JANASENA Posted January 10, 2017 Report Posted January 10, 2017 ఒంటరిగా ఉండాలంటే ఎవరికైనా ఇబ్బందే. కొంత సమయం ఎలాగోలా గడిపేసినా.. మాట్లాడుకోవడానికి మరో వ్యక్తి లేకపోతే చాలా బాధగా ఉంటుంది. ఎముకలు కొరికే చలిలో.. ఏ క్షణం ఏమవుతుందో తెలియని భయానక వాతావరణంలో ఒంటరిగా ఉంటే ఇక అంతే సంగతులు. దాదాపు పిచ్చెక్కినంత పని అవుతుంది. కానీ.. ఓ వ్యక్తి మంచు పర్వతంపై.. దెయ్యాల వూరుగా చెప్పుకునే ప్రాంతంలో గత 40ఏళ్లుగా జీవిస్తున్నాడు. మాట్లాడుకోవడానికి మరో వ్యక్తి లేక అక్కడ ప్రకృతిని వీడియో తీయడం అలవాటు చేసుకున్నాడు. ఇప్పుడు అతని ఒంటరి జీవితం.. అతను తీసిన వీడియోలు.. గ్లోబల్ వార్మింగ్ పరిస్థితులను అద్దం పడుతూ చేస్తున్న పరిశోధనలకు ఉపయోగకరంగా మారింది. న్యూజెర్సీకి చెందిన 60ఏళ్ల బిల్లీ బర్ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ చదివాడు. 1972లో వాటర్ కెమిస్ట్రీ పరిశోధన నిమిత్తం రాకీ మంచు పర్వత ప్రాంతం కొలరొడోలోని గొతిక్ పట్టణానికి వెళ్లాడు. 1920 నాటి నుంచి ఆ పట్టణంలో జనసంచారం లేదు. దీంతో దానికి దెయ్యాల వూరు అన్న పేరొచ్చింది. అక్కడే బిల్లీ బృందం పరిశోధనలు చేసి తిరిగి వెళ్లిపోయింది. కానీ.. బిల్లీకి ఆ గొతిక్ పట్టణం బాగా నచ్చింది. ఆ పట్టణంలోనే ఒంటరిగా జీవించాలని నిర్ణయించుకున్నాడు. దీంతో మూటముల్లె సర్దుకొని గొతిక్ చేరుకున్నాడు. దట్టమైన మంచు కురిసే ఆ ప్రాంతంలో చిన్న టెంట్ ఏర్పాటు చేసుకున్నాడు. కానీ.. ఆ చలిలో కొన్ని గంటలు ఉన్నా మృత్యువాతపడటం ఖాయం. అయితే.. ఆ పట్టణంలో భవనం కలిగిన ఓ వ్యక్తి బిల్లీని అందులో ఉండమన్నాడు. దీంతో ఆ ఇంట్లోనే కొన్నేళ్లపాటు నివసించాడు. సమీపంలోని పట్టణంలో కావాల్సిన సరుకులను తెచ్చుకుంటున్నాడు. అవసరమైతే తప్ప ఇతరులతో మాట్లాడడు. ఒంటరిగా ఉండటం వల్ల బోర్ కొట్టి.. కెమెరాతో అక్కడి అందాల్ని.. ప్రకృతిలో జరుగుతున్న మార్పులు వీడియో తీయడం మొదలుపెట్టాడు. ఎంత దట్టంగా మంచు కురుస్తోంది. ఉష్ణోగ్రత.. మంచు సాంద్రత.. ఇలా ప్రకృతిలోని ప్రతీ విషయాన్ని 40ఏళ్లుగా వీడియో తీస్తూ వస్తున్నాడు. అయితే బిల్లీ తీసిన వీడియో ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్ పరిశోధనలకు ఎంతో ఉపయోగకరంగా మారింది. మొదట్లో తాను ఏ ఉద్దేశం లేకుండానే వీడియోలు తీసినా.. . అవి ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ పరిస్థితులకు అద్దం పడుతున్నాయని బిల్లీ అంటున్నాడు. Quote
JANASENA Posted January 10, 2017 Author Report Posted January 10, 2017 5 minutes ago, shamsher_007 said: Goppodu vayya +1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.