Jump to content

Recommended Posts

Posted

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని ఏపీ జెన్‌కో అల్టిమేటం జారీ చేసింది. తెలంగాణకు సరఫరా చేసిన విద్యుత్‌కు సంబంధించిన రూ.4,282 కోట్ల బిల్లులను తక్షణమే చెల్లించకపోతే రాష్ట్రానికి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని తేల్చి చెప్పింది. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన దక్షిణ ప్రాంతీయ పవర్ కమిటీ(ఎస్‌ఆర్‌పీసీ) సమావేశంలో ఈ మేరకు ఏపీ జెన్‌కో ఎండీ కె.విజయానంద్ ప్రకటన చేశారు. ఎస్‌ఆర్‌పీసీ కమిటీ సభ్యుడు భట్ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో తెలంగాణ ట్రాన్స్‌కో నుంచి కమర్షియల్ విభాగం చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరశర్మ, ఏపీ నుంచి ఏపీ జెన్‌కో ఎండీ విజయానంద్, ట్రాన్స్‌కో జేఎండీ దినేష్ పరుచూరి, జెన్‌కో ఫైనాన్స్ డెరైక్టర్ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని జెన్‌కో విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల నుంచి తెలంగాణకు 53.89 శాతం, ఏపీకి 46.11 శాతం విద్యుత్ కేటాయింపులు చేశారు. తెలంగాణలోని ప్రాజెక్టుల నుంచి ఏపీకి 46.11 శాతం.. ఏపీలోని ప్రాజెక్టుల నుంచి తెలంగాణకు 53.11 శాతం విద్యుత్ సరఫరా జరుగుతోంది. విభజన చట్టం ప్రకారం ఏపీ నుంచి తెలంగాణకు 450-300 మెగావాట్ల విద్యుత్ అదనంగా సరఫరా జరుగుతోంది.

పరస్పరం చెల్లించుకోవాల్సిన విద్యుత్ బిల్లులను సర్దుబాటు చేసిన తర్వాత తమ రాష్ట్రానికి రూ. 4,282 కోట్ల బిల్లులను తెలంగాణ చెల్లించాల్సి ఉందని ఏపీ అధికారులు ఎస్‌ఆర్‌పీసీలో వాదించారు. ఏపీ వాదనతో విబేధించిన తెలంగాణ అధికారులు బిల్లుల సర్దుబాటు తర్వాత ఏపీ నుంచే తమ రాష్ట్రానికి రూ.2,406 కోట్లు రావాలని తేల్చి చెప్పారు. దీంతో తెలంగాణకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని విజయానంద్ చెప్పారు. ఈ వివాదాన్ని ఇరు రాష్ట్రాలు పరస్పరం చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, ఇది తమ పరిధిలోకి రాదని ఎస్‌ఆర్‌పీసీ తెలిపిందని తెలంగాణ అధికారులు పేర్కొన్నారు.

Posted

VOTE KI NOTU CASE bayataki tistam antaru TSGENCO balance aipola 

Posted
5 minutes ago, pahelwan said:

VOTE KI NOTU CASE bayataki tistam antaru TSGENCO balance aipola 

Aa case ni @Kcr_Chamcha gudd@lo pettukomantaru APGENCO vallu

Posted
5 hours ago, pahelwan said:

VOTE KI NOTU CASE bayataki tistam antaru TSGENCO balance aipola 

ante ante  Kontekurradu

Posted
13 hours ago, sri_india said:

Lol mundu undi mussala pandugaa kcr ki

Janam ki current charges penchi dobbuthadu 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...