vravi22 Posted November 9, 2016 Report Posted November 9, 2016 రెండు రోజుల క్రితం వరకు డోనాల్డ్ ట్రంప్‌ని ‘అమెరికన్ కెసిఆర్’ అని ఆడిపోసుకున్నారు తెలుగువాళ్లు! ఇప్పుడతనే అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యారు. అచ్చంగా మన కెసిఆర్‌లాగే! ప్రచార మాధ్యమాలన్నీ హిల్లరీ క్లింటన్ వెనక నిలబడ్డాయి. ట్రంప్ మాట్లాడిన ప్రతి మాటకి వక్ర భాష్యాలు చెప్పాయి. “మాట తీరు సరి లేదని, ఆడవాళ్ళంటే గౌరవం లేదని, లేడీ పెర్‌ఫ్యూం తగిలితే చొంగ కార్చేసుకునే ఉమనైజర్” అని తెగ దుష్ప్రచారం చేసింది ప్రో-హిల్లరీ క్యాంప్. ట్రంప్ నెగ్గితే ఇండియన్లని, ముఖ్యంగా తెలుగువాళ్లందరినీ గెంటేస్తాడని, డాలర్లు రావడం ఆగిపోతాయని భయం పుట్టించారు. “అమెరికాలో స్థిరపడిన తెలుగువాళ్లందరూ హిల్లరీ క్లింటన్‌కే ఓటేయాల”న్న ప్రచారం ముమ్మరంగా సాగింది. ప్రత్యేకించి తెలుగు దేశం పార్టీకి భీకర మద్దతు పలికే ఒక సామాజిక వర్గం… పనిగట్టుకుని డోనాల్డ్ ట్రంప్‌పై దుష్ప్రచారం సాగించింది. ఇంతకీ హిల్లరీ ఓడిపోవడం కన్నా ట్రంప్ గెలుపే ఇక్కడ ముఖ్యం. వ్యక్తిగత ప్రచారంలో ఇద్దరూ హోరాహోరీగా పనిచేశారు. చివరిదాకా పోటాపోటీగా వచ్చారు. ఎడ్జ్‌లో ట్రంప్ విజయం అందుకున్నారు. మొత్తంగా హిల్లరీ తన ప్రచారంలో 85 స్లోగన్లు వినిపించగా… ట్రంప్ మాత్రం ఒకే ఒక్క నినాదంతో అమెరికన్ల మనసు గెలుకున్నారు. కెసిఆర్ మాదిరిగానే “మన నీళ్లు-మన నిధులు-మన ఉద్యోగాలు” పద్ధతిలో ట్రంప్ “మేక్ అమెరికా గ్రేట్ అగైన్” అనే ఒకే ఒక్క స్లోగన్ ఇచ్చారు. దీనివల్ల డోనాల్డ్ ట్రంప్‌లో ఒక జాతీయవాదిని చూశారు ఓటర్లు. హిల్లరీ అనేక అంశాలను ప్రస్తావించినా జనంలో భరోసా కల్పించలేకపోయారు. “మన ఉద్యోగాలు మనకే” అన్న ట్రంప్ నినాదం అమెరికాలోని నిరుద్యోగ యువతని బాగా ఆకట్టుకుంది. వాళ్లు గంపగుత్తగా ఓట్లు వేసి ట్రంప్‌ని వైట్ హౌస్‌కి పంపించారు. హిల్లరీని తెలుగువారిలో ఒక వర్గం మాత్రమే అభిమానించి ప్రచారం చేయగా, ట్రంప్‌ని ఇతర అన్ని వర్గాలూ ప్రేమించాయి. టాలీవుడ్ నుంచి తారలు వెళ్లి మరీ ట్రంప్ కోసం ప్రచారం చేయడం జరిగింది. అమెరికా పునర్నిర్మాణానికి సాగుదాం : ట్రంప్ ట్రంప్ వస్తే ఎన్నారైలందరినీ గెంటేస్తారన్న వాదం వట్టిదేనని ఆయన తొలి ప్రసంగంలో స్పష్టంగా తేలింది. “నేటి నుంచి మనమంతా ఒక్కటే. డెమొక్రాట్లు, రిపబ్లికన్లు అనే తేడా లేకుండా అమెరికా పునర్నిర్మాణానికి చేయి చేయి కలిపి సాగుదాం” అని విజయం ఖాయం కాగానే ప్రజలనుద్దేశించి అన్నారు ట్రంప్. ఇది తెలంగాణలో కెసిఆర్ సాధించిన అపూర్వ విజయంతో సమానమైందని అంటున్నారు అమెరికన్ ప్రవాస భారతీయులు. Quote
micxas Posted November 9, 2016 Report Posted November 9, 2016 Agreed, US ki India elago... Ts ki Ap people alaga afterall they both are two diff. countries right.... Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.