kakatiya Posted December 28, 2016 Author Report Posted December 28, 2016 ఆటకట్టు పాతబస్తీలో అరాచక సామ్రాజ్యం చిన్న వయసులోనే నేరమయ జీవితం హైదరాబాద్ : ‘పదహారేళ్లకే నేరమయ జీవితంలోకి అడుగుపెట్టాడు.. దోపిడీతో అసాంఘిక కార్యకలాపాలకు శ్రీకారం చుట్టాడు. హత్యలు చేసే స్థాయికి ఎదిగాడు.. అనుచర గణంతో భూదందాలు చేస్తూ నేర సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడు.. తనను పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపైనా దాడులు చేశాడు.. 27 ఏళ్లపాటు పోలీసులకు సవాల్ విసురుతూ 72 ఘటనలకు పాల్పడ్డాడు. న్యాయస్థానంలో తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే చంపేస్తాడనే భయాన్ని సృష్టించాడు’... ఇదీ పాతబస్తీకి చెందిన రౌడీషీటర్ అయూబ్‌ఖాన్ అలియాస్ పఠాన్ నేపథ్యం. విదేశాల్లో ఉంటూ నేరాలకు పాల్పడుతున్న ఈ ఘరానా నేరగాడిని నగర పోలీసులు ఎట్టకేలకు గత ఆదివారం ముంబయిలో పట్టుకోవడంతో పాతబస్తీ ప్రాంతంలో వ్యవస్థీకృత నేరాలను చాలావరకు అడ్డుకున్నట్లయింది. అతను నేర సామ్రాజ్యాన్ని సృష్టించి విస్తరించుకున్న వైనం తెలిస్తే విస్మయం కలగక మానదు. అయూబ్‌ఖాన్ తండ్రి జహంగీర్‌ఖాన్ మాజీ సైనికుడు. జమ్మూకశ్మీర్‌తోపాటు దేశంలోని ఇతర సరిహద్దు ప్రాంతాల్లో సేవలందించి పదవీ విరమణ పొందారు. తండ్రిలోని లక్షణాలను అయూబ్‌ఖాన్ ఏవీ ఒంటబట్టించుకోలేదు. 16 ఏళ్ల ప్రాయంలోనే నేరమయ జీవితంలోకి అడుగు పెట్టాడు. 1989లో తొలిసారిగా దోపిడీతో నేర సామ్రాజ్యానికి పునాదులు వేసుకున్నాడు. మరుసటి ఏడాది హత్యలు చేసే ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు. అదే ఏడాది కామాటిపురా, హుస్సేనీ ఆలం ఠాణాల పరిధిలో మత ఘర్షణలకు పాల్పడ్డాడు. పోలీసులకు సమస్యగా మారడంతో కాలాపత్తర్ పోలీసులు ఇతడిపై రౌడీషీట్ తెరిచారు. తర్వాత ఇతను కామాటిపురాకు మారడంతో రౌడీషీట్‌ను అక్కడకు బదిలీ చేశారు. ఆ తర్వాత మరింతగా ముదిరి పోయాడు. దాదాపు 20 మంది అనుచరుల్ని పెంచి పోషిస్తూ నేరాలను కొనసాగించాడు. మారణాయుధాలతో సంచరిస్తూ పాతబస్తీ ప్రాంతంలో భయానక వాతావరణాన్ని సృష్టించాడు. 2004లో స్థిరాస్తి వ్యాపారం వూపందుకోవడంతో ఇతడి ఆగడాలు మరింత మితిమీరాయి. కరడుగట్టిన నేరగాడు సుమారు యాభై ఏళ్ల వయస్సు ఉన్న అయూబ్‌ఖాన్‌ది మూడు దశాబ్ధాల క్రితం సాధార జీవితమే. పాత నగరంలోని మిశ్రీగంజ్ కుమార్‌వాడి అతని నివాసం. తొలిరోజుల్లో ఇంటింటికి పాల ప్యాకెట్లు సరఫరా చేసేవాడు. కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటూ చిన్నచిన్న పనులు చేసేవాడు. చార్మినార్ వద్ద లాడ్‌బజార్‌లో ఫుట్‌పాత్ వ్యాపారిగానూ పని చేశాడు. బొట్టు డబ్బాల డక్కన్ (మూత)లు తయారీ పనులకు వెళ్లాడు. ఒకనొక దశలో శాలిబండలో రౌడీషీటర్ అయిన ఓ పహిల్వానుకు అనుచరుడిగా మారిపోయాడు. అక్కడ రౌడీ కార్యకలాపాల్లో ఓనమాలు దిద్దుకుని చివరకు పాత నగరాన్ని గడగడలాడించే గ్యాంగ్‌స్టార్ స్థాయికి ఎదిగాడు. అర్ధనగ్నంగా వూరేగింపు రౌడీయిజం పెరిగిపోవడంతో హుస్సేనిఆలం పోలీసులు ఇతన్ని గతంలో అర్ధనగ్నంగా వూరేగించారు. ఓ కేసులో ఇతడు చంచల్‌గూడ జైలుకు వెళ్లి బయటకు వచ్చే సమయంలో అతన్ని మరో కేసులో పోలీసులు అరెస్టు చేయకుండా ఓ రాజకీయ నాయకుడు తన వాహనంలో ఎక్కించుకుని వెళ్లాడని ప్రచారం సాగింది. ఇతన్ని అయూబ్ పహిల్వాన్, ఎలియాస్ పఠాన్ అంటూ అనుచరులు సంబోధించేవారు. కైసర్‌తో