Jump to content

Recommended Posts

Posted

ఒకవైపు యువతరం ఉప్పొంగిపోతోంది.. ఫేస్ బుక్ లోనూ, వాట్సాప్ లలోనూ.. జై మోడీ నినాదాలు మార్మోగుతున్నాయి. ఈ దెబ్బకు మొత్తం నల్లధనికులు ఇబ్బందుల్లో పడిపోతారని.. పన్నుల పరిధిలోకి తీసుకురాకుండా… డబ్బునంతా సంచుల్లో కుక్కుకుని, శివాజీ సినిమాలో సుమన్ దాచి పెట్టినట్టుగా దాచిన వారు ఇరకాటంలో పడిపోయారని.. మెజారిటీ ప్రజానీకం భావిస్తోంది. 

ఇప్పుడు నల్లధనికుల ముందు రెండే మార్గాలున్నాయి.. తమ దగ్గర ఉన్న నల్లధనాన్ని బ్యాంకులకు తీసుకుని వచ్చి మార్పించుకోవడం. ఇలా చేస్తే.. వాళ్ల లొసుగు బయటపడిపోతుంది. వాళ్ల నేరాలన్నీ బయటకు వస్తాయి. దేశంలో ఇలాంటి వాళ్ల సంఖ్య లక్షల్లో ఉంటుంది  కాబట్టి.. వీళ్లందరి ఆర్థిక నేరం బయటకు వస్తుందనేది ఒక ఆశ.

నల్లధనికుల ముందున్న రెండో మార్గం… తమ నేరం బయట పడిపోతుందని ఉన్న డబ్బును తమ దగ్గరే ఉంచుకోవడం. ఎలాగూ రెండు నెలల తర్వాత అవి చెల్లవు కాబట్టి.. ఆ డబ్బు వాళ్ల దగ్గరే మురిగిపోతుంది. ఇలా జరిగితే.. నష్టం వాళ్లకే వాళ్లంతా దివాళా తీస్తారు.

ఇవి కామన్ గా వినిపిస్తున్న అభిప్రాయాలు. మోడీ వాళ్లను కట్టడి చేశాడని, వాళ్ల ముందు రెండే మార్గాలను ఉంచి ఇరకాటంలో పడేశాడని యువత మురిసిపోతోంది. అయితే… ఇలానే జరగాలని ఏమీ లేదు. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు. మారకం విషయంలో నల్లధనికులకు అన్ని దారులూ మూసుకుపోయాయని అనుకోవడం కేవలం అమాయకత్వమే!

నల్లధనికులు అందరూ డబ్బును మాత్రమే దాచుకుని ఉండకపోవచ్చు.. కిలోల కొద్దీ బంగారాన్ని కొని పెట్టుకుని ఉన్న వాళ్లు, వజ్రాలను కొని దాచిన వాళ్లు.. ఆస్తులను కొన్న వాళ్లే ఉన్నారంతటా! ఏసీబీకి పట్టుబడుతున్న అవినీతి ఉద్యోగుల దగ్గర దొరకుతున్న నోట్ల కట్టలు తక్కువ.. బంగారం, ఇతర ఆస్తుల రూపాల్లోని నల్ల సంపద ఎక్కువ! వంద కోట్ల రూపాయల అక్రమాస్తులు కలిగిన వాడి దగ్గర కూడా.. లక్ష రూపాయలు కూడా క్యాష్ రూపంలో డబ్బు దొరకడం లేదనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం తీసుకున్న చర్య ప్రభావం ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

నల్లధనం అరికట్టడానికి నోట్ల రద్దు ను స్వాగతిస్తున్న వాళ్లు.. ఏవో కొత్త నోట్లు వస్తున్నాయనే ఫ్రెష్ నెస్ ను కూడా ఫీలవుతున్నారు. ఐదొందలు, వెయ్యి రూపాయల నోట్ల కొత్త డిజైన్ బాగుంది.. మారకంలో ఉన్న నోట్లను మార్చి మార్చి బోర్ కొట్టింది..కొత్త నోట్ల ముచ్చట గురించి వీళ్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

గమనించాల్సిన మరో అంశం.. ఐదు వందల నోట్లు పూర్తిగా రద్దు కాలేదు, వెయ్యి రూపాయలకు బదులుగా ఏకంగా రెండు వేల రూపాయల నోట్లు రాబోతున్నాయి. వెయ్యి రూపాయల నోట్లే నల్లధనానికి మూలం అయితే.. రాబోతున్నది రెండు వేల రూపాయల నోట్లు! ఇప్పటి వరకూ సంపాదించినదంతా పోగొట్టుకున్నా.. వీరు సంపాదించే మార్గాలన్నీ మూసుకుపోవు. కాబట్టి రెండు వేల రూపాయల నోట్లు వస్తే.. వీళ్లకే ఇంకా సౌలభ్యం!

