JANASENA Posted February 27, 2017 Report Posted February 27, 2017 అతడు పచ్చితాగుబోతు.. రిపబ్లికన్ పార్టీ సభ్యుడు కేన్సస్ హంతకుడి గురించి చెప్పిన ఇరుగుపొరుగు ఓలెట్ అమెరికాలోని కేన్సస్‌లో కాల్పులు జరిపి శ్రీనివాస్ కూచిభొట్లను పొట్టనబెట్టుకున్న ఆడమ్ ప్యూరింటన్ పచ్చి తాగుబోతు అని అతడి పొరుగువారు చెబుతున్నారు. చాలా కాలం నుంచే అతడికి ఈ దురలవాటు ఉన్నప్పటికీ 18 నెలల కిందట తండ్రి మరణించినప్పటి నుంచి ఈ వ్యసనానికి మరీ బానిసయ్యాడని తెలిపారు. నౌకాదళంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌గా పనిచేసిన ప్యూరింటన్.. అక్కడి నుంచి బయటకు వచ్చాక అనేక ఉద్యోగాలు చేశాడు. ఎక్కడా స్థిరంగా లేడు. తరచూ ఉద్యోగాలు మారేవాడని అతడికి పొరుగున ఉండే ఆండీ బెర్తెల్‌సెన్ చెప్పారు. తొలుత ఐటీ ఉద్యోగం చేసిన అతడు.. గడిచిన ఏడాది కాలంలో మద్యం, హార్డ్‌వేర్ దుకాణాల్లో పనిచేశాడని వివరించారు. ఒక పిజా పార్లర్‌లో పాత్రలు కూడా కడిగాడని తెలిపారు. కొన్నిసార్లు ఉదయాన్నే పీకలదాకా తాగేవాడని తెలిపారు. శారీరకంగా, మానసికంగా అతడి పరిస్థితి క్షీణించిందని వివరించారు. ప్యూరింటన్.. పక్షులను వేటాడేందుకు షాట్‌గన్స్‌ను ఉపయోగించేవాడని తెలిపారు. వాటిని తండ్రి నుంచి పొందాడని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు సంబంధించిన రిపబ్లికన్ పార్టీలో అతడు నమోదయ్యాడని ఆండీ పేర్కొన్నారు. అయితే ట్రంప్ గురించి కానీ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా గురించి కానీ, వర్ణవివక్ష గురించి కానీ అతడు మాట్లాడటాన్ని తాను వినలేదన్నారు. ప్యూరింటన్ తమతో తెగతెంపులు చేసుకున్నాడని అతడి తల్లి మార్షా ప్యూరింటన్ తెలిపారు. తెరుచుకున్న బార్..: మరోవైపు ప్యూరింటన్ దురాగతానికి మూగసాక్షిగా నిలిచిన ఆస్టిన్స్ బార్ అండ్ గ్రిల్.. పోలీసు పహారా మధ్య మళ్లీ తెరుచుకుంది. మధ్యాహ్న భోజనానికి వచ్చిన అతిథులు, బార్ ఉద్యోగులు ఉద్వేగానికి లోనయ్యారు. పరస్పరం ఆలింగనం చేసుకున్నారు. ప్యూరింటన్ కాల్పులకు బలైన శ్రీనివాస్‌కు నివాళలర్పిస్తూ ప్రధాన ద్వారం వద్ద సానుభూతిపరుల పుష్ప గుచ్ఛాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. తమ బార్ 30 ఏళ్లుగా ఆదరణ సంపాదించుకుందని ఆస్టిన్స్ యజమానుల్లో ఒకరైన బ్రాండన్ బ్లమ్ చెప్పారు. ప్యూరింటన్ దాడితో అందరూ దిగ్భ్రాంతికి లోనైనట్లు చెప్పారు. Quote
YeddiBK Posted February 27, 2017 Report Posted February 27, 2017 Rep party sabhyudu anta deenni vichalavidiga politicize chesthunnaru extreme-left bast***s Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.