గ్యాంగ్‌వార్.. పాతబస్తీలో నేర సామ్రాజ్యాన్ని విస్తరించడానికి ప్రాధాన్యమిచ్చిన అయూబ్‌ఖాన్ తనకెదురొచ్చిన వారిని అంతమొందించేందుకు వెనుకాడలేదు. ఈ క్రమంలో మరో రౌడీషీటర్ మహ్మద్ కైసర్(39) అలియాస్ మల్లేపల్లి కైసర్ అలియాస్ ఘోరా కైసర్‌తో శత్రుత్వం ఏర్పడింది. ఓ హత్య కేసులో ముద్దాయిగా 2010లో అయూబ్‌ఖాన్ చర్లపల్లి జైళ్లొ ఉండటంతో కైసర్ ముఠా పంజా విసిరింది. పంజాగుట్ట ఠాణాలో రౌడీషీటర్‌గా ఉన్న అయూబ్‌ఖాన్ తోడల్లుడు మహ్మద్ ఫజలుద్దీన్‌ను నాంపల్లి ప్రాంతంలో దారుణంగా అంతమొందించింది. ఈ కేసులో జైలుకెళ్లిన కైసర్ నాలుగు గోడల మధ్య నుంచే అయూబ్‌ఖాన్ ప్రధాన అనుచరుడు, కాలాపత్తర్ రౌడీషీటర్ అశ్వాక్‌ఖాన్‌ను అంతమొందించేందుకు కుట్ర పన్నాడు. హుస్సేని ఆలం ఠాణా పరిధిలో ఓ కేసులో వ్యతిరేక వర్గం తరఫున వాదిస్తున్నాడనే కారణంతో న్యాయవాది మన్నన్‌ఘోరీని 2002 జులై 10న సాయంత్రం 5.45 గంటల సమయంలో మక్కా మసీదు సమీపంలో అయూబ్ ముఠా దారుణంగా నరికి చంపింది. పోలీసులపైనే దాడులు... 1992లో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు కత్తితో వారిపై దాడి చేశాడు. దీంతో పోలీసులు కాల్పులు జరపడంతో అతడి మోకాలిలోకి తూటా దూసుకు పోయింది. 2005 ఫిబ్రవరిలో ఓ కేసులో బెయిల్‌పై బయటికి వచ్చిన అయూబ్‌ఖాన్ కోర్టు వాయిదాలకు హాజరు కాకపోవడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు అతడి కోసం వేట మొదలు పెట్టారు. ఈక్రమంలో 2007 జనవరి 19న శాలిబండ ఠాణా సమీపంలో తనను పట్టుకునేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్‌పై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. 2002లో న్యాయవాది మన్నన్ ఘోరీ హత్య కేసులో మూడేళ్లపాటు జైళ్లొనే ఉండిపోయాడు. ఈ కేసులో 2005 ఫిబ్రవరి 25న బెయిల్‌పై విడుదలయ్యాడు. ఇదేక్రమంలో రెయిన్ బజార్‌కు చెందిన రఫీక్‌బిన్ షిమ్లాన్‌తోపాటు గౌసుద్దీన్ జంట హత్యలకు పాల్పడి 2008లో మరోసారి జైలుకెళ్లాడు. 2010లో జైళ్లొ ఉండగానే మన్నన్ హత్య కేసు తీర్పు వెలువడింది. అయూబ్‌ఖాన్‌తోపాటు అతడి అనుచరులు హబీబ్ ఖురేషీ, మునవర్, రుస్తుంకు జీవిత ఖైదు పడింది. ఈక్రమంలో అయూబ్‌ఖాన్ తొలుత మూడేళ్లపాటు చర్లపల్లి కేంద్ర కారాగారంల శిక్ష అనుభవించాడు. ఈ తీర్పుపై హైకోర్టులో అప్పీలు చేయడంతో సాంకేతిక కారణాలతో 2014 ఏప్రిల్ 11న విముక్తి లభించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం దీనిపై అప్పీలుకు వెళ్లడం.. కరడుగట్టిన రౌడీషీటర్లపై హైదరాబాద్ పోలీసులు పీడీ చట్టం ప్రయోగిస్తుండటం.. శత్రువుల నుంచి ప్రాణహాని ఉండటంతో అదే ఏడాది ఆగస్టులో దుబాయ్ పారిపోయాడు. వైద్య పరీక్షలు, గట్టి భద్రత ఉస్మానియా ఆస్పత్రి, చంచల్‌గూడ: కరుడు కట్టిన నేరస్థుడు కావడం... చాలాకాలం తరువాత పోలీసులకు చిక్కడంతో జైల్లో అతనికి గట్టి భద్రత కల్పించినట్లు జైలు పర్యవేక్షణాధికారి సైదయ్య తెలిపారు. గతంలో చాలాసార్లు అతను చంచల్‌గూడ జైల్లోనే రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అయ్యూబ్‌ఖాన్‌కు ఉస్మానియా ఆసుపత్రికి చెందిన వైద్యనిపుణుల బృందం వైద్య పరీక్షలు నిర్వహించింది. పలు నకిలీ పాస్‌పోర్టులు పోలీసుల కళ్లు కప్పేందుకు అయూబ్‌ఖాన్ నకిలీ పాస్‌పోర్టులను సంపాదించాడు. తొలుత 1997లో నవీద్ అహ్మద్ పేరిట హబీబ్‌నగర్ బజర్‌ఘాట్ చిరునామాతో పాస్‌పోర్టు(ఎ3604969) పొందాడు. ఖలీద్‌పాషా పేరుతో రెండోసారి పాస్‌పోర్టు పొందాడు. కామాటిపురా ఠాణా పరిధిలోని ఓ బందిపోటు దొంగతనం కేసులో నాంపల్లి మూడో మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టులో పోలీసులు దీన్ని డిపాజిట్ చేశారు. మూడోసారి 2010 సెప్టెంబరు 22న అయూబ్‌ఖాన్ పేరుతో పాస్‌పోర్టు(జె-1225657) పొందాడు. ఈసారి గోల్కొండ బడాబజార్ చిరునామాతో దీన్ని పొందాడు. 