Jump to content

Dedicated to Psycopk


Recommended Posts

Posted

ఇంట్లో ఎలుకలు ఉన్నాయని ఒకడు ఇల్లంటించాడట.

ఇల్లు తగలబడుతోంది.

ఆపక్కనే కదాని ఈ పక్క వాళ్ళూ, ఈ పక్కలేదు కదాని ఆ పక్క వాళ్ళూ కాసేపు అనుకున్నారు. ఎలుకల్ని చంపడానికి పాపం ఏదో చేస్తున్నాడులే అని కొంతమంది అన్నారు. ఎవ్వరూ పెద్దగా వ్యతిరేకించక పోయేటప్పటికి ఇదేదో ప్రమాదం అనుకున్న వాళ్ళు కూడా ఇంతమంది పర్వాలేదనుకుంటున్నప్పుడు మనం వ్యతిరేకిస్తే నలుగురిలో ఏకాకులమవుతామేమొ అని లొపల్లోపలే గొణుక్కున్నారు.

ఏమీ పర్వాలేదు, కొంచెం ఆగండి, 
మంటలు తొందరలోనే ఆర్పేస్తాను, ఎలుకలు కాలి చచ్చే వరకూ ఓపిక పట్టండి. నా చిత్తశుద్ధిని ఎవ్వరూ శంకించడానికి లేదు అన్నాడు.

ఇల్లు అంటించడం మంచిది కాదు అంటే 'మీరందరూ ఎలుకల్ని వెనకేసుకొస్తున్నారు' అని వాళ్ళమీద అతనూ అతన్ని సమర్ధించేవాళ్ళూ విరుచుకు పడ్డారు.

ఇన్నాళ్ళూ ఎలుకల్ని పెంచి పోషించినవాళ్ళా నాకు చెప్పేది అని గేలి చేసాడు.

నువ్వు పెత్తనం చేసినప్పుడు ఎన్ని ఎలుకల్ని పట్టావు? ఇల్లు కాల్చడాన్ని వ్యతిరేకించడానికి సిగ్గు లేదూ అని నిలదీసాడు ఒక పెద్దాయన ఇల్లంటించడం మంచిది కాదంటే.

ఇల్లు కాల్చడం వల్ల కాస్తంత ఇబ్బంది ఉన్నమాట నిజమే కాని దాని వల్ల వచ్చే ప్రయోజనాలను కూడా చూడండి. శీతాకాలం ఇలా ఇల్లు కాలుతూంటే చలి ఉండదు. ఆరుబయట ఆరొగ్యం గా ఉండడం అలవాటు అవుతుంది. అసలు మనమంతా ఆరుబయట ప్రకృతి వొడిలో నివసించడానికి అలవాటుపడాలి. గదుల్లో, ఏసీలు వేసుకుని ఉండడం వల్ల జబ్బులు వస్తున్నాయి. చెట్లకింద ఉండడం నేర్చుకోవాలి.

చెట్లకింద ఎలా ఉండచ్చో, ఇతర జాతుల వాళ్ళు చెట్లకింద ఎలా ఉంటున్నారో, మనందరం చెట్లకింద ఉండడానికి ఏరకమైన చర్యలు తీసుకోవాలో ఒక పెద్దమనిషి ఆధ్వర్యంలో ఒక జట్టుని వేసి సలహాలు ఇమ్మన్నాడు.

కాలితే వచ్చే బూడిదతో అనేకరకాల ఉపయోగాలు ఉన్నాయి. కచ్చికలతో పళ్ళు తోముకోవచ్చు. బూడిద పొలాల్లో వేసుకుంటే పంటలు ఏపుగా వస్తాయి. 
స్నానానికి ఆ మంటల్లో నీళ్ళు కాచుకోవచ్చు. చుట్టలు ముట్టించుకోడానికి అగ్గిపెట్టెలు అవసరం లేదు.
కాలుతోన్న మన ఇంట్లో దొంగలు పడరు. ఇంతటితో దొంగల ఆటకట్టు! అని ఇల్లు కాలడం వల్ల ఒనగూరే ప్రయోజనాలను కొంతమంది ఊరంతా తిరుగుతూ ప్రచారం చెయ్యడం మొదలు పెట్టారు. 
ఎలుకలతో పాటు నల్లులు, పురుగూ పుట్రా కూడా ఆనవాళ్ళు లేకుండా పోతాయి అన్నారు.

నా నిజాయితీని శంకిస్తారా? మీరు ఎలుకల పక్షమా లేక ఎలుకలకి వ్యతిరేకమా తేల్చుకోండి అన్నాడా నిప్పంటించినాయన.

ఆరుబయట బోళ్ళన్ని ఎలుకలు పరిగెడుతూ కనిపించాయి. ఇంట్లోనించి చాలా ఎలుకలు అందరి కళ్ళెదురుగా తప్పించుకుని వస్తున్నాయి. వాటిని పట్టుకోడానికి వాటి వెనకాల తరుముకుంటూ కొంతమంది కర్రలు పట్టుకుని పరిగెడుతున్నారు.

మంటలు ఎగిసి పడుతున్నాయి. ఇల్లు కాలుతూనే ఉంది. మంటలు ఆర్పడానికి నీళ్ళు లేవు. ఇవిగో వస్తున్నాయి అవిగో వస్తున్నాయి అంటున్నాడు. ఇల్లు అంటించాక నుయ్యి తవ్వడం మొదలుపెట్టారట. అదేమిటంటే ముందే తవ్వితే ఎలుకలు పసిగట్టి సర్దుకోవా అని కరవడానికొచ్చాడు.

మంటలు ఎప్పుడు ఆరతాయా, ఎప్పుడు ఇంట్లోకెడదామా అని కాలుతున్న ఇంటికేసి చూస్తూ నిలబడ్డారు. వృద్ధులు. పసి పిల్లలు. ఆ పసిపిల్లలని చంకకెత్తుకున్న తల్లులు. కాలో చెయ్యో లేనివారు. జబ్బులతో బాధపడుతున్న వారు. కదలలేని వారు. కదిలి కదిలి అలిసిపోయిన వారు. సమయానికి బయటకి రాలేక ఒళ్ళు కాలిన వారు. ఆకలికి ఆగలేని వారు. మందూ మాకూ కూడా తెచ్చుకోని వారు.

ఎలుకలు చావడం మాట దేవుడెరుగు ఇల్లే మిగలదేమో, మొత్తం బూడిదైపోతుందేమో అని మంటల్లో కాలుతున్న ఆ ఇంటికేసి బెరుకుగా చూస్తున్నారు. ఆ మంటల రంగు వెలుగులో వాళ్ళ కళ్ళల్లొ భయం లీలగా కనపడుతోంది.

--------

ఈ కధ కేవలం కల్పితం. ఏవైనా పోలికలు కనిపిస్తే అవి కేవలం యాదృచ్చికం. ఈ కధ ఆధారంగా సాగించే ఊహాగానాలకు నేనుకానీ ఈ గ్రూపు కానీ ఎలాంటి బాధ్యత వహించము 

 

🙏🙏🙏🙏

Posted
4 minutes ago, TOM_BHAAYA said:

fact samara..chekka gadiki chukkalu waiting... anduke patukunte pattucherra... phone kotu gift pattu. schemes pedutunadu.. chillar vedava... ediki undi...

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...