DiscoKing Posted February 23, 2017 Report Posted February 23, 2017 వెలగపూడి ప్రభుత్వ భవనాల సముదాయం నిర్మాణంలో ప్రత్యేకతలు: వెలగపూడి ప్రభుత్వ భవనాల సముదాయంలో భవనాలు ఆధునిక పద్ధతుల్లో నిర్మించడం జరిగింది, నల్లరేగడి నేలల్లో లూజ్ సాయిల్లో గట్టి ఫౌండేషన్ వేయడం జరిగింది. అత్యాధునికమైన ఫైల్ ఫౌండేషన్ విధానంలో ఫైల్స్ నిర్మించడం జరిగింది. నేల గట్టిదనాన్ని అనుసరించి 14 మీటర్ల నుంచి 30మీటర్ల వరకు లోతులో ఫైల్ ఫౌండేషన్ చేయడం జరిగింది. ఒక్కో భవనానికి వేసిన ఫైల్స్ వివరాలు ఇలా ఉన్నా యి. భవనం 1కి 226 ఫైల్స్, భవనం 2కు 244ఫైల్స్, భవనం 3కు 164 ఫైల్స్, భవనం 4కు 164 ఫైల్స్, భవనం 5 కు 164ఫైల్స్ భవనం 6కు 208 ఫైల్స్ వేయడం జరిగింది. సివిల్ స్ట్రక్చర్ కూడా నూతన టెక్నాలజీతో ఆఫీస్ కార్యకలాపాలకు అనువై నవిధంగా నిర్మించడం జరిగింది. బిల్డింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్లో అన్ని వ్యవస్థలను ఒకేచోట నుంచి మానిటర్ చేసేవిధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అన్ని భవనాల్లో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది. సీఎం భవనం నుంచి అన్ని భవనాలకు స్పీకర్ల ద్వారా సందేశం ఒకేసారి అందుతుంది. డాటా సిస్టమ్ ఇంటర్నెట్ అత్యాధునిక సదుపాయాలతో అన్ని భవనాలను అనుసంధానించడం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ విధానాన్ని అన్ని భవనాల్లో, సమావేశ మందిరాల్లో ఏర్పాటుచేయడం జరిగింది. అన్ని భవనాల్లో యాక్సెస్ కంట్రోల్ సిస్టం,అత్యాధునిక సెక్యూరిటీ వ్యవస్థ ఏర్పాటు, అసెంబ్లీ సహా అన్ని భవనాలకు చుట్టూ రకరకాల మొక్కలతో పచ్చదనం ఆహ్లాదంగా తీర్చిదిద్దడం జరిగింది. ప్రతీ భవనంలో డైనింగ్ హాల్, కిచెన్ ఏర్పాటు, ప్రతీ భవనంలో ఏసీ, ఫైర్ ఫైటింగ్, వీడియో కాన్ఫరెన్స్, ఐటీ సిస్టమ్, ఆధునిక డెస్క్లు, ఫర్నీచర్, అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసారు. మూడవ భవనంలో అన్ని సర్వీసులు కల్పించేందుకు వీలుగా బ్యాంక్లు, ఏటిఎంలు, ఎంప్లాయీస్ క్యాంటీన్, పోస్టాఫీస్, జిమ్, అసోసియేషన్ ఆఫీస్, చైల్డ్ కేర్ సెంటర్ లైబ్రరీ, సిబ్బందికి అవసరమైన సదుపాయాలు కల్పించడం జరిగింది. ప్రభుత్వ భవనాల సముదాయం మెయిన్ గేటు నుంచి అన్ని భవనాలకు రావడానికి కాలుష్యం లేని విధంగా బ్యాటరీ ఆటోలు ఏర్పాటుచేయడం జరిగింది. నిర్మాణంలో కీలక ఘట్టాలు 17-02-2016 వెలగపూడి తాత్కాలిక ప్రభుత్వ భవనాల కాంపెక్స్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబుచే శంకుస్థాపన 25-04-2016 వెలగపూడి తాత్కాలిక భవనాల కాంపెక్స్ ఓ గదికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుచే ప్రారంభోత్సవం. 29-06-2016 తాత్కాలిక సచివాలయం ప్రారంభం. 