JANASENA Posted February 10, 2017 Report Posted February 10, 2017 చెన్నై: తమిళనాడు రాష్ట్ర రాజకీయాలకు కొత్త మలుపునిచ్చే వూహాగానాలు శరవేగంగా వ్యాప్తిచెందుతున్నాయి. ఓ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నీరు సెల్వమా, శశికళా అని తేల్చుకోలేక తికమకపడుతుంటే ఇప్పుడు సూపర్‌స్టార్ రజనీకాంత్ పార్టీ పెట్టబోతున్నాడన్న వార్తలు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. అదీకాకుండా ఆరెస్సెస్‌కి చెందిన సీనియర్ నేత ఎస్.గురుమూర్తి రజనీని పార్టీ పెట్టమని సలహా ఇచ్చారట. రజనీకాంత్ ప్రజాదరణను ఉపయోగించుకుని తమిళనాట పాగా వేసేందుకు భాజపా కొత్త ఎత్తు అని మరికొందరు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ పార్టీ పెట్టి, క్రియాశీల రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనలేవీ పెట్టుకోవద్దంటూ రజనీకి సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. అమితాబ్‌కి రాజకీయాలపై అవగాహన ఉంది. 1980ల్లో బిగ్‌బీ అలహాబాద్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసి గెలిచారు. కానీ మూడేళ్లకే రాజీనామా చేసి ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. రజనీ, అమితాబ్ కలిసి హమ్, అంధాకానూన్, గిరఫ్తార్ వంటి చిత్రాల్లో నటించారు. Quote
batanee Posted February 10, 2017 Report Posted February 10, 2017 ఓహో.... అప్పుడే ....దమితాబ్ సలహా కూడా ఇచ్చేసాడ.... చుద్దాం .. ఏమిజరుగుతుందో .... Quote
batanee Posted February 10, 2017 Report Posted February 10, 2017 I've expelled Sasikala before she sacked me from AIADMK: party Presidium Chairman Madusudanan, who has switched over to Panneerselvam camp ........ Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.