IamRPG Posted January 6, 2017 Report Posted January 6, 2017 ప్యాసెంజర్స్(ఇంగ్లిష్) నటీనటులు: క్రిస్ ప్రాట్.. జెన్నిఫర్ లారెన్స్.. లారెన్స్ ఫిష్‌బర్న్ కథ: జాన్ స్పైట్స్ సినిమాటోగ్రఫీ: రొడ్రిగో ప్రిటో దర్శకత్వం: మోర్టిన్ టిల్‌డమ్ సంగీతం: థామస్ న్యూమన్ నిర్మాతలు: నీల్ హెచ్. మారిట్జ్.. స్టీఫెన్ హమిల్ విడుదల తేదీ: 6-1-2017 సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఇప్పటివరకు హాలీవుడ్‌లో చాలా సినిమాలే వచ్చాయి. వాటిల్లో చాలావరకు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు సరికొత్త కథతో.. సాహసభరితమైన ప్రేమకథా చిత్రంగా ‘ప్యాసెంజర్స్’ తెరకెక్కింది. ‘జురాసిక్ వరల్డ్’.. ‘గార్డియన్ ఆఫ్ గెలాక్సీ’ చిత్రాల నటుడు క్రిస్ ప్రాట్.. ‘ఎక్స్‌మెన్’ సిరీస్ నటి జెన్నిఫర్ లారెన్స్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మోర్టిన్ టిల్‌డమ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే పలు దేశాల్లో విడుదలైన ఈ చిత్రం అక్కడ మంచి కలెక్షన్లనే రాబట్టింది. మరి శుక్రవారం భారత్‌లో విడుదలైన ఈ చిత్రాన్ని చూస్తే.. కథేంటి?: హోమ్‌స్టెడ్-2 అనే ఓ కొత్త గ్రహంపై నివసించేందుకు ఐదు వేల మంది ప్రయాణికులు ఓ అంతరిక్ష నౌక ఎక్కుతారు. ఆ గ్రహాన్ని చేరుకోవాలంటే 120 ఏళ్లు పడుతుంది. ఈలోపు వారి జీవితకాలం ముగిసిపోకుండా అందరినీ ప్రత్యేక పరికరాల సాయంతో నిద్రావస్థలో ఉంచుతారు. సాంకేతిక సమస్యలు తలెత్తి జిమ్ ప్రెట్‌సన్(క్రిస్ ప్రాట్) అనే మెకానికల్ ఇంజినీరుకు 90 ఏళ్ల ముందే మెలుకువ వస్తుంది. ఏడాది పాటు ఒంటరిగా గడిపిన జిమ్ తోడు కోసం అరోరా లేన్(జెన్నిఫర్ లారెన్స్) అనే అందమైన అమ్మాయిని నిద్ర నుంచి మేల్కొనేలా చేస్తాడు. సాంకేతిక సమస్యలతోనే అరోరాకు మెలకువ వచ్చిందని నమ్మిస్తాడు. చేసేదేమీ లేక ఆ నౌకలో తన అనుభవాలను పుస్తకంగా రాయడం మొదలు పెడుతుంది అరోరా. ఈ క్రమంలో జిమ్.. అరోరా ప్రేమలో పడతారు. అయితే జిమ్ కావాలనే తనను మేల్కొలిపాడని అరోరాకు తెలియడంతో అతనిపై ద్వేషం పెంచుకుంటుంది. ఆ తర్వాత నౌకకు కొన్ని సమస్యలు తలెత్తి వారు ప్రమాదంలో పడతారు. అప్పుడు వారేం చేశారన్నది తెరపై చూడాల్సిందే. ఎలా ఉందంటే..: సైన్స్ ఫిక్షన్.. అంతరిక్షం నేపథ్యంలో హాలీవుడ్‌లో చాలా సినిమాలే వచ్చాయి. వాటన్నింటితో పోల్చితే ఈ కథాంశం కొత్తగా అనిపిస్తుంది. కథకు తగ్గట్టుగా పటిష్ఠమైన కథనంతో సినిమాని తెరకెక్కించాడు దర్శకుడు. సాంకేతిక సమస్య తలెత్తి జిమ్ నిద్రలోంచి మేల్కొనడం.. అంత పెద్ద నౌకలో ఒంటరితనం భరించలేక తోడు కోసం అరోరాని లేపడం.. వాళ్ల మధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తిని కలిగిస్తాయి. జిమ్.. అరోరా మధ్య వచ్చే సన్నివేశాలు.. ముఖ్యంగా అంతరిక్ష వీధుల్లో వీళ్లిద్దరూ విహరించడం లాంటి సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. కాకపోతే సినిమా ప్రారంభమైన చాలాసేపటి వరకు ప్రధాన సమస్యను ప్రస్తావించకుండా హీరోహీరోయిన్ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలతోనే సినిమాని నడిపించాడు దర్శకుడు. ఎప్పుడైతే అంతరిక్ష నౌకలో సాంకేతిక సమస్యలు ఏర్పడతాయో అప్పట్నుంచి కథలో వేగం పెరుగుతుంది. నౌకలో తలెత్తిన సమస్యను సరిచేసే క్రమంలో వచ్చే సన్నివేశాలు ఉత్కంఠ కలిగిస్తాయి. స్క్రీన్‌ప్లే.. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బావుంది. గ్రాఫిక్స్ ఆకట్టుకుంటాయి. కొన్ని డైలాగులు సిల్లీగా అనిపిస్తాయి. ఒకటి రెండు సీన్లు మినహా అంతరిక్షం గురించి ఎక్కడా చూపించరు. దీంతో స్పేస్ నేపథ్యంలో సాగే సినిమా అని అంచనాలు పెట్టుకొని సినిమాకి వెళ్తే మాత్రం ప్రేక్షకులకు నిరాశ తప్పదు. క్రిస్‌ప్రాట్ నటన బావుంది. ముఖ్యంగా నౌకలో ఒంటరితనంతో బాధపడే వ్యక్తిగా తొలి పదినిమిషాల్లో క్రిస్ నటన ఆకట్టుకుంటుంది. జెన్నిఫర్ లారెన్స్ అందంగా కనిపించింది. క్రిస్.. జెన్నిఫర్‌ల కెమిస్ట్రీ కొత్తగా అనిపిస్తుంది. సాంకేతిక సమస్యలు తలెత్తిన నౌకలో క్రిస్.. జెన్నిఫర్‌లకు సాయపడే చీఫ్ డెక్ ఆఫీసర్ పాత్రలో లారెన్స్ ఫిష్‌బొర్న్ ఒదిగిపోయాడు. బలాలు + కథ + నటీనటులు బలహీనతలు - డైలాగులు చివరగా.. thokka laa అనిపించే ‘ప్యాసెంజర్స్’ Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.