2014 ఆగస్టులో అయూబ్‌ఖాన్ హైదరాబాద్ నుంచి విజిటింగ్ వీసాపై దుబాయ్ పారిపోయాడు. సౌదీ జాతీయురాలైన సమీప బంధువు సహకారంతో అక్కడే మూడేళ్ల కాలపరిమితితో బిజినెస్ వీసా పొందాడు. అలాగే షార్జాలోని భారత హైకమిషన్ కార్యాలయం నుంచి 2015 ఆగస్టు 31న డూప్లికేట్ పాస్‌పోర్టు(ఎన్-1424311) పొందాడు. దీనికి 2017 ఆగస్టు 30 వరకు గడువు ఉంది. ముఠాల్లో కీలకం వీరే.. అయూబ్‌ఖాన్ గ్యాంగ్: అశ్వాక్, మేరాజ్, రుస్తుం, గౌస్, బాబా స్టిక్, ఒబేద్, హబీబ్ ఖురేషీ, అసద్ మహ్మద్ కైసర్ గ్యాంగ్: ఇబ్రహీం, మహ్మద్ బిన్ అబ్దుల్లా అలియాస్ ఛావూస్, యూసుఫ్ మాము, బోరబండ ఫెరోజ్, వహీద్, బేగంబజార్ షాబాజ్, సయ్యద్ మాజిద్, తబ్రేజ్ ఖాన్(ప్రస్తుతం ఈ రెండు ముఠాల్లోని పలువురు పీడీ చట్టం కింద జైళ్లలో ఉన్నారు Quote
perugu_vada Posted December 28, 2016 Report Posted December 28, 2016 Lepeyali ilantollani calm ga penchi poshinchatam waste , political influence baga untundi vella ki, so edho oka rakam ga bayata ki ochestaru ala odilesthe, entha interrrogate chesina badaa politicians names elago bayata ki ravu, Quote
kakatiya Posted December 28, 2016 Author Report Posted December 28, 2016 14 hours ago, perugu_vada said: Lepeyali ilantollani calm ga penchi poshinchatam waste , political influence baga untundi vella ki, so edho oka rakam ga bayata ki ochestaru ala odilesthe, entha interrrogate chesina badaa politicians names elago bayata ki ravu, police tried best to keep him behind bars, but some old city politician pulled him out of jail and offered him contracts. Quote
yomama Posted December 28, 2016 Report Posted December 28, 2016 2 minutes ago, kakatiya said: police tried best to keep him behind bars, but some old city politician pulled him out of jail and offered him contracts. peaceful old city people practicing democracy, nothing wrong here Quote
Quickgun_murugan Posted December 28, 2016 Report Posted December 28, 2016 14 hours ago, perugu_vada said: Lepeyali ilantollani calm ga penchi poshinchatam waste , political influence baga untundi vella ki, so edho oka rakam ga bayata ki ochestaru ala odilesthe, entha interrrogate chesina badaa politicians names elago bayata ki ravu, India lo paisalu sampadinchatam full easy... go back and make more there .. don't struggle here.. if you feel so Quote
Quickgun_murugan Posted December 28, 2016 Report Posted December 28, 2016 8 minutes ago, yomama said: peaceful old city people practicing democracy, nothing wrong here Old city antha mini eyeSiS country uncle.. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.