Jump to content

Recommended Posts

Posted
గ్యాంగ్‌రేప్‌.. ఫేస్‌బుక్‌లో లైవ్‌స్ట్రీమ్‌ 
 
24brk72-fb.jpg

స్టాక్‌హోం: అరాచకానికి పరాకాష్ట ఈ సంఘటన. వారి చేష్టలు చూసి ప్రపంచం మొత్తం నివ్వెరపోయింది.. తాము చేస్తున్న వికృత క్రీడను వారు ఏకంగా ఫేస్‌బుక్‌లో లైవ్‌స్ట్రీం పెట్టారు. వారి పాపం పండి ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది.. దీంతో ఆ దుష్టులు కటకటాల పాలయ్యారు.

స్వీడన్‌ రాజధాని స్టాక్‌హోంలో ముగ్గురు యువకులు ఒక మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారు దానిని ఫేస్‌బుక్‌లో లైవ్‌స్ట్రీమ్‌ పెట్టారు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారిని అరెస్టు చేశారు. ఫేస్‌బుక్‌ నుంచి ఆ వీడియోలను తొలగించాలని యూజర్లను కోరారు.

స్టాక్‌హోంకు ఉత్తరాన 70 కిలోమీటర్ల దూరంలోని ఉప్ప్సల అనే ప్రాంతంలోని ఒక అపార్ట్‌మెంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. 18, 20, 24 ఏళ్ల యువకులు ముగ్గురు 30ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. వీరు ఈ దారుణాన్ని ఫేస్‌బుక్‌లోని ఒక క్లోజ్డ్‌ గ్రూప్‌లో లైవ్‌స్ట్రీమ్‌ పెట్టారు. ఈ గ్రూపులో దాదాపు 60,000 మంది సభ్యులు ఉన్నారు. దీనిని చూసిన జోసెఫీన్‌ అనే యువతి పోలీసులకు సమాచారం అందజేశారు. ఈ సందర్భంగా ఆ యువతి విలేకర్లతో మాట్లాడుతూ 24ఏళ్ల నిందితుడు గతంలో కూడా ఇటువంటి పనులు చేశాడని పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. అతనే తొలుత బాధితురాలి దుస్తులు చింపినట్లు తెలిపింది. దీంతోపాటు వారు ఈ దారణం మొత్తాన్ని వీడియో, ఫొటోలు తీసి స్నాప్‌చాట్‌లో కూడా పెట్టినట్లు పేర్కొంది. ఈ ఫుటేజిల ప్రకారం నిందితుల్లో కనీసం ఒకరి వద్ద రివాల్వర్‌ ఉన్నట్లు కనిపించింది.

చిత్రాలను అప్పజెప్పండి.. 
ఈ ఘటనకు సంబంధించిన చిత్రాలు ఏమైనా ఉంటే తమకు అప్పజెప్పాలని పోలీసులు కోరారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నారు. ఫేస్‌బుక్‌కూడా దీనికి సహకరిస్తుందన్నారు.

ఉన్మాదిలా కామెంట్‌ పెట్టిన వీక్షకుడు 
ఫేస్‌బుక్‌లో ఈ వీడియోను పలువురు మౌనంగా వీక్షించారు. ఓ వీక్షకుడు మాత్రం దారుణమైన కామెంట్‌ పెట్టాడు. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటివారు నేరం చేసిన ఆ నిందితులకు ఏమాత్రం తీసిపోరంటూ పలువురు తిట్టిపోశారు. లైవ్‌స్ట్రీమింగ్‌ ఆప్షన్‌ను ఇంత దుర్మార్గంగా కూడా వినియోగిస్తారా అని నిర్ఘాంతపోతున్నారు నెటిజన్లు.

 

};_};_};_

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...