alpachinao Posted March 6, 2017 Report Posted March 6, 2017 Naku antha goppaga emi leda chala normal story Quote
k2s Posted March 6, 2017 Author Report Posted March 6, 2017 2 hours ago, alpachinao said: Naku antha goppaga emi leda chala normal story Quote
ARYA Posted March 6, 2017 Report Posted March 6, 2017 22 hours ago, k2s said: Telugu lo undi.... mana matru bhasha lo chadivithey ne kick untundi... "నాకు నచ్చిన కథ..." రిటైర్మెంటు రోజు ఆఫీసులో భారీగా ఏర్పాట్లు చేసారు. పెద్దాధికారులు, యూనియన్ నాయకులు సత్కారసభకి వచ్చి సుందరయ్య సేవలను కొనియాడారు. చివర్లో సుందరయ్య పిల్లలు మాట్లాడుతూ సుందరయ్య సంతానంగా తాము జన్మించటం తమ అదృష్టం అంటూ చాలా ఎమోషనల్ గా మాట్లాడారు.తన పిల్లలు ఇంత బాగా మాట్లాడుతారా అని సుందరయ్యే ఆశ్చర్యపోయాడు. తనకి జరిగిన సత్కారానికి కృతఙ్ఞతలు తెలుపుతూ సుందరయ్య “తనకి ఇంత భారీగా సత్కార సభ జరగటం వ్యక్తిగతంగా ఇష్టం లెకపొయినా , పది మందికోసం ఒప్పుకోక తప్పలేదంటూ”తన అనుభవాలను ముచ్చటించి కష్టపడి పనిచేసి సంస్ధ అభివృద్ధికి పాటుపడాలనీ, సంస్థ బాగుంటేనే మనం బాగుంటామని హితవు పలికాడు. చివర్లో తనకి రావలసిన పి.ఫ్., గ్రాట్యుటీ వగైరా అన్నింటికీ సంబధించిన చెక్కులు సుందరయ్య చేతికి అందించారు. సభ ముగిసిన తర్వాత అక్కడే విందు ఏర్పాటు జరిగింది. కార్యక్రమాలైన తర్వాత కార్లో ఇంటికి సాగనంపారు. రాత్రి ఇంటికి చేరిన తర్వాత పిల్లలు ఆఫీసులో జరిగిన సన్మానం గురించి మాట్లాడుకుంటుండగానే సుందరయ్యకి వెంటనే నిద్ర పట్టేసింది. మర్నాడు బ్యాంకుకి వెళ్ళి తన అకౌంట్లు అన్నీ సెటిల్ చేసుకున్నాడు. మిగిలిన డబ్బుని అకౌంటులో వేసుకుని, పిల్లల విషయం తేలిన తర్వాత ఏంచెయ్యాలో అప్పుడు అలోచించొచ్చని ఇంటికి తిరిగొచ్చాడు. అలాగే, తానే పిల్లల్ని పిలిచి ఉన్న విషయాన్ని చెప్పి ఓ నిర్ణయానికి రావటం మంచిదని భావించాడు. అటు సుందరయ్య కొడుకు, కూతురు కూడా తండ్రితో విషయం ఎలా చెప్పాలా అని ఆలొచిస్తున్నారు. అందరి పిల్లల్లాగే వాళ్ళకి తండ్రి దగ్గర భయం ఎక్కువే. ఒకొక్కసారి తండ్రి తీసుకునే నిర్ణయాలను మార్చడం కష్టం. సందర్భాలో ఆయన గీసుకున్న గిరిని దాటి వచ్చేవారుకాదు. తండ్రి సిద్ధాంతాలు