sri_india Posted December 30, 2016 Report Posted December 30, 2016 new year is delayed by 1 sec this bro .... so don't jump for celebrations too early bros wait for another sec to complete ఓ సెకను ఆలస్యం కావడం ఏంటి...? అని ఆలోచిస్తున్నారా...? అవునండి. 2016 అర్ధరాత్రి 11.59 నిమిషాల 59 సెకన్ల తర్వాతి సెకనులో కొత్త సంవత్సరం ప్రారంభం కాదు. మరో సెకను ఆగాల్సిందే. ఎందుకంటే ఈ ఏడాదికి సంబంధించి గడియారంలో ‘కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైమ్’ కు ఓ సెకను అదనంగా కలుపుతున్నారు. దీన్నే లీపు సెకను అంటారు. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన నేవల్ అబ్జర్వేటరీ తెలిపింది.భూమి, ఇతర గ్రహాల గమనం ఆధారంగా కాల గమనం ఆధారపడి ఉంటుందన్న విషయం తెలిసిందే. భూమి సగటున ఆటోమిక్ టైమ్ తో పోలిస్తే ప్రతీ రోజూ 1.5 నుంచి 2 మిల్లీ సెకన్లు నిదానంగా తిరుగుతుంది. ఇలా ప్రతి 500 నుంచి 750 రోజులకు భూమి చలన సమయం, ఆటోమిక్ టైమ్ తో పోలిస్తే ఒక సెకను పాటు ఆలస్యంగా ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అందుకే దాన్ని సరిచేసేందుకు ఇలా కలుపుతుంటారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.