kiladi bullodu Posted October 25, 2016 Report Posted October 25, 2016 అతి చేస్తే గతి చెడుతుందంటారు నిజంగానే మనోడు ఆశ మితిమీరింది శృంగారంలో రెచ్చిపోవాలన్న కోరిక పరిధి దాటిపోయింది తొందరపాటులో తీసుకున్న అనాలోచిత నిర్ణయం కాస్త ప్రాణం మీదకు తెచ్చింది.కేవలం ఒకే ఒక్క శస్త్ర చికిత్స నిండి జీవితాన్ని బలితీసుకుంది. ఎలా అంటే..? అంగం సైజుపై అపోహతో ప్రాణాలు పోగొట్టుకున్నాడో కుర్రాడు. తన అంగం సైజు పెంచుకుని శృంగారంలో రెచ్చిపోదామనుకున్న పిచ్చి కోరికతో ప్రాణాల మీదకే తెచ్చుకున్నాడు. అతని ఆశను క్యాష్ చేసుకుందామనుకున్న ఓ మహిళ చేసిన ప్రయత్నం కాస్తా విఫలమైంది. ఫలితంగా ఆ.. కుర్రాడు ప్రాణాలు విడవగా.. డాక్టరమ్మ జీవితం ఇప్పుడు జైలు గోడలకు పరిమితమైంది. వివరాల్లోకి వెళ్తే.. అతడి పేరు : జస్టిన్ స్ట్రీట్ వయస్సు : 22. ఓ పార్టీ ఏనిమల్. ప్రతి వీకెండ్‌లోనూ పబ్‌లకు, పార్టీలకు తన గాళ్‌ఫ్రెండ్‌తో కలిసి వెళ్లి ఎంజాయ్ చేస్తుంటాడు. వారిద్దరూ తరచూ సెక్స్‌లో కూడా పాల్గొంటారు. అయితే ఇటీవల అతని గళ్‌ఫ్రెండ్ కోరిక మేరకు తన అంగం సైజు పెంచుకుందామను కుని కసియా రివేరా అనే డాక్టర్ వద్దకు వెళ్లాడు. నిజానికి ఆమె రిజిస్టర్డ్ డాక్టర్ కాకపోయినా ఈ పని చేసేందుకు అంగీకరించింది.డబ్బులు తీసుకుని యువకుడి అంగంలోనికి సిలికాన్‌ను ఇంజెక్ట్ చేసింది. అది కాస్త వికటించడంతో శస్త్రచికిత్స జరిగి.. 24 గంటలు పూర్తవ్వగానే జస్టిన్ మరణించాడు. అంగంలోకి సిలికాన్‌ను ఇంజెక్ట్ చేయడం వల్లే అతడు తనువు చాలించాల్సి వచ్చిందని పోస్ట్‌మార్టమ్ నివేదికలో వెల్లడైంది. దీంతో డాక్టర్ కసియాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏ మాత్రం అనుభవం లేకుండా, నిర్లక్ష్యంగా వైద్యం చేసినందుకు ఆమెకు ఐదేళ్ల జైలు శిక్ష విధించారు అక్కడి న్యాయమూర్తి. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.