JANASENA Posted February 23, 2017 Report Posted February 23, 2017 ఇంటర్నెట్‌డెస్క్: హిందువులు జరుపుకొనే అతి ముఖ్యమైన పండుగల్లో ఒకటి మహాశివరాత్రి. శుక్రవారం శివరాత్రి సందర్భంగా కోయంబత్తూర్‌లోని వెల్లియంగిరి కొండల సమీపంలో 112 అడుగుల ఎత్తైన ఆదియోగి(శివుడు) విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గీవాసుదేవ్ ఆధ్వర్యంలోని ఈషా ఫౌండేషన్ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరగనుంది. ఈ విగ్రహం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను సద్గురు వాసుదేవ్ తెలిపారు. భూమ్మీద ఉన్న విగ్రహాలన్నింటిలోను అతి పెద్ద ముఖం ఉన్న విగ్రహం ఇదే. అందంగా ఉండటమే కాకుండా ప్రత్యేకమైన కొలతలతో దీన్ని రూపొందించారు. విగ్రహ ముఖాన్ని స్టీల్‌తో తయారు చేశారు. ముఖాకృతి డిజైన్ చేసేందుకు రెండున్నర సంవత్సరాలు పట్టగా ఎనిమిది నెలల పాటు శ్రమించి దీన్ని తయారు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. విగ్రహాన్ని తయారు చేసేందుకు చాలా కష్టపడ్డారు. ఎంతో డబ్బు వెచ్చించారు. ఈ విగ్రహం బరువు సుమారు 500 టన్నులు ఉంటుంది. 112 అడుగుల ఎత్తులో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రత్యేకమైన విషయం ఉంది. మనిషి తన పరిధులను అధిగమించి పరమోన్నత స్థితికి చేరుకునేందుకు శివుడు 112 మార్గాలను సూచించాడు. శాస్త్రాల ప్రకారం మానవ శరీరంలో 112 చక్రాలు ఉంటాయి. అందుకే 112 నంబరు చాలా ప్రత్యేకమని సద్గురు వాసుదేవ్ చెప్పారు. నాలుగు దిక్కుల్లోను ఆదియోగి విగ్రహాలను ఏర్పాటు చేయాలని ఈషా ఫౌండేషన్ భావిస్తోంది. ఇందులో భాగంగా దక్షిణాన కోయంబత్తూర్‌లో మొదటి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. తూర్పున వారణాసి, ఉత్తరాన దిల్లీ, పశ్చిమ దిక్కున ముంబయిలోను ఆదియోగి విగ్రహాలను త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు సద్గురు వెల్లడించారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.