చాలా ఉన్నతమైనవే.. కాని ఈ రోజుల్లో వాటిని నిత్యజీవితంలో పాటించటం కష్టం. అందుకే పట్టువిడుపులు ఉండాలి. కాలంతోపాటు మనం కూడా మారాలి. అంతేకాని సమాజాన్ని మార్చటం మన తరంకాదు.. అని తండ్రికి చెప్పే ధైర్యం వాళ్ళకి లేదు. అలా అని అయన అభిప్రాయాలు మంచివి కావని కూడా అనలేరు. ఎవరు ఏమడుగుతారనే టెన్షన్ తోనే ఆ రోజు పూర్తిగా గడిచిపోయింది. "వాళ్ళు ఎమైనా నీతో అన్నారా?" అంటూ రాత్రి పడుకోబోయేముందు సుందరయ్య భార్యని అడిగాడు. "అబ్బే.. నన్నేం అడగలేదు. ఆడిగినా నేనేం మాట్లాడతాను? ఆ విషయం వాళ్ళకీ తెలుసు." ఆ మర్నాడు సాయంత్రం పిల్లలు వెళ్ళిపోతారు. ఈలోగా ఎదో ఒకటి తానే చెయ్యాలి. సుందరయ్య ఏదో ఆలోచన స్పురించటంతో నిద్ర పట్టేసింది. ఉదయమే ఇంట్లో అందరినీి పిలిచాడు సుందరయ్య. "నేనూ అమ్మ ప్రస్తుతానికి ఇక్కడే ఉంటాం. పుట్టి పెరిగిన ఊరు వదలి రావటం కుదరదు. నాకు పెన్షన్ వస్తుంది. అది మాకు సరిపోతుంది. నా రిటైర్మెంటు డబ్బులతో అప్పులు తీర్చగా మిగిలినవి మొత్తం ఇవి! మాకు ఏమైనా అవాంతరాలు వస్తే అవసరార్దం కొంచెం డబ్బులు మాకు వుంచి మిగతావి మీరిద్దరు తీసుకోండి. ఇదిగో బ్లాంక్ చెక్కులు. నేనివ్వగలగింది ఇదే!" అంటూ సుందరయ్య ఓ కాగితం మీద లెఖ్ఖలు రాసి, చెక్కులు వాళ్ళ చేతిలో పెట్టేడు. వసంతమ్మకి భర్త అలోచన నచ్చింది. నిజమే..అంత్యనిష్ఠురం కంటే ఆదినిస్టూరం మంచిది. అయితే ఆయన మాటలు మిగాతావాళ్ళకి ఆశ్చర్యం కలిగించలేదు. అయన ఏ విషయమైన అంత సూటిగానే చెప్పేస్తారు . "వద్దు నాన్నా. మేం వచ్చింది మీ రిటైర్మెంటు సమయంలో మీతో నాలుగు రోజులు గడపడానికి వచ్చామే గాని ఆస్తులు పంచుకోడానికి కాదు!! మాకు ఆర్ధిక సమస్యలు గాని, అవసరాలుగాని లేవు. నిజంగా మాకు అవసరమైతే మీ దగ్గర తీసుకోడానికి మాకు మొహమాటం ఎందుకుంటుంది నాన్నాగారూ! ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా హయిగా ఉండండి" అంటూ అబ్బాయి చెక్కుల్నితిరిగి తండ్రి చేతితో పెట్టేశాడు. అంతే! ఒక్క నిమిషంలో వాతవరణం చల్లబడిపాయింది. అందరి ఊహలు ఓ రకంగా ఉహలుగానే ఉండి పోయాయి . "అన్నట్లు.. నాన్నగారు మనందరం కలిసి ఓసారి మన కోనేరుగట్టుకి వెళ్ళొద్దాం. మన పాతిల్లు, ఆ వీధి చూసి చాల కాలమయింది" అన్న కొడుకు మాటలు వినేసరికి సుందరయ్యకి ఆనందం వేసింది. "నిజమేరా! మేం