ye maaya chesave Posted December 10, 2016 Report Posted December 10, 2016 నటీనటులు: రామ్ చరణ్-అరవింద్ స్వామి-రకుల్ ప్రీత్ సింగ్-నవదీప్-పోసాని కృష్ణమురళి-నాజర్-షాయాజి షిండే-మధు తదితరులు సంగీతం: హిప్ హాప్ తమిళ ఛాయాగ్రహణం: పి.ఎస్.వినోద్ మాటలు: వేమారెడ్డి నిర్మాతలు: అల్లు అరవింద్-ఎన్వీ ప్రసాద్ కథ: మోహన్ రాజా స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సురేందర్ రెడ్డి కథ: ధృవ (రామ్ చరణ్) ఐపీఎస్ ట్రైనీగా ఉండగానే తన సహచరులతో కలిసి సొసైటీలో జరిగే నేరాలపై పోరాటం మొదలుపెడతాడు. ఐతే ధృవ అండ్ కో ఎంతో కష్టపడి చాలామంది నేరస్థుల్ని పట్టుకున్నా.. వాళ్లందరూ కేసుల నుంచి బయటపడి సమాజంలో దర్జాగా తిరిగేస్తున్నారని తర్వాత తెలుస్తుంది. దీంతో ధృవ మొత్తం నేర ప్రపంచం మీద దృష్టిపెడతాడు. గొప్ప సైంటిస్టుగా చలామణి అవుతూ.. పద్మశ్రీ అవార్డు కూడా అందుకున్న సిద్ధార్థ్ అభిమన్యు (అరవింద్ స్వామి) ఈ నేరాలన్నింటికీ సూత్రధారి అని తెలుసుకున్న ధృవ.. అతణ్ని టార్గెట్ చేస్తాడు. వీళ్లిద్దరి మధ్య పోరు ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది.. ఈ పోరాటంలో ఎవరు గెలిచారు అన్నది మిగతా కథ. కథనం-విశ్లేషణ: రెగ్యులర్ పోలీస్ హీరో- డాన్ తరహా విలన్ మధ్య యుద్ధం లాంటి కధ. ఐతే సాధారణంగా ఇలాంటి కధల్లో బ్యాక్ డ్రాప్,జానర్ ని బట్టి కధా కధనాలు మారినా, విలన్ పాత్రని పరిచయం వరకే కాస్త బిల్డప్ ఇచ్చి ఆ తరువాత హీరో ని అందనంత ఎత్తులో ఉంచేయడం జరుగుతుంది. చాలా తక్కువ సార్లు మాత్రమే విలన్ క్యారెక్టర్ ని కూడా ఆసక్తికరంగా, హీరో తో పోటా పోటీ గా రూపొందించడం జరుగుతుంది. ధ్రువ లో అలాంటి విలన్ పాత్రే మనకు కనబడుతుంది. పరిచయ సన్నివేశం నుండి చివరి వరకు ఆ పాత్ర చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు అన్నీ ఆకట్టుకున్నవే,అంత బలమైన క్యారెక్టర్ ని అరవింద్ స్వామి అద్భుతమైన నటన తో మరో స్థాయి కి తీసుకెళ్లాడు. ఐతే హీరో క్యారెక్టర్ ని కూడా అంతే ధీటుగా ఉండేలా చూసుకోవడం తో రెండు పాత్రల మధ్య ఇంటెలిజెంట్ గేమ్ ని చక్కగా బాలన్స్ చేయగలిగారు. ఒక్కో మెట్టూ ఎక్కుతూ తన లక్ష్యం వైపు వెళ్లే హీరో పాత్రని ఎస్టాబ్లిష్ చేయడం లో ఎలాంటి అనవసర హంగుల కి పోకుండా అతను ఏంత సమర్ధుడో చూపించడం బాగుంది. చైన్ స్నాచింగ్ ఎపిసోడ్, తన లక్ష్యం ఏంటో తన స్నేహితుల బృందం తో చెప్పే సీన్స్ ఆ తరువాత జరగబోయే సంఘర్షణకి మంచి లీడ్ లాగ ఉపయోగ పడ్డాయి. "నా శత్రువు ని నేను సెలెక్ట్ చేసుకున్నాను " అని ముందుగానే ఛార్జ్ తీసుకుని ఇంటర్వెల్ వద్ద విలన్ కి