Jump to content

Hyperloop First of its kind in Amaravathi soon - CBN aa Mazaka


Recommended Posts

Posted

1brk57a.jpg

 

అమరావతి: తమ సంస్థ ఆధ్వర్యంలో బుల్లెట్‌ రైలును మించిన వేగంతో ప్రయాణించే రవాణా వ్యవస్థను తీసుకొస్తామని హైపర్‌లూప్‌ సంస్థ ఛైర్మన్‌ బిబోప్‌ జి.గ్రెస్తా వెల్లడించారు. గంటకు 750 కి.మీ. వేగంతో ప్రయాణించేలా తమ పరిజ్ఞానం ఉంటుందని చెప్పారు. విద్యుత్‌ అయస్కాంత శక్తితో ఒక ట్యూబ్‌ లోపల పాడ్స్‌, క్యాప్సూల్స్‌ లాంటివి అమరుస్తామని, పిల్లర్లు నిర్మించి దానిపై ప్రీఫ్యాబ్‌ స్టీల్‌ ట్యూబ్‌లు వేస్తామని, ఒక్కో క్యాప్సూల్‌లో 40 మంది వరకూ ప్రయాణించేలా అవకాశం ఉంటుందని వివరించారు. వేగం ఎక్కువైనా ప్రయాణికుల భద్రతకు ఎలాంటి భయం ఉండబోదన్నారు. ఒక కి.మీ.కు 40 మిలియన్‌ డాలర్ల వ్యయమవుతుందని అంచనా వేశామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో మంగళవారం సాయంత్రం ఆయన బృందం భేటీ అయింది. తొలుత ఈ రవాణా వ్యవస్థ తీరుతెన్నులపై ఆయన విలేకర్లతో మాట్లాడారు.

Posted
గంటకు 760 కి.మీ.
  • సూపర్‌ స్పీడ్‌!
  • దూసుకొస్తున్న బుల్లెట్‌ క్యాప్సూల్స్‌
  • గాలి తీసేసిన ట్యూబ్‌ లోంచి
  • గొట్టం ఆకార పెట్టెల్లో ప్రయాణం
  • ఫ్లైఓవర్‌ ఖర్చులో సగంతో సిద్ధం
  • భూమి, విద్యుత్, వనరులు ఆదా
  • ప్రయాణికులకు అద్భుత అనుభవం
  • హైపర్‌లూప్‌తో రవాణా విప్లవం
  • ఫ్రాన్స్‌, అబుదాబిల్లో నిర్మాణదశలో
  • హైపర్‌లూప్‌ చైర్మన్‌ గ్రెస్టా వెల్లడి
  • దావోస్ లో బాబుతో తొలి చర్చలు
అమరావతి, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): గంటకు 760 కిలోమీటర్ల వేగం! అలాగని గుండె చిక్కబట్టుకోవాల్సిన పనిలేదు. ప్రయాణమంతా హాయిగా, ప్రమాదాలకు తావులేకుండా సాగిపోతుంది. అంతేనా.. ఇప్పుడున్న హైస్పీడ్‌ రైలు, మెట్రో రైలు మార్గాల నిర్మాణం కంటే తక్కువ ఖర్చుతో, ప్రయాణికులకు అద్భుత అనుభూతి మిగులుతుంది. నిజంగా ఇదంతా జరిగితే, రవాణారంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికినట్టే! దావోస్‌ పర్యటనలో భాగంగా, హైపర్‌లూప్‌ చైర్మన్‌ బిబోప్‌ జి.గ్రెస్టా, సీఎం చంద్రబాబు మధ్య ఈ సంచలన ఆలోచన రూపం పొందింది. ఆ సమయంలో సీఎం అందించిన ఆహ్వానాన్ని అందుకొని.. గ్రెస్టా మంగళవారం విజయవాడ వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
 
ఏమిటీ హైపర్‌లూప్‌?
హైపర్‌లూప్‌ విధానంలో.. గాలితీసేసిన ట్యూబ్‌ని నిర్దేశించిన గమ్యాల మధ్య ఏర్పాటుచేస్తారు. రోడ్డు మధ్యలో మెట్రో రైలుకోసం నిర్మించినట్టుగాగానే, ఫ్లైఓవర్‌ లేక వంతెనలాంటిది నిర్మించి...దానిపై ట్యూబ్‌ను అమరుస్తారు. ఆ ట్యూబ్‌లోంచి గంటకు 750 కిలోమీటర్ల వేగంతో క్యాప్సూల్స్‌ దూసుకెళతాయి. అదేసమయంలో ఏంతవేగంతో పోతున్నా, ఆరంటే ఆరు సెకన్లలోనే నిలిపివేయొచ్చు. క్యాప్సూల్‌ అంటే 28 నుంచి 50 మంది పట్టే చిన్న రైలు పెట్టెలాంటిది. క్యాప్సూల్‌ ఆకారంలో ఇది ఉంటుంది. విండ్‌, సోలార్‌, కెనటిక్‌ ఎనర్జీలను ఉపయోగించి క్యాప్సూల్స్‌ని ధ్వనివేగంతో నడిపిస్తారు. ప్రతి 40 సెకన్లకు ఒక క్యాప్యూల్‌ను ట్యూబ్‌లోకి పంపించవచ్చు. ఇలా ఏడాదికి 2.4 కోట్లమందిని చేరవేరవచ్చు. సరుకు రవాణాకూ ఈమార్గాన్ని ఉపయోగించవచ్చు. మరోవిశే షం ఏమిటంటే.. క్యాప్సూల్స్‌కు వర్చ్యువల్‌ విం డోస్‌ ఉంటాయి. అంటే క్యాప్సూల్‌ కిటికీలోంచి మనం బయటకు చూసేటప్పుడు..ఆ దృశ్యాన్ని మనకు కావాల్సినట్టుగా చూడొచ్చునన్నమాట. అంతేకాదు, పూర్తి సురక్షితమైన ప్రయాణాన్ని హైపర్‌లూప్‌ హామీ పడుతుంది. ఒకరకంగా ఇది మానవీయ రవాణా వ్యవస్థ!
 
భూమి ఆదా.. ఖర్చు తక్కువ
చెక్‌ రిపబ్లిక్‌, ఫ్రాన్స్‌, అబుదాబిలలో హైపర్‌లూప్‌ సాంకేతిక పరిజ్ఞానంతో రవాణా మార్గాన్ని ఏర్పాటుచేస్తున్నాం. స్థానిక భాగస్వాములతో కలిసి ఈ ప్రాజెక్టులు చేపట్టాం. అబుదాబి రాజు అక్కడి ప్రాజెక్టులో భాగస్వామిగా ఉన్నారు. మెట్రో రైలు మార్గం నిర్మాణానికి కిలోమీటరుకు 80 మిలియన్‌ డాలర్లు, హైస్పీడ్‌ రైలుకు 50 నుంచి 150మిలియన్‌ డాలర్లు ఖర్చు అయితే.. హైపర్‌ లూప్‌ ట్యూట్‌ నిర్మాణానికి కిలోమీటరుకు 40 మిలియన్‌ డాలర్లు చాలు. ఎంత సమయం పడుతుందనేది స్థానిక పరిస్థితులు, నిధులకు అనుగుణంగా ఉంటుంది. సాధారణంగా ఐదునుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరం మార్గాన్ని 38 నెలల్లో పూర్తిచేయవచ్చు. ప్రస్తుతం ఇంటర్‌ సిటీ, సిటీల మధ్య హైపర్‌లూప్‌ మార్గాలు వేస్తున్నాం. భవిష్యత్తులో ఖండాల మధ్య కూడా ఈ రవాణా మార్గాలు చూడొచ్చు. ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలను ఉపయోగించుకుంటూ కూడా, వీటి నిర్మాణాన్ని చేపట్టవచ్చు. వీటి నిర్మాణానికి పెద్దగా భూమి అవసరం ఉండదు. ఇలాంటి ప్రాజెక్టులు రావడం వల్ల భూముల విలువలు కూడా పెరుగుతాయి. కాలిఫోర్నియాలో ఇదే జరిగింది.
 

నిధులెలా?
ప్రాజెక్టు ఏర్పాటు సాధ్యాసాధ్యాలను (ఫీజబిలిటీ) తొలుత అధ్యయనం చేయాలి. దీనికయ్యే ఖర్చును హైపర్‌లూప్‌, స్థానిక ప్రభుత్వాలు చెరిసగం భరిస్తాయి. ప్రాజెక్టు సాధ్యమేననుకొంటే.. పెట్టుబడులను పలు రకాలుగా సమీకరించవచ్చు. బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ ఒకశాతం వడ్డీకే రుణాలిస్తుంది. అలాగే, స్థానిక భాగస్వాములు కొంత పెట్టుబడి పెడతారు. ఇక టికెట్‌ ఛార్జీ ఎంత అన్నది ముందే తెలియదు. ప్రాజెక్టు పూర్తయ్యాక పరిస్థితిని బట్టి నిర్ణయించాలి. అబుదాబి ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను, రవాణా చార్జీలను త్వరలోనే అక్కడి రాజుతో కలిసి మీడియాకు వెల్లడిస్తాం. ఈ ప్రాజెక్టులకు ఒకశాతం వడ్డీతోనే రుణం లభించడంతో పాటు, విద్యుతనీ ఆదా చేయవచ్చు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వాలు సబ్సిడీ ధరపై టికెట్‌ రేటును నిర్ణయిస్తాయి.

 

 
దావోస్‌లో చంద్రబాబు తెలివైన ప్రశ్నలు వేశారు: బీబోప్‌ జి. గ్రెస్టా 
2HYPER.jpg
 
ఏడాది క్రితం ప్రధానిని మోదీని అమెరికాలో కలిశారని, దావోస్ లో భారత ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో చర్చలు జరిపామని హైపర్‌లూప్‌ చైర్మన్‌ బీబోప్‌ జి. గ్రెస్టా వెల్లడించారు. భారతలో పలువురు తమతో భాగస్వాములయ్యేందుకు ముందుకొచ్చారన్నారు. ‘‘దావోస్ లోనే ఏపీ సీఎం చంద్రబాబును తొలిసారి కలిశాను. ఈ టెక్నాలజీని గురించి వివరించాను. ఆయన మమ్మల్ని చాలా తెలివైన ప్రశ్నలు అడిగారు. ఆయనని చూస్తే రాష్ట్ర ప్రజల్ని బాగా చూసుకుంటున్న వ్యక్తి అనిపించింది’’ అని పేర్కొన్నారు. అంతకుముందు ఆయన హైపర్‌లూప్‌ పద్ధతిలో ఏపీలో రవాణా వ్యవస్థ ఏర్పాటుకు ఫీజబిలిటీ ఉందా అనేదానిపై నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబుని కోరారు. ఈ సమావేశంలో ఐటీ సలహాదారు జేఏ చౌదరి, సీఎం కార్యాలయ ఉన్నతాధికారి సాయిప్రసాద్‌, ఏపీఐఐసీ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. 
Posted
1 minute ago, Kontekurradu said:

orey ayyam ivanni , ayinapuud matladukundamle, 

odiyamma atleast telusuko em em vasthunaryo AP ki..

Posted
Just now, sarkaar said:

odiyamma atleast telusuko em em vasthunaryo AP ki..

telsukkoni eam sestam, work start ayinaka discuss chedam v

Posted
Just now, Kontekurradu said:

telsukkoni eam sestam, work start ayinaka discuss chedam v

teluskonte, atleast we know what our leader is doing for future generations...

agreed that once work is started, we can be happy.

Posted
5 minutes ago, Kontekurradu said:

telsukkoni eam sestam, work start ayinaka discuss chedam v

16865017_935332676602326_417553905291760

 

uiy.gif

Posted
15 minutes ago, sarkaar said:

teluskonte, atleast we know what our leader is doing for future generations...

agreed that once work is started, we can be happy.

sare...atleast eppudu vastayo cheppu aite.. uiy.gif

Posted
Just now, idibezwada said:

sare...atleast eppudu vastayo cheppu aite.. uiy.gif

edho choclate konnantha vesay kadhu vayya. it takes time.

Posted

@CBN aa Mazaka ..... @3$%@3$%

 

Gadkari invites Tesla to test run 1,100-km/hr Hyperloop on Mumbai-Pune Expressway  September 14, 2016

hyperloop.jpg

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...