కుడా ఆ గట్టుకి వెళ్లి చాల కాలమయింది " అంటూ అందరూ బయలుదేరారు. "అబ్బా! మన వీధి చాలా మారి పోయింది ." ఈ వీధిలో అందరూ ఇళ్ళు అపార్టుమెంట్సుకి ఇచ్చేశారు. ఒక్క మనం అద్దెకున్న ఇల్లే అలా ఉంది. ఈ మధ్య ఆ ఇంటివాళ్ళు అమ్మేస్తే, ఎవరో కొనుక్కుని రిమోడల్ చేయించారుట. మొక్కలు, చెట్లు పాడవకుండా అలాగే వున్నాయి! ఎవరో మంచి వాళ్ళల్లే ఉన్నారు! ఇంటి స్వరూపాన్ని పాడు చేయకుండా, బాగుచేయించారు. బావుంది!" అలా కబుర్లు చెప్పుకుంటూ కోనేరు నాలుగు గట్లు తిరిగి, ఇంటికొచ్చేసారు. ఆ రోజు సాయంత్రమే పిల్లలు ప్రయాణాలు. ‘ఏవిటో! ఈ వారం రోజులూ క్షణాల్లా గడిచిపోయాయి!’ అనుకుంటూ వాళ్ళతోపాటు రైల్వేస్టేషన్ కి వెళ్లి , వీడ్కోలు చెప్పి ఇంటి కొచ్చేశారు సుందరయ్య, వసంతమ్మ. ఇంటిికొస్తూనే టేబులుమీద కవరు చూసి సుందరయ్య అశ్చర్యపోయాడు. "నాన్నగారికి "అన్న అక్షరాలు చూసి ఆత్రుతగా కవరుచింపి చదవసాగారు. నాన్నగారికి, మీ దగ్గర మాట్లాడే ధైర్యం లేక ఈ ఉత్తరం రాస్తున్నాం. మరోలా భావించకండి. మీరు పడ్డ కష్టాలు మేం పడకూడదని, మమ్మల్ని చాలా అపురూపంగా పెంచారు! దానికితోడు మారిన రోజులతోపాటు మేం కూడా మారిపోయం. యాంత్రికయుగంలో ఎన్నో సదుపాయాలను ఏర్పాటు చేసుకుని జీవితాన్ని చాలా సుఖమయం చేసుకున్నాం. కాలంతోపాటు పరుగులు తీస్తున్నాం! కాని మేం చాలా కోల్పోయాం నాన్నగారు!! బాల్యం మాకు తెలియదు. యవ్వనంలో మాకు మంచి అనుభూతులు లేవు. అనుబంధాలు, ఆత్మీయతలు అంటే మాకర్ధం తెలియదు. మేం పరిగెత్తుకుంటూ పాలు తాగుతున్నాం, కాని నీళ్ల రుచి తెలియదు! మీ తరంవాళ్ళు గుర్రంస్వారీ చేసేవారు. మేం పులిస్వారీ చేస్తున్నాం. మీరు జీవితాన్ని కాచివడపోసారు. మేం జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. మీరు పెద్దలమాటలు వినేవారు. మేం కంప్యూటర్ చెప్పినట్లు నడుచుకుంటున్నాం!! అమ్మ ఎప్పుడూ అంటుందే.. అలా మేం గోరిలు కట్టుకుని జీవిస్తున్నాం నాన్నగారు!! ఒక్క విషయం చెప్పగలం నాన్నగారు! మీ పెంపకంలో లోపం లేదు. మేం పెరిగిన వాతవరణంలో లోపం ఉంది! మా దగ్గర సముద్రమంత మేధస్సు ఉంది. కాని ఆ మేధస్సుతో గుక్కెడు నీళ్ళు కూడా తాగలేం! మీ మేధస్సు కోనేరంతే .. అయితే నేం .. అదంతా మంచినీరు!!. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మిమ్మల్లి ఈ రొంపిలోకి లాగదలచుకోలేదు! మీరు ఎప్పుడూ స్వప్నాల్లో జీవించలేదు.వాస్తవాలతో జీవనం సాగించేరు! మీకు మనుషులతోనేకాదు, మీ పుట్టి పెరిగిన నేలతోకూడా బంధాలున్నాయి. చెట్లు, పశువులు,పక్షులు అన్నిటితో మీకు అనుబంధాలున్నాయి! వీటితోపాటు చివరికి మనం పాతికేళ్ళు అద్దెకున్న ఇంటిమీద కూడా మీకు మమకారం ఉంది!! వీటిని వదులుకోలేక, ఉద్యోగంలో ప్రమోషన్లు తీసుకోకుండా ఉన్నదాంట్లో చాలా సంతృప్తిగా జీవిస్తున్నారు! అందుకే మిమ్మల్ని మీ వాస్తవ జీవితాల్నుంచి దూరం చేయటం ఇష్టంలేక, మీ అనుబంధాలను త్రుంచటం ఇష్టం లేక, మీకు తెలియకుండా ఓ పని చేశాం!! అక్కా, నేను కలసి మన కోనేరు గట్టులో మనం గతంలో ఉన్న ఇంటిని మీ గురించి కొన్నాం. ఈ ఉత్తరంతో పాటున్న తాళంచెవి ఆ ఇంటిదే!! మీరు ఆ ఇంటిలోకి మారి, స్వేచ్చగా, హాయిగా , ప్రశాంతంగా ఉండాలనేదే మాకోరిక! అన్నట్లు, ఇంకో అభ్యర్ధన కూడా ఉంది నాన్న!! త్వరలో మాకు పుట్టె పిల్లల్ని మేము పెరిగినట్టు కాకుండా, మీరు పెరిగినట్టు పెంచి, పెద్దచేసే బాధ్యతని మీకే అప్పగిస్తాం. మన గట్టు మీద పెంచండి. మాకు తీరిక లేక, పెంచలేక కానేకాదు!! మా స్వార్దం అంతకంటే కాదు!! వాళ్ళు మేం పెరిగినట్టు పెరగకూడదు. మీరు పెరిగినట్టు పెరగాలనే మా ఆశ! వాళ్ళు యంత్రాలు కాకూడదు, వాళ్ళు మనుషులగానే ఎదగాలి! ఓ విషయం చెప్పమా నాన్నా! మీలాంటి వాళ్ళ చేతులలో పిల్లలు పెరగడం, భవిష్యత్తులో మనిషి మనుగడకి చాల అవసరం నాన్న! కాదనరుగా!! ఇట్లు మీ అమ్మాయి, అబ్బాయి. ఉత్తరం చదివిన సుందరయ్య కళ్ళు కోనేరుతో నిండిపోయింది! అ కళ్ళతోనే వసంతమ్మ కళ్ళల్లో వసంతాన్ని చూసాడు. వంటింట్లో కాకులు, పెరట్లో కోయిలలు హడావిడిగా కనిపించేయి. అయ్యకోనేరు మాత్రం ఆనందబాష్పాలు రాల్చింది!! కొత్త కొత్త సానుకూల ఆలోచనలని రేకెత్తించే ఇలాంటి కథలే ఇప్పుడు మనుషులని నిజమైన మనుషులుగా మార్చటానికి పనికొస్తాయి! ఇది చదివిన తర్వాత ఎక్కడన్నా చిన్న కదలిక ఏర్పడి మనసును స్పృశిస్తే బంధాలను ఇంకొంచం గట్టిగా హత్తుకోండి. యాంత్రిక జీవనానికి దూరంగా జరగటానికి ప్రయత్నించండి. మన ఆచారాలు సాంప్రదాయాలు పండగలు ఆటపాటల గురించి పిల్లలికి తెలియచేయండి. ఆప్యాయత పంచండి, పెంచండి. 🌿🌿 🏡🔔🍁🍁 land-a-sore post Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.