended Posts

Posted

అమెరికాలోని లూయిస్ విల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా మరో ఇద్దరు ప్రవాసాంధ్రులు మృతి చెందినట్లు తెలుస్తోంది. వీరిలో రామ వరాహభట్ల(35) - రాజశేఖర్ రెడ్డి యర్మాల(25) అనే ఇద్దరూ తీవ్రంగా గాయపడగా - వెంకట ప్రశాంత్ కొమ్ము(27) - అన్వేష్ కుమార్(24)లు మృతి చెందారు. లూయిస్ విల్లీలోని నార్త్ బెండ్ రోడ్డు మీద కారులో వేగంగా వెళ్తున్న సమయంలో ఈ ప్రమాధం చోటుచేసుకుంది!

ఒక అమెరికన్ న్యూస్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి పది గంటల ప్రాంతంలో ఈ నలుగురూ కారులో వేగంగా వెళ్తున్నారు. ఆ సమయంలో ఎదురుగా భారీ మలుపు వచ్చింది. ఆ విషయాన్ని కారును నడుపుతున్న రామ గుర్తించకపోవడంతో అదుపుతప్పిన కారు పక్కకు దూసుకెళ్లింది. ఆ సమయంలో గాల్లో పలుమార్లు పల్టీలు కొట్టిన కారు.. అనంతరం ఒక చెట్టును ఢీ కొట్టి అందులో ఇరుక్కుపోయింది. దీంతో కారు ముందు భాగంలో కూర్చున్న రామ - రాజశేఖర్ లతో పాటు వెనుక భాగంలో కూర్చున్న అన్వేష్ కూడా తీవ్రంగా గాయపడి కారులో ఇరుక్కుపోయారు. అయితే కారు వెనుక భాగంలోనే కూర్చున్న ప్రశాంత్ మాత్రం సడన్ గా కారు డోర్ ఓపెన్ చేయడంతో కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని ఆ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

ప్రమాదం సంగతి తెలుసుకుని ఘటనా స్ధలానికి చేరుకున్న హబ్రాన్ ఫైర్ సర్వీసు అధికారులు కారులో చిక్కుకుపోయిన ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. ఈ సమయంలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న రాజశేఖర్ ను యూనివర్సిటీ ఆఫ్ సిన్సిన్నాటి మెడికల్ సెంటర్ కు తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. రాజశేఖర్ స్వగ్రామం ఖమ్మం జిల్లాలోని మథిర అని తెలిసింది. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న అన్వేష్ - రామ లకు ఎలాంటి ప్రాణాపాయం లేదని పోలీసులు చెబుతున్నారు.

Posted

RIP so sad news, may god give strength to their families..

Posted
8 minutes ago, jbourne said:

Louisville ante house teesi maa university poragallu kaadu kada 

so sad rip 

Nenu ade anukunna kompadeesi Sullivan batch kaadu kada

Posted
2 minutes ago, afdbzindabad said:

Nenu ade anukunna kompadeesi Sullivan batch kaadu kada

ee batch ayithe ee baa...papam chanipoyaaru....So sad...

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...