Jump to content

Balayya babu - Mahesh babu heros gaa multistarer movie


Recommended Posts

Posted

Assalu rachaa combo .... 

 

కొన్ని కొన్ని క్రేజీ కాంబినేషన్లు చిత్ర సీమలో ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. ఎక్కువగా అయితే అది డైరెక్టర్ల విషయంలో జరుగుతుంటుంది. మరి ఇద్దరు క్రేజీ హీరోలు కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తే ఎలా ఉంటుంది? అలాంటి క్రేజీ హీరోల కాంబినేషన్లే రీసెంట్‌గా చిత్ర సీమలో వచ్చాయి. ఒకటి మహేశ్-వెంకటేశ్ కాంబినేషన్ అయితే.. రెండోది వెంకటేశ్-పవన్‌ కల్యాణ్‌ల కాంబినేషన్. ఆ రెండు సినిమాలు కూడా బాక్సాఫీసు వద్ద మంచి విజయాలనే అందుకున్నాయి. ఇప్పుడు అంతకన్నా ఓ క్రేజీ హీరోల కాంబోను తెరపైన చూడొచ్చన్న టాక్ వినిపిస్తోంది. అది నందమూరి బాలకృష్ణ, టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు. మరి ఇంతకీ వారిద్దరినీ కలుపుతున్న డైరెక్టర్ ఎవరు? అలాంటి కాంబినేషన్‌ను సెట్ చేస్తున్నది ఎవరు? అంటే జనతా గ్యారేజ్ భారీ హిట్‌తో హ్యాట్రిక్ హిట్లు కొట్టేసిన కొరటాల శివ పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం మురుగదాస్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న మహేశ్.. తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివతో చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలోనే బాలయ్య నటిస్తాడట. ఇప్పటికే ఆ సినిమా కోసం కొరటాలతో కలిసి బాలయ్యను సంప్రదించాడట మహేశ్ బాబు. ఇక, కొరటాల చెప్పిన కథ నచ్చడంతో బాలకృష్ణ కూడా ఆ సినిమాలో నటించేందుకు సుముఖత వ్యక్తం చేశాడన్న ప్రచారం సాగుతోంది. జనతాగ్యారేజ్ సినిమాలో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, తారక్‌లను కలిపి సినిమా తీయడంలో కొరటాల సక్సెస్ అయ్యాడు. ఆ భరోసాతోనే కొరటాల డైరెక్షన్‌లో ఈ మల్టీస్టారర్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నారట బాలకృష్ణ, మహేశ్ బాబు. వచ్చే ఏడాదే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతోంది. మరి ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అయితే.. అటు బాలయ్య అభిమానులకు, ఇటు మహేశ్ అభిమానులకు సంబరాలే. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
 
 
Posted
31 minutes ago, Prince_Fan said:

vadu eppudu real news icchaadu ani

Abn is reliable bro...

Posted
6 minutes ago, suppandi said:

bali gadu bob ki father charcater aa??  gallery_731_15_397672.gif

younger brother %$#$

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...