షాక్ ప్లాన్ చేసిన హీరో తానే దెబ్బ తినడం అనేది మామూలు గా మింగుడు పడని విషయం. ఐతే కధనం లోని వేగం, హీరో విలన్ పాత్రల మీద ఒక అంచనా ఏర్పడి పోవడం తో తరువాత ఎం జరుగుతుంది అనే ఆసక్తి అలానే కొనసాగుతుంది. ఇక సెకండాఫ్ లో బగ్ థ్రెడ్ కి సంబందించినసన్నివేశాల్లో కూడా విలన్ డామినేట్ చేసినట్టు అనిపించినా, ఎమోషనల్ టార్గెట్ కి గురైన హీరో నిస్సహాయత ని చాలా పర్ఫెక్ట్ గా చూపించడం తో అతను తిరిగి దెబ్బ కొట్టాలి అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఫైనల్ గా అతను బగ్ ఉన్న విషయాన్ని కనిపెట్టి దాన్ని రివర్స్ లో విలన్ పై ప్రయోగించే ఎపిసోడ్, ఆ క్రమం లోనే తన ప్రేయసికి ప్రేమ ని తెలియచెప్పే సన్నివేశం అన్నీ చాలా బాగా వర్కవుట్ అయ్యాయి. ఇక క్లైమాక్స్ లో హీరో అష్ట దిగ్భందనం ఫార్ములా ని విలన్ కి వివరించే సీన్ తో సినిమాకి మరింత నిండుతనం వచ్చింది. అంతా అయిపోయింది అనుకున్న దశలో వచ్చే చిన్న ట్విస్ట్ హీరో-విలన్ థ్రెడ్ కి సరైన ముగింపు నే ఇచ్చింది. నటీనటులు: ధృవ పాత్ర కు రామ్ చరణ్ పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. పోలీస్ ఆఫీసర్ గా ఫిట్ గా ఉండటం తో పాటు నటనలో కూడా ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా నవదీప్ ప్రమాదం లో పడే దగ్గర నుంచి నీతోనే డాన్స్ సాంగ్ లీడ్ సీన్ వరకు చరణ్ ఉత్తమ నటనని కనబరిచాడు. ఇక సిద్ధార్థ్ అభిమన్యు పాత్ర లో అరవింద్ స్వామి అదరగొట్టేశాడు. అతని టెర్రిఫిక్ స్క్రీన్ ప్రెజన్స్,పెర్ఫార్మన్స్ కి హ్యాట్సాఫ్ అనాల్సిందే. రకుల్ ప్రీత్ సింగ్ ఎంతో అందంగా ఉంది, ప్రపోజల్ సీన్ లో నటన కూడా బాగానే ఉంది. నవదీప్ పరవాలేదు. పోసాని, నాజర్ లు ఆయా పాత్రలకు సరిపోయారు. రణధీర్ తదితరులు ఒకే. ఇతర సాంకేతిక వర్గం: కెమెరా/ఎడిటింగ్ వర్క్ చాలా బాగున్నాయి, రిచ్ విజువల్స్ కి తోడు హిప్ హాప్ తమిళ సంగీతం లో పాటలు బాగానే ఉన్నాయి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. హీరో,విలన్ కి సెపరేట్ గా వచ్చే థీమ్ మ్యూజిక్స్ ఆకట్టుకుంటాయి. రేటింగ్: 7/10 Quote
Peter123 Posted December 10, 2016 Report Posted December 10, 2016 he so smart kadha movie lo,,,starting lo villlian choodtaniki velthey appudu cell tho enduku shoot cheyaledu hero villian chese akramaaalu.. villian gadini smart intelligent ani chupinchi he killed 11 kids, in movie..,not justified here..overall ga tight screepnlay 3.5/5 my rating,,, Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.