sri_india Posted January 17, 2017 Report Posted January 17, 2017 ఈనాడు, హైదరాబాద్: అభివృద్ధి పథంలో జోరుగా దూసుకెళుతున్న హైదరాబాద్ నగర కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ప్రపంచంలోనే అత్యంత ప్రగతిశీల (డైనమిక్) నగరాల్లో ఐదో స్థానాన్ని భాగ్య నగరం దక్కించుకుంది. బెంగళూరుకు మొదటి స్థానం లభించింది. ప్రపంచ ఆర్థిక సేవల సంస్థ జేఎల్ఎల్.. సిటీ మొమెంటమ్ ఇండెక్స్ (సీఎంఐ) పేరిట ఈ జాబితాను రూపొందించింది. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశంలో ఈ జాబితాపై చర్చ జరిగింది. మొదటి 30 నగరాల్లో పుణె (13వ స్థానం), చెన్నై (17వ స్థానం), దిల్లీ (23వ స్థానం) ముంబయి (25వ స్థానం) లభించింది. మొత్తం మీద మొదటి 30 ప్రగతిశీల నగరాల్లో భారత్కు చెందిన ఆరు నగరాలు చోటుదక్కించుకొన్నాయి. తద్వారా చైనా (ఐదు నగరాలు) కన్నా మెరుగైన పనితీరును కనబరిచాయి. ఈ అత్యుత్తమ నగరాలు చాలా మెరుగ్గా నెట్వర్క్ అవుతున్నాయని నివేదిక పేర్కొంది. సంబంధిత దేశాల ఆర్థిక వ్యవస్థ కన్నా మెరుగైన పనితీరును ప్రదర్శిస్తున్నాయని వివరించింది. రాజకీయ, ఆర్థిక గందరగోళాలు ఉన్నప్పటికీ అనేక నగరాలు అద్భుత ప్రగతిశీలతను కనబరుస్తున్నాయని పేర్కొంది. ప్రపంచ మార్పులకు అనుగుణంగా వేగంగా సర్దుబాట్లు చేసుకోవడం, చురుగ్గా ఉండటం వంటి కారణాలు ఇందుకు దోహదపడ్డాయని తెలిపింది. 42 అంశాల ప్రాతిపదికన 134 నగరాలపై పరిశీలన జరిపి ఈ నివేదికను తయారుచేశారు. మొత్తం మూడు రంగాలుగా ఈ అంశాలను వర్గీకరించారు. ఇందులో మొదటి ఆర్థిక అంశాలు. దీనికింద స్థూల జాతీయోత్పత్తి, జనాభా, విమాన ప్రయాణికులు, కార్పొరేట్ ప్రధాన కార్యాలయాలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పరిగణనలోకి తీసుకున్నారు. ర్యాంకింగ్లో ఈ అంశానికి 40 శాతం ప్రాధాన్యత ఇచ్చారు. ఇక రెండో అంశం.. వాణిజ్య స్థిరాస్తి పురోగతికి సంబంధించింది. ఇందులో నిర్మాణాలు, అద్దెలు, పెట్టుబడులు, కార్యాలయాల్లో పారదర్శకత, చిల్లర, హోటల్ రంగాలను పరిశీలించారు. ఈ అంశానికి 30 శాతం ప్రాధాన్యత ఇచ్చారు. మూడో అంశం నూతన ఆవిష్కరణ సామర్థ్యం, సాంకేతిక సత్తా, విద్య లభ్యత, పర్యావరణ నాణ్యతలను పరిగణనలోకి తీసుకున్నారు. అంకుర పరిశ్రమలు, పేటెంట్ దరఖాస్తులకు ప్రోత్సహించే వ్యాపార విధానాలనూ పరిశీలించారు. ఈ రంగానికి 30 శాతం ప్రాధాన్యమిచ్చారు. Quote
cheenu Posted January 17, 2017 Report Posted January 17, 2017 Silicon Valley ni kuda city ga chesara Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.