sri_india Posted January 22, 2017 Author Report Posted January 22, 2017 కొమరాడ: విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు రైల్వేస్టేషన్ వద్ద ఘెర ప్రమాదం జరిగింది. జగదల్‌పూర్ నుంచి భువనేశ్వర్ వెళుతున్న హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ శనివారం రాత్రి 11.30 సమయంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఏడు బోగీలు పడిపోయాయి. ఇందులో ఒక ఏసీ, నాలుగు జనరల్, రెండు స్లీపర్ క్లాస్ బోగీలు ఉన్నాయి. ఈ ఘటనలో 23 మంది మృతి చెందారు. దాదాపు 50మందికిపైనే గాయాలపాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. శనివారం రాత్రి 11.30 నిమిషాలు... ఎటుచూసినా చీకటే... వేగంతో దూసుకొస్తున్న హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్.. అప్పటికే ప్రయాణికులంతా నిద్రలోకి జారుకున్నారు. ఇంతలోనే ఒక్కసారిగా కుదుపు... కళ్లు తెరిచేలోగా అక్కడంతా హాహాకారాలు.. క్షతగాత్రులతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారిపోయింది... అసలు ఏం జరిగిందో తెలియని పరిస్థితి...మెల్లగా తేరుకున్న తర్వాత తెలిసింది వారు పయనిస్తున్న రైలు పట్టాలు తప్పిందని... దాంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సంఘటన స్థలంలో పరిస్థితి బీతావాహంగా మారింది. బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. మృతదేహాలు వాటిలో ఇరుక్కు పోయాయి. ఒకదానిపై ఒకటిగా పడిపోయి కనపడుతున్నాయి. బాధితుల ఆర్తనాదాలు మిన్నంటాయి. చెల్లాచెదురుగా వస్తువులు పడిఉన్నాయి. తమ వారి కోసం వారు ఆతృతగా వెతుకున్న వైనం కంటతడిపెట్టిస్తోంది. సమాచారం తెలిసిన వెంటనే అక్కడకు చేరుకున్న సహాయ బృందాలు వాటిని తీయడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బోగీలను కట్ చేసి మృతదేహాలను బయటకు తీస్తున్నారు. క్షతగాత్రులను పార్వతీపురం పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందజేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ సమాచారం అందిన వెంటనే విశాఖ నుంచి హుటాహుటిన సహాయక బృందం బయలుదేరింది. డీఆర్‌ఎం చంద్రలేఖ ముఖర్జీ సహా 18 మంది రైల్వే అధికారులు, 8 మంది వైద్యులు ప్రమాద ప్రాంతానికి వెళ్లారు. రాయగఢ్ కలెక్టర్, జేసీ, విజయనగరం ఓఎస్‌డీ తదితరులు సంఘటనా స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.