billupally_raja Posted January 13, 2017 Report Posted January 13, 2017 చిరంజీవి కథానాయకుడిగా టైటిల్ రోల్ పోషించిన ‘ఖైదీ నంబర్ 150’ చిత్రం తొలి రోజు వసూళ్లపరంగా టాలీవుడ్‌లో సరికొత్త రికార్డును సృష్టించిందని గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ చెప్పారు. వి.వి. వినాయక్ దర్శకత్వంలో తొలిసారిగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్ నిర్మించిన ఈ చిత్రం బుధవారం విడుదలైన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా రూ. 47.07 కోట్లను వసూలుచేసి తొలి రోజు వసూళ్లలో టాలీవుడ్‌లో హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచిందని అరవింద్ తెలిపారు. గురువారం సాయంత్రం నిర్మాణ సంస్థ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘‘సుమారు పదేళ్ల తర్వాత చిరంజీవిగారు చేసిన సినిమా కావడంతో థియేటర్ల వద్ద పెద్ద కోలాహలంతో సంక్రాంతి మూడు రోజుల ముందే వచ్చిందా అన్న పరిస్థితి ఏర్పడింది. వినాయక్ నన్ను క్షమించాలి. కథ కంటే ‘ఇనేళ్ల విరామానంతరం చిరంజీవి ఎలా ఉన్నారు? ఎలా చేశారు?’ అనే ఆసక్తితోనే థియేటర్లకు ప్రేక్షకులు ఉధృతంగా వస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 30 కోట్ల 45 వేలు, కర్ణాటకలో 4.70 కోట్లు, ఒరిస్సాలో రూ. 12 లక్షలు, తమిళనాడులో రూ. 20 లక్షలు, దేశంలోని మిగతా ప్రాంతాల్లో రూ. 58 లక్షలు, యు.ఎస్.ఎ.లో 1.22 మిలియన డాలర్లు (8.9 కోట్లు), మిగిలిన దేశాల్లో 320 వేల డాలర్లు (2.12 కోట్లు) వసూలు చేసింది. సుమారు రెండు వేల థియేటర్ల నుంచి ఈ వసూళ్లు వచ్చాయి. తెలుగు సినిమా పరిధి పెరుగుతోందనేందుకు ఈ వసూళ్లే నిదర్శనం. చిరంజీవిగారి సత్తామేరకు వసూళ్లు గ్రాండ్‌గా ఉంటాయని అంచనా వేస్తున్నాం. ఆయన 151వ సినిమా కూడా కొణిదెల ప్రొడక్షన్ పైనే ఉంటుంది. 152వ సినిమా మా గీతా ఆర్ట్స్‌లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఉంటుంది’’ అని వివరించారు. Quote
KABALI Posted January 13, 2017 Report Posted January 13, 2017 151 world wide hit.. 152 Universe HiT... Anniya okadey caste peeling lenodu..anniya okadikey dances ochu... anniya vargham okkarey vishaala hrudayulu... Quote
sanbk Posted January 13, 2017 Report Posted January 13, 2017 konidela lo only konidela valle chesukuntaru emo.. cherry babu next movie kuda konidela productions anta Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.