Jai_MegaStar Posted February 15, 2017 Report Posted February 15, 2017 వాషింగ్టన్: అమెరికాలో హెచ్-1బీ వీసా విధానాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బలహీనపరుస్తారని తాను భావించట్లేదని రిపబ్లికన్ సెనేటర్ ఓరియన్ హాచ్ వెల్లడించారు. ఈ వీసాల ద్వారా భారత్ నుంచి అమెరికాకు వస్తున్న ఐటీ ప్రొఫెషనల్స్ వల్ల అమెరికాకు, అమెరికా కంపెనీలకు లాభం చేకూరుతుందని ఆయన అన్నారు. సెనేట్ ఫైనాన్స్ కమిటీ ఛైర్మన్ అయిన ఓరియన్ హెచ్-1బీ వీసా విధానం వల్ల కలిగే ఆర్థిక లాభాల గురించి ట్రంప్‌తో పలుమార్లు జరిగిన సమావేశాల్లో చర్చించినట్లు చెప్పారు. హెచ్-1బీ వీసాల విషయంలో ట్రంప్‌ను ఒప్పించానని, వీసా విధానాన్ని బలహీనపరిచే విధంగా ఆయన ఏ నిర్ణయం తీసుకోరని ఆశిస్తున్నానని మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఉద్యోగాలను కల్పించే అంశమేదైనా, తమ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లేదేదైనా ఉంటే ఆయన రాజకీయ భావాలను పక్కన పెడతారని అన్నారు. తాను ట్రంప్ నుంచి అదే ఆశిస్తున్నానని, అలాగే చేస్తారని భావిస్తున్నానని ఓరియన్ పేర్కొన్నారు. అమెరికాలోని కంపెనీల్లో ఉద్యోగం కోసం ఏటా వేలాది మంది విదేశీయులు హెచ్-1బీ వీసాలపై అమెరికా వెళ్తారు. ముఖ్యంగా భారతీయులు ఎక్కువగా వెళ్లారు. అయితే ఇటీవల అమెరికన్లకు ఎక్కువ ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా ట్రంప్ ప్రభుత్వం ఈ వీసాలపై ఆంక్షలు విధించడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. Quote
Recyclebin Posted February 15, 2017 Report Posted February 15, 2017 Yes it's working nenu benefited Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.