Luke Posted November 3, 2016 Report Posted November 3, 2016 - రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు - అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశంనవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధిభూముల మార్కెట్ విలువను పెంచకుండా భూసేకరణ ఏవిధంగా చేస్తారని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 2013 భూసేకరణ చట్టం కింద భూమిని సేకరించడానికి నోటిఫికేషన్లు జారీ చేసిన ప్రభుత్వం 2012 నాటి భూముల విలువతో భూమిని సేకరించడం పట్ల ఆక్షేపణ తెలిపింది. దీనిపై పూర్తిస్థాయి వివరాలతో కూడిన కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో మార్కెట్ విలువను పెంచకుండా భూసేకరణ ప్రక్రియను కొనసాగించడాన్ని సవాలు చేస్తూ రాష్ట్ర కిసాన్‌ఖేత్ మజ్దూర్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యుడు ఎమ్. కోదండరెడ్డి వేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్, జస్టిస్ శంకరనారాయణలతో కూడిన బెంచ్ ఈ పిటిషన్ విచారించింది. మార్కెట్ విలువను ప్రతి రెండేండ్లకొకసారి పెంచాలని గతంలో జారీ చేసిన మార్గదర్శక సూత్రాలను ప్రభుత్వం అమలు చేయడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. 2012, 2013 సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రాంతంలో భూముల మార్కెట్ విలువను పెంచలేదని పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు. 123 జీఓ ద్వారా భూములను సేకరిస్తున్న ప్రభుత్వం మార్కెట్ విలువను తక్కువగా చూపిస్తున్నదని పిటిషనర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎకరం భూమి విలువ ఒక లక్ష రూపాయలుగా చూపిస్తూ మూడు లక్షల రూపాయల పరిహారం అందచేస్తున్నదని తెలిపారు. అమ్మకాలు, కొనుగోళ్ళ ప్రకారం కనీస మార్కెట్ విలువ నాలుగు లక్షల రూపాయలు ఉన్నదని, దీనికి మూడు రెట్లు అనగా ఎకరానికి రూ. 12 లక్షలు పరిహారంగా ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది వాదిం చారు. ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి వాది స్తూ భూముల విలువను పెంచే అవసరం ఇప్పట్లో ప్రభుత్వానికి లేదన్నారు. ఈ అధికారాలు కలెక్టర్లకు ఉన్నాయని తెలిపారు. దీనిపై న్యాయమూర్తులు జోక్యం చేసుకుని భూములు విలువను పెంచకూడదనే నిబంధనలేమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలన్న కోర్టు కేసు విచారణను ఈ నెల 16 కి వాయిదా వేసింది Quote
DiscoKing Posted November 3, 2016 Report Posted November 3, 2016 #androllakutra maa high court #maagavale Quote
DiscoKing Posted November 3, 2016 Report Posted November 3, 2016 lol court tho 10ngichukomante first untadu Quote
Luke Posted November 3, 2016 Author Report Posted November 3, 2016 1 minute ago, DiscoKing said: lol court tho 10ngichukomante first untadu Quote
DiscoKing Posted November 3, 2016 Report Posted November 3, 2016 12 minutes ago, Luke said: +1 for langas Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.