ఇవన్నీ కాయిన్ కు ఒక సైడ్.. మరోవైపు ఉన్న అంశం.. అనాథరైజ్డ్ సెక్టార్ పరిస్థితి! ఇప్పటికీ బ్యాంక్ అకౌంట్లు లేని, బ్యాంక్ తో సంబంధంలేని మనుషులు ఈ దేశంలోకొన్ని కోట్ల మంది ఉన్నారు. మనది యూఎస్ కాదు, యూరప్ కాదు.. గ్రామీణ భారతం, వడ్డీ వ్యాపారాలు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్లు.. ఇక్కడ చెల్లింపులు అన్నీ బ్యాంకులతో సంబంధం లేకుండానే సాగుతున్నాయి. ఇందులోనూ కోట్ల రూపాయల నల్లధనం ఉంది.. ఇక్కడ ఇబ్బంది నల్లధనికులది కాదు, ఐదారు వేల జీతాలకు పని చేసే జీతగాళ్లది!

స్వతహాగా ఆర్థికరంగ నిపుణుడే అయిన  ప్రముఖ రచయిత .. యండమూరి వీరేంద్రనాథ్ తన నవల ఒకదానికి ఉపోద్ఘాతంలో ‘దేశంలో లంచం పూర్తిగా రద్దు అయితే పరిస్థితి ఎలా ఉంటుంది..’ అనే అంశంపై ఒక  సుధీర్ఘమైన విశ్లేషణ రాశారు. సరదాగా.. వాస్తవికంగా ఉండే ఆ వ్యాసంలో.. ఒక వ్యక్తి ముందు దేవుడు ప్రత్యక్షం అవుతాడు. నీకేం కావాలి అని అడిగితే.. దేశంలో లంచం పూర్తిగా నశించాలి అని అతడు కోరుకుంటాడు. దేవుడు తథాస్తూ అని అంటాడు. అక్కడ నుంచి పరిస్థితులు ఎలా మారతాయి.. అనేది అందులో ఉంటుంది. చివరకు దేశంలో పరిస్థితి ఎలా తయారవుతుందంటే.. చివరకు అదే మనిషి దేవుడా, నేను పొరపాటున అలా కోరుకున్నాను అని మళ్లీ దేవుడికి ప్రార్థించే పరిస్థితి వస్తుంది. అది దశాబ్దాల కిందట రాసిందే అయినా.. చాలా వాస్తవికంగా ఉంటుంది. ఇప్పుడు ఐదొందల, వెయ్యి నోట్ల నిజంగానే పూర్తిగా రద్దు చేస్తే.. దేశంలో ఆర్థిక స్థితిగతులు నిర్వీర్యం అయ్యే అవకాశాలూ లేకపోలేదు. 

అసలు.. అవినీతిని, నల్లధనాన్ని, దొంగ నోట్లను అరికట్టడం అనేదాని కోసం నోట్లను రద్దుచేయడం ఒకరకంగా తుగ్లక్ చర్య కూడా! ఎందుకంటే.. ఆ వీటిని అరికట్టడానికి దేశంలో చాలా వ్యవస్థలున్నాయి. ప్రతి రాజకీయ వేత్త కూడా వీటిని అరికట్టడమే తన పని అని ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. అవినీతి నిరోధానికి బోలెడన్ని ప్రభుత్వ వ్యవస్థలున్నాయి. మరి వాటి ద్వారా ఆ పనిలో విజయం సాధించాలి ప్రభుత్వం. కానీ అది జరగడం లేదు. ఆ విషయాన్ని ఇప్పుడు అధికారికంగా కూడా ఒప్పుకున్నట్టు అయ్యింది. పెద్ద నోట్లు రద్దు కొత్తేమీ కాదు.. ఇది వరకూ జరిగింది, మళ్లీ మామూలే! ఏదీ ఆగదు.. నల్లధనం పేరుకుపోవడంతో సహా.. మళ్లీ మళ్లీ జరుగుతూ ఉంటుందంతే! 

Posted

Jai Jagan Anna....

Posted
37 minutes ago, punyavathi said:

Sakshit

It is true. see the stats of money, gold , real estate properties seized in raids.

Posted
36 minutes ago, micxas said:

Desham mottam oka samaysa aite maa jaGuns thi inkoti)o_

odarpu kavali  micxas

Posted

eddi fulkas ki Gyu lo padindi inka sarigga digaledhu , dimpudu ippudey modalayyindi.. 

Posted
15 minutes ago, ManOnFire said:

eddi fulkas ki Gyu lo padindi inka sarigga digaledhu , dimpudu ippudey modalayyindi.. 

 

Posted
12 minutes ago, JAFFAREDDY said:

papam jaggadu baaga feel ayinattunnadu. ekkuva cash gaa pettukunnademo

 

 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...