06-07-2016 తాత్కాలిక సచివాలయాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు , గవర్నర్ నరసింహన్ 03-10-2016 అమరావతి రాజధాని నగర పరిధిలోని పూర్తి స్థాయిలో సెక్రటేరియట్ ఉద్యోగుల విధుల నిర్వహణ ప్రారంభం 12-10-2016 అమరావతి రాజధాని నగర పరిధిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు చాంబర్లోకి ప్రవేశం 30-11-2016 నుంచి సీఎం చంద్రబాబు నాయుడు తన చాంబర్లో పూర్తిస్థాయి విధుల నిర్వహణ, అధికారులతో సమీక్షలు ప్రారంభం. 01-12-2016 వెలగపూడి ప్రభుత్వ భవనాల సముదాయంలో తొలి మంత్రివర్గ సమావేశం నిర్వహణ 17-02-2017 అన్నిహంగులతో అసెంబ్లీ శాసనమండలి భవనం సిద్ధం. అన్ని హంగులతో అసెంబ్లీ భవనం వెలగపూడి ప్రభుత్వ భవనాల సముదాయంలో నిర్మించిన శాసనసభ, శాసనమండలి సర్వాంగ సుందరంగా అత్యాధునికంగా అన్ని హంగులతో సిద్దమైంది. అసెంబ్లీ భవనం ఆవరణలో రకరకాల పూల మొక్కలతో పచ్చదనం ఏర్పాటు చేయడం జరిగింది. అసెంబ్లీ హాల్లో సభ్యులకు అత్యాధునికంగా అనువైన విధంగా 231 సీట్లు, శాసనమండలిలో 90 సీట్లు ఏర్పాటు చేయడం జరిగింది, అసెంబ్లీ స్పీకర్ పోడియం కూడా అందంగా తీర్చిదిద్దడం జరిగింది. శాసనమండలి చైర్మన్ పోడియం కూడా అనువైన రీతిలో ఆధునికంగా రూపొందించడం జరిగింది. అసెంబ్లీలో, శాసనమండలిలో అత్యాధునిక టెక్నాలజీతో మైకులు ఏర్పాటుచేయడం జరిగింది. సభ్యలు ఏ డైరెక్షన్లో మాట్లాడినప్పటికీ టేబుల్స్ పై ఏర్పాటు చేసిన మైకుల ద్వారా వాయిస్ స్పష్టంగా వినిపించేవిధంగా అమర్చడం జరిగింది. ప్రభుత్వ భవనాల సముదాయం నిర్మాణంలో పనుల ఒత్తిడిని బట్టి సగటున ఒక్కోరోజు 2,400 మంది వర్కర్లు, 130 మంది వివిధ స్థాయిలో ఇంజనీర్లు పనులు చేయడం జరిగింది. అత్యధికంగా ఒక్కోరోజ 3,200మంది వర్కర్లు పనిచేసిన సందర్భాలున్నాయి. ఇంత జరగిన ఈ ప్రయాణంలో, మీకు గుర్తుండే ఉంటుంది, అమరావతి వ్యతిరేకుల హాహాకారాలు... ఒక రోజు బురద నేల అని, ఒక రోజు నేల కుంగింది అని, ఒక రోజు టాయిలెట్ కు వెళ్ళాలి అంటే కార్ ఎక్కి, విజయవాడ వెళ్ళాలి అని... ఇలా అన్ని రకాలుగా, అమరావతి మీద పడి ఏడుస్తూనే ఉన్నారు.. వారి ఏడుపులే మనకు దీవెనలు ఏమో, వారి దిష్టి మొఖాలే మన అమరావతికి రక్ష ఏమో... అందుకే, రికార్డు స్థాయిలో నిర్మాణం చేసి, మన నేల నుంచే, మన పాలన మొదలు పెట్టాం... Quote
DiscoKing Posted February 23, 2017 Author Report Posted February 23, 2017 gannavaram new terminal ithe kummindhi Quote
DiscoKing Posted February 23, 2017 Author Report Posted February 23, 2017 durga temple flyover kooda complete itundhi inko 4 months lo... next benz circle flyover Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.