ticket Posted December 26, 2016 Report Posted December 26, 2016 దిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నాబార్డు తొలిదశ నిధులు అందజేయడంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తంచేశారు. జీవితంలో ఎన్ని విజయాలు సాధించినప్పటికీ.. పోలవరం వల్ల వచ్చే ఆనందం తనకు ఎంతో గొప్పదిగా నిలుస్తుందన్నారు. దిల్లీలోని ఇండియా హాబిటేట్ సెంటర్లో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే, రాష్ట్రంలో కరవు ఉండదన్నారు. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సైతం నీరు అందించే వెసులుబాటు ఉంటుందన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఏపీ ఎకానమీ, భవిష్యత్తు మారే పరిస్థితి ఈ ప్రాజెక్టుతో వస్తుందన్నారు. తన జీవితంలో ఇది మర్చిపోలేని రోజన్నారు. దీనికి కారణమైనవారందరికీ పేరుపేరున అభినందనలు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణానికి సకాలంలోనే కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం గొప్ప విషయమన్నారు. అనుకున్న సమయానికే ప్రాజెక్టును పూర్తిచేసి 2018కి గ్రావిటీలో వాటర్ ఇవ్వనున్నట్టు వెల్లడించారు. 2019 నాటికి ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రాజెక్టు పూర్తయ్యే తీరుతుందని స్పష్టంచేశారు. ఈ విషయంలో వెనుదిరిగే ప్రసక్తే లేదన్నారు. దిల్లీలో జరిగిన నాబార్డు సమావేశంలో కేంద్ర జలవనరుల శాఖమంత్రి ఉమాభారతి చేతులమీదుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.1981 కోట్లు చెక్కును అందుకున్న సంగతి తెలిసిందే. Quote
Spell_Hunter Posted December 26, 2016 Report Posted December 26, 2016 single word plz if not lyt maa Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.