SonyKongara Posted March 9, 2017 Author Report Posted March 9, 2017 అమరావతి టూ అనంతపురం గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ (ఆంధ్రజ్యోతి - గుంటూరు) రాయలసీమ జిల్లాలను నవ్య రాజధాని అమరావతితో అనుసంధానం చేసే గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే ప్రక్రియని ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ రహదారిపై రాష్ట్ర మం త్రివర్గం చర్చించి ఆమోదం తెలపగా ప్రక్రి యని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఉన్నతస్థాయి కమిటీని ప్రభుత్వం నియమించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు చైర్మన్ గా వ్యహరించే ఈ కమిటీలో ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి(రెవెన్యూ), రవాణ, పర్యా వరణ, అటవీ శాఖ మంత్రులు, చీఫ్ సెక్రెటరీ, ఎన్ హెచ్ ఏఐ చైర్మన్, ఫైనాన్స్ డిపార్టుమెంట్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ, సీసీఎల్ఏ సభ్యులుగా ఉంటారు. మెంబర్ కన్వీనర్‌గా రవాణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీని నియమించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా అనంతపురం, గుం టూరు, ప్రకాశం, కర్నూలు, కడప జిల్లాల కలెక్టర్లను నియమించారు. ఈ కమిటీ ఇకపై నెలకొకసారి భేటీ అయి రహదారి భూసేకర ణ, ఎలైన్ మెంట్ని సమీక్షించి త్వరితగతిన ఖరారు చేస్తుంది. అమరావతికి అన్ని వైపుల నుంచి కనెక్టివిటీ ఉండాలని సీఎం ఇప్పటికే అధికారులకు స్పష్టం చేశారు. ఎన్ హెచ-5 ద్వారా ఇటు చెన్నై, అటు కోల్కత్తా నుంచి కనెక్టివిటీ ఉంది. అలానే మరో హైవే ద్వారా హైదరాబాద్ నుంచి రోడ్డు కనెక్టివిటీ ఉన్నది. బెంగళూరు నుంచి రోడ్డు ఉన్నప్పటికీ అది రెండు వరసలే కావడం వల్ల ఎన్నో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతోన్నాయి. ఈ నేపథ్యంలో బెంగళూరుకు సమీపంలో ఉండే అనంతపురం నుంచి అమరావతికి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేని నిర్మించాలని నిర్ణయించారు. రాజధాని మాస్టర్ ప్లాన్ రూపొందించిన సింగపూర్ సంస్థ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. ఎక్స్‌ప్రెస్ వే వల్ల గుంటూరు, ప్రకాశం, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లోని శివారు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. అలానే రాయలసీమవాసులకు రాజధానితో సంబంధం ఏర్పడుతుంది. అనంతపురం నుంచి అమరావతికి సుమారు 500 కిలోమీటర్ల మేరకు రహదారిని నిర్మించాల్సి ఉంటుంది. తొలి దశలో దీనిని నాలుగు వరసలుగా అభి వృద్ధి చేస్తారు. ఇందుకోసం ఎలైన్ మెంట్, భూసేకరణ చేపట్టాలి. ప్రాజెక్టులో ఈ రెండు కీలకమైనవి కావడంతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని గత నెల 10న రవాణ శాఖ మంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఆ మేరకు కొత్త కమిటీని నియమించారు. కమిటీలో ఆయా జిల్లాలకు చెందిన మంత్రులకు కూడా స్థానం కల్పిస్తే బావుండేదన్న అభి ప్రాయం వివిధ వర్గాల ద్వారా వ్యక్తమౌతోం ది. భూసేకరణ అంశం కీలకమైన ప్రక్రియ దృష్ట్యా స్థానిక మంత్రులైతే ప్రజలతో చొర వగా మాట్లాడి ఒప్పించడానికి అవకాశం ఉం టుంది. ఇందుకు అమరావతి రాజధాని నగర భూసమీకరణ నిదర్శనం. రైతులతో ఒప్పిం చేందుకు మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు, స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్, ఎంపీలు గల్లా జయదేవ్, రాయపాటి సాంబశివరావుతో పాటు ఇతర ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేశారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.