JANASENA Posted January 16, 2017 Report Posted January 16, 2017 హైదరాబాద్: పుణె వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 351 పరుగుల కొండంత లక్ష్యాన్ని టీమిండియా ఉఫ్‌మని వూదేసిన సంగతి తెలిసిందే. 63 పరుగులకే 4 వికెట్లు నష్టపోయి కష్టాల్లో పడ్డ జట్టును సారథి విరాట్‌కోహ్లి (122; 105 బంతుల్లో 8×4, 5×6), స్థానిక కుర్రాడు కేదార్ జాదవ్ (120; 76 బంతుల్లో 12×4, 4×6) అద్భుత శతకాలతో ఆదుకొన్నారు. వీరిద్దరి ఆటపై ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పది రెట్లు పన్ను వసూలు! భారత్ ఆదివారం మ్యాచ్ గెలవగానే ట్విట్టర్ వీరుడు వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో చమక్కులు వదిలాడు. ‘పది రెట్లు పన్ను వసూలైంది.. హహ్హహ్హహ్హ! (దస్ గుణా లగాన్ వసూల్!)’ అని ట్వీట్ చేశాడు. ‘2017లో తొలి విజయం. శభాష్ టీమిండియా. ఈ ఏడాదికి అద్భుతమైన స్వాగతం. ఇలాగే గెలుస్తుండండి. కోహ్లి, జాదవ్ అత్యంత తెలివిగా మ్యాచ్ గమనాన్ని మార్చేశారు’ అని సచిన్, కోచ్ అనిల్ కుంబ్లే అన్నారు. ప్రముఖ క్రికెటర్ మైకేల్ వాన్ ‘విరాట్ కోహ్లి ఇతర గ్రహాల నుంచి వచ్చాడు! అత్యుత్తమ టెస్టు ఆటగాడు కోహ్లి, అత్యుత్తమ వన్డే ఆటగాడు కోహ్లి, అత్యుత్తమ టీ20 ఆటగాడు కోహ్లి. 11 బంతులు మిగిలుండగానే 350 ఛేదించడం గొప్ప క్రికెట్’ అని ట్వీట్ చేశాడు. క్రికెట్‌లో రొనాల్డో! భారీ స్కోరు 350 పరుగులు చేసి మ్యాచ్ ఓడిపోయినప్పటికీ ఇంగ్లాండ్ ఆటగాళ్లు కోహ్లి, కేదార్ జాదవ్‌ను ప్రశంసించకుండా ఉండలేకపోయారు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసర్ హుస్సేన్ కోహ్లిని క్రికెట్‌లో క్రిస్టియానో రొనాల్డోతో పోల్చాడు. ‘వీడియో ఆన్ డిమాండ్’ యుగంలో కోహ్లి డిమాండ్‌పై శతకాలు సాధిస్తున్నాడని క్రికెటర్ మహ్మద్ కైఫ్ కితాబిచ్చాడు. వీరితో పాటు సంజయ్ మంజ్రేకర్, వీవీఎస్ లక్ష్మణ్, అమితాబ్ బచ్చన్, బొమన్ ఇరానీ, ఆకాశ్ చోప్రా, ఇర్ఫాన్ పఠాన్ తదితరులు కోహ్లి, జాదవ్‌ను అభినందనల్లో ముంచెత్తారు. Quote
kiraak_poradu Posted January 16, 2017 Report Posted January 16, 2017 Odi pothe 10gutharu atla kadu gitla ani LT Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.