Power Star Posted January 10, 2017 Report Posted January 10, 2017 ఖైదీ నంబర్ 150.. మరికొన్ని గంటల్లోనే థియేటర్లలో మెగా హంగామా చేయడానికి సిద్ధమైపోయింది. ఇప్పుడు మెగా ఫ్యాన్స్.. ట్రేడ్ పండిట్స్ నుంచి.. తెలుగు ఆడియన్స్ అందరి దృష్టి ఒక్క పాయింట్ పైనే కేంద్రీకృతమైంది. అందరూ ఆలోచించేది మెగాస్టార్ మొదటిరోజున ఎన్ని రికార్డులు సృష్టించబోతున్నారన్నదే! ఏపీ.. తెలంగాణ రాష్ట్రాల్లో మెగాస్టార్ చిరంజీవి ఎంత షేర్ రాబట్టబోతున్నారు? ఇండస్ట్రీ రికార్డులన్నీ బద్దలైపోతాయా? 9 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న చిరు.. తన స్టామినా ఎలా ప్రూవ్ చేసుకోబోతున్నారు? అంటూ చాలానే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటివరకూ తొలిరోజు ఏపీ-నైజాం మార్కెట్లలో తొలిరోజు షేర్ వసూళ్ల రికార్డు బాహుబలి పేరిట ఉంది. 22.4 కోట్ల షేర్ వసూలు చేసి టాప్ ప్లేస్ లో నిలిచింది. అయితే.. ఖైదీ నంబర్ 150 ఈ మార్కును తేలిగ్గానే అధిగమించేస్తుందని అంటున్నారు ట్రేడ్ జనాలు.ఇందుకు కారణం.. అన్ని ఏరియాల్లోను ఇప్పటికే ఫుల్ క్రేజ్ తో హౌస్ ఫుల్స్ పడిపోవడమే. కానీ బాహుబలి మార్క్ అందుకోవడం అంత తేలికేం కాదు. ఎందుకంటే రెగ్యులర్ షోస్ పాటు అదనంగా వేసే షోస్.. హైర్స్.. అన్నిటినీ కౌంట్ చేయాల్సి ఉటుంది. నైజాంతో పాటు.. ఉత్తరాంధ్ర.. ఈస్ట్.. వెస్ట్.. కృష్ణా.. నెల్లూరు.. సీడెడ్.. ఇలా అన్ని ఏరియాల నుంచి అందుతున్న రిపోర్టుల ప్రకారం.. ఖైదీ నంబర్ 150 తొలిరోజున ఖచ్చితంగా 25-28 కోట్ల షేర్ ను కేవలం ఏపీ నుంచే రాబట్టే అవకాశాలున్నాయట. మరి చిరు ఆ మార్క్ అందుకుంటే మాత్రం.. కొత్త హిస్టరీ రాసేసినట్లే. Quote
lazybugger Posted January 10, 2017 Report Posted January 10, 2017 All the best. Jai Chiru! I'm newly minted chiru fan. Quote
Power Star Posted January 10, 2017 Author Report Posted January 10, 2017 ఖైదీ నంబర్ 150 తొలి రోజున హైదరాబాద్ మల్టీప్లెక్సుల్లో నాలుగు వందల ఇరవై ఏడు సార్లు ప్రదర్శితం కానుంది. బాహుబలి చిత్రానికి తొలి రోజున 380 పైచిలుకు షోలు వేస్తే, 'ఖైదీ నంబర్ 150'కి 427 షోస్ పెట్టారు. ఈ సంఖ్య మరికాస్త పెరిగే అవకాశం కూడా వుంది. మామూలుగా శుక్రవారం నాడు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి కనుక బుధ, గురువారాల్లో విడుదలయ్యే చిత్రాలకి షోస్ కేటాయించడానికి మల్టీప్లెక్స్ ఛెయిన్‌లు ఇబ్బంది పడుతుంటాయి. కానీ బుధవారం విడుదలవుతున్న 'ఖైదీ నంబర్ 150'కి మాత్రం అలాంటి ఇబ్బందులేం ఎదురు కాలేదు. ఒకటీ, అరా షోలు దంగల్‌కి కేటాయించి దాదాపుగా మిగిలిన అన్ని షోస్ ఈ చిత్రానికే ఇచ్చేసారు. రెండవ రోజు నుంచీ 'గౌతమిపుత్ర శాతకర్ణి'తో షోస్ షేర్ చేసుకోవాలి కనుక మాగ్జిమమ్ షోస్ వస్తే బాగుండని ఫాన్స్ కోరుకున్నారు. టికెట్ల కోసం క్రేజ్ కూడా ఓ రేంజ్‌లో వుండడంతో షోస్ పెంచే విషయంలో మల్టీప్లెక్స్‌లు అభ్యంతరాలు పెట్టలేదు. ప్రైమ్ లొకేషన్లలో అయితే టికెట్లు ఓపెన్ అయిన నిమిషాల్లో సేల్ అయిపోయాయి. మొదటి రోజు నంబర్ అనూహ్యంగా వుంటుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. చిరంజీవికి ఈ స్థాయి స్వాగతాన్ని తాము కూడా ఊహించలేదని అభిమానులు ఉప్పొంగిపోతున్నారు. ఏపీ, తెలంగాణలో తొలి రోజు రికార్డు రావడం ఖాయమని చెబుతున్నారు. కాకపోతే ఓవర్సీస్‌లో బాహుబలిని అందుకోవడం కష్టమవుతుంది. Quote
rrc_2015 Posted January 10, 2017 Report Posted January 10, 2017 Just now, lazybugger said: All the best. Jai Chiru! I'm newly minted chiru fan. new minted ayithe ... cold water shower cheyy Quote
RahuI_PG Posted January 10, 2017 Report Posted January 10, 2017 Just now, rrc_2015 said: new minted ayithe ... cold water shower cheyy + onion juice taaguuuu Quote
Power Star Posted January 10, 2017 Author Report Posted January 10, 2017 2 hours ago, lazybugger said: All the best. Jai Chiru! I'm newly minted chiru fan. K Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.