Jump to content

Recommended Posts

Posted
17brk123a.jpg

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎన్నో విలక్షణ పాత్రలతో గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నారు లోకనాయకుడు కమల్‌హాసన్‌. నిరంతరం కొత్తదనం కోసం పరితపించే ఆయన దాదాపు రెండు దశాబ్దాల క్రితమే తన కలల చిత్రమైన ఓ భారీ సినిమాకు శ్రీకారం చుట్టి కొన్ని అనివార్య కారణాల వల్ల దాన్ని మధ్యలోనే ఆపేశారు. 1997లో క్వీన్‌ ఎలిజ‌బెత్‌-2 చేతుల మీదుగా ప్రారంభమైన ఆ సినిమానే ‘మరుదనాయగం’. కమల్‌ స్వీయ దర్శకత్వంలో ప్రారంభమైన ఆ సినిమా మధ్యలో ఆగిపోయాక ఎన్నోసార్లు తిరిగి ప్రారంభిస్తారని వార్తలు వచ్చినా అవి కార్యరూపం దాల్చలేదు. తాజాగా కమల్‌హాసన్‌ ఈ సినిమా అంశంపై లైకా ప్రొడక్షన్స్‌ అధినేత సుభాష్‌కరణ్‌ను లండన్‌లో కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో అటకెక్కిన ఈ సినిమా మళ్లీ పట్టాలెక్కొచ్చని తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్స్‌ ప్రస్తుతం రజనీకాంత్‌-శంకర్‌ల ‘2.0’ను నిర్మిస్తోంది.. మరోవైపు కమల్‌హాసన్‌ ‘శభాష్‌నాయుడు’తో బిజీగా ఉన్నారు. దీంతో వీరిద్దరూ తమ ప్రాజెక్టులు పూర్తయ్యాక ‘మరుదనాయగం’పై దృష్టిసారిస్తారని అంటున్నారు.

17brk123b.jpg
 
bl@st 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...