NinduChandurudu Posted March 3, 2017 Report Posted March 3, 2017 చలాకీ నాగ్ ఎవరితో మాట్లాడట్లేదా? Fri Mar 03 2017 19:14:09 GMT+0530 (IST) facebooktwittergoogle pluswhatsapp ఇప్పుడు నాగార్జునను చూస్తున్న వారందరూ తెగ ఆశ్చర్యపోతున్నారు. ఆయన ప్రవర్తన చూసి ముక్కు మీద వేలు వేసుకుంటున్నారు. నాగ్ ఇలా కూడా ఉంటారా అనేస్తున్నారు. మొదటిసారిగా ఆయనను ఇలాంటి పరిస్థితుల్లో చూస్తున్నామని చెబుతున్నారు. ప్రస్తుతం నాగార్జున రాజు గారి గది 2 సినిమా షూటింగ్ లో ఉన్నాడు. షాట్ చెప్పినపుడు రావడం.. పూర్తి చేసి వెళ్లిపోవడం.. మిగిలిన సమయంలో సైలెంట్ గా ఓ పక్కన కూర్చోవడం.. ఎవరితో మాట్లాడకుండా పక్కన ఉండడం.. ప్రస్తుతం నాగార్జున ప్రవర్తన ఇలా ఉందని ఇండస్ట్రీ జనాలు అంటున్నారు. ఇదంతా అఖిల్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ కావడంతో నాగార్జున షాక్ కు గురి కావడంతోనే అనే వాదన వినిపిస్తోంది. సహజంగా సెట్స్ పై ఉన్నపుడు నాగ్ బాగా చెలాకీగా.. ఎనర్జీకి మారుపేరుగా ఉంటాడు. ప్రతీ ఒక్కరినీ పలకరిస్తూ.. అందరినీ కలుపుకుపోయే తత్వం ఆయనది. అలాంటిది.. కొడుకు జీవితం అనుకోని మలుపు తిరగడంతో నాగ్ షాక్ తినేశారని అంటున్నారు. తమ లైఫ్ లో నాగార్జునను ఇలా చూడ్డం ఇదే మొదటిసారని చెబుతున్నారంటే పరిస్థితి అర్ధమవుతుంది. మరి ఈ సిట్యుయేషన్ నుంచి నాగ్ ఎలా బయటకు వస్